💥తం సూర్యం ప్రణమామ్యహమ్...
⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥తం సూర్యం ప్రణమామ్యహమ్...
యేవ సూర్య జ్యొతిషా బాధసే తమో
జగచ్చ విశ్వముదియర్షి భానునా
తేనాస్మద్విశ్వామనిరామనాహుతి
మపామీవామప దుష్వస్న్యం సువ – (ఋగ్వేదం)
🌹"ఓ సూర్య భగవానుడా నీవు నీ తేజస్సుతో ఏవిధంగా అంధకారాన్ని బంధిస్తున్నావో, ఏవిధంగా జగత్తుకు నీ దీప్తి వలన తేజస్సును ఇస్తున్నావో, అదేవిధంగా మా రోగాలను సర్వనాశనం చేసి, చెడు స్వప్నాలను మాకు దూరం చేయగలవు”
- పై మంత్రం ద్వారా సూర్యకాంతి సర్వరోగనివారిణి అని మనకు తెలుస్తోంది.
🍁🍁🍁🍁🍁
💥అదితి, కశ్యపులు సూర్యశక్తినుపాసించారు.
సూర్యుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
అదితి దేవతలను కాపాడమన్నది.
సూర్యశక్తి ఆమె గర్భంలో చేరింది. ఉపవాసాలు చేసింది.
వారించిన ముని మాటలతో అదితి గర్భాండమును పరిత్యజించగా, ఆ తేజం వలన నిప్పులు చెలరేగాయి.
ముని వేద మంత్రాలతో స్తుతించాడు.
అండం పగిలి దానినుండి ఒక సుదర్శన బాలుడు పుట్టి సూర్య నామముతో దేవతల నాయకుడై విజయం అందించాడు. విశ్వ నియంతయైనాడు.
అనంతకోటి కిరణుడు- తేజమయుడు- దినకరుడు-
వే వెలుగుల జ్యోతిర్మయుడు- త్రైలోక్య చూడామణి- దినమణి- ఆదిత్యుడు- శుభదాయకుడు- లోకరక్షకుడు- భక్తాభీష్ట వరప్రదుడు- మార్తాండుడు... సత్య, ధర్మ దయామూర్తిగా, ఆదిదేవునిగా యుగయుగాలలో ఆరాధింపబడుచున్నాడు.
నిత్య చైతన్యమూర్తి, జీవకోటికి ప్రాణశక్తిని అందించే ఆరోగ్య ప్రదాత లోకనాథుడు- లోకపాలకుడు భాస్కరుడు.
💥ఆదిత్యుడు 12 మాసాల్లో 12 రకాల రూపాలను ధరిస్తాడు గనుకనే ‘ద్వాదశాత్మ’ అనే పేరు వచ్చింది. నెలకో రూపాన్ని పొందుతూ ప్రకృతిని రక్షిస్తూ ఉంటాడు. ప్రతి మాసంలో ఆరేసిమంది పరిజనంతో పరిభ్రమిస్తుంటారు.
ఈ పరిజనంలోని ఆరుగురి పేర్లు...
కృతస్థలి- హేసి- వాసుకి - రధకృత్తు - పులస్త్యుడు- తుంబురుడు అనువారు.
ఈ ఆదిత్యుడు చైత్రంలో ధాత- వైశాఖంలో ఆర్యముడు- జ్యేష్ఠంలో మిత్రుడు- ఆషాఢంలో ఇంద్రుడు-
భాద్రపదంలో వివస్వంతునిగా, ఆశ్వయుజంలో తృష్టగా- కార్తీకంలో విష్ణువనీ- మార్గశిరంలో తవ్యముడనీ, పుష్యమాసంలో క్రతువుగా కీర్తింపబడుచున్నాడు.
నవగ్రహాలలో ప్రథమస్థానం ఆదిత్యునకే.
అందుకే...
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు, శుక్ర, శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
-అని స్తోత్రం చేస్తే సూర్యుడు అనుగ్రహిస్తాడు.
💥క్రియాత్మకః కాలః – కాలం క్రియాత్మకం.
సమగ్ర గతి కలిగిన కాలం సమస్త జగత్తుననూ నడిపిస్తుంది.
కాలమే సృష్ఠి. కాలమే లయం.
అటువంటి కాలానికి అధిపతి సూర్యుడు.
హాయశ్చ సప్త చ్ఛందాసి తన్నామాని బోధతః
సప్తజయంతి రథమేక చక్రమ్ అశ్వం సప్తనామాః – (యజుర్వేదం)
సూర్యుని రథం ఒకే చక్రం గలది.
సప్త అనే పేరుగల అశ్వం ఆ రథాన్ని లాగుతుంది.
సూర్యుని రశ్ములు అంటే కిరణాలు అశ్వరూపాలు.
ఆదిత్యుని నుంచి ఉత్పన్నమైన ఏడు కిరణాలలో ఏడో కిరణం "సప్త" అనే నామంతో లోకాన్ని ఉద్దీపింప చేస్తోంది. మిగిలిన ఆరు కిరణాలు ఆరు ఋతువులుగా ఏర్పడి కాలచక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయని వేదం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment