ఓం నమో భగవతే దక్షిణామూర్తయే

 ⚜️🕉️🚩ఓం నమో భగవతే దక్షిణామూర్తయే!🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్

సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్

ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే!!


🌹తాత్పర్యము:

రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా  యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును.

ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకు ముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో,  అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు.

ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

🍁🍁🍁🍁🍁


💥ఆధ్యాత్మిక జీవిత సాఫల్యానికి.. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే!


గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం |

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||


శివ స్వరూపాలలో విశేషమైంది ధ్యానమూర్తి దక్షిణామూర్తి రూపం.

దక్షిణ ముఖంగా ప్రతిష్ఠితమయ్యే శివరూపం ఇది. 


నిరంతరం కళ్ళు మూసుకొని, ధ్యానంలో ఉంటూ శిష్యుల సందేహాలను తన మౌనంతోనే పటాపంచలు చేయగలిగిన శివ స్వరూపం ఇది.


శివుణ్ణి భూమిగా భావిస్తే, భూమి సూర్యుని చుట్టూ చాలా క్రమశిక్షణతో, సమయ నియమం ప్రకారం తిరుగుతుంటుంది. ఈ కక్ష్యలో ఏ మాత్రం తేడా రాదు. 


ఇది ఒక ధ్యాని చేయాల్సిన పని. లోకంలో తమ పనులు తమకు ఎన్ని ఉన్నా మనసును మాత్రం తమకు శక్తినిచ్చే వాటి దగ్గరే కేంద్రీకరించాలనడానికి ఇదొక సంకేతం. 


దక్షిణ శబ్దానికి ‘కుడివైపు’, ‘సమర్థత’ అనే అర్థాలున్నాయి.

సమర్థుని ప్రవర్తనలో అధికమైన వ్యక్తీకరణలు ఉండవు. కేవలం విధి నిర్వహణలు మాత్రమే ఉంటాయి.

అందుకే, దక్షిణామూర్తి తత్త్వంలో ఈ ప్రత్యేకతలు కనిపిస్తుంటాయి.


ఈ శివమూర్తి ప్రత్యేకతల్లో మౌనమే ప్రధానం.

మౌనం పరావాక్కు స్వరూపం.

పరావాక్కు మూలశక్తికి సంకేతం.

అందుకే, దక్షిణామూర్తి స్వరూపమూ మూలశక్తి విధానాన్ని తెలియజేస్తుంది.


ఈ శక్తి దగ్గరగా ఉన్నవారికి ఎలాంటి లోపాలూ వుండవు. అన్ని విషయాల అవగాహన చెప్పకనే తెలుస్తుంది. కనుకే, సమర్థుడైన దక్షిణామూర్తి తత్త్వం అర్థం చేసుకుంటే అధ్యాత్మిక జీవితం సాఫల్యమవుతుంది. 


భౌతిక దేహాన్ని అధిగమించి మనోదేహంపై నిగ్రహం సాధించి, ఆత్మసాధనకోసం ప్రయత్నించడానికి దక్షిణామూర్తి ఉపాసన తప్పనిసరి.

మేధోవికాసం కలుగాలంటే ఈ స్వామి ఉపాసన అనివార్యం.

ఆధ్యాత్మిక విద్యలలో పురోగతిని సాధించడానికి ఈ మూర్తితత్త్వాన్ని అర్థం చేసుకోవాలి.


"ఓం నమో భగవతే దక్షిణామూర్తయే"

మంత్రాన్ని ఉపాసించడం ద్వారా పరావిద్య సాధన, భవరోగాల నుండి ముక్తి, గురువులకు గురువుగా మిగిలే అవకాశాలు అందరికీ లభ్యమవుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి.

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం