💥సమస్త గణాలకు అధినాయకుడు.. వినాయకుడు

 ⚜️🕉️🚩 ఓం ఉమాపుత్రాయ నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥సమస్త గణాలకు అధినాయకుడు.. వినాయకుడు


ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీ.

సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కాలంటే ముందు గణపతిని పూజించాలి.

గణపతిని తలచుకుంటే చాలు తలపెట్టిన ఏ కార్యక్రమమైనా నిరాటకంగా సాగిపోతుంది.


ఏ కార్యంలోనైనా తొలి పూజలందుకునే వినాయకుడు అంటే అందరికి ఎంత భక్తిభావమో, తన భక్తులపై కూడా గణపతికి వల్లమాలిన అభిమానం.


ఆయన రూపం, నామాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి.

విఘ్నాధిపతి రూపం విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం.


వినాయకుని తొండం ఓంకారానికి, ఏకదంతం పరబ్రహ్మకు, ఉదరం స్థిరత్వానికి, చేతుల్లోని పాశం రాగానికి, అంకుశం క్రోధానికి, అభయహస్తం భక్తుల రక్షణకు, మణికహస్తంలోని మోదకం ఆనందానికి ప్రతీకలు.


ఇతరులలోని అవలక్షణాలను చూడరాదనే విషయాన్ని గణపతి నేత్రాలు తెలియజేస్తే,

ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని చెవులు తెలియజేస్తాయి.


అన్ని విషయాలను కడుపులో దాచుకోవాలనే స్థిరత్వానికి సంకేతం తన ఉదరం ద్వారా వెల్లడిస్తే,

ఇతరులు వేసే నిందలు, దుర్భాషలను పట్టించుకోరాదని సంకేతం ఆయన పాదాలు వివరిస్తాయి. 


స్వామి ఒక చేతిలో మోదకం యశస్సు లేదా కీర్తికి సూచన.

ఒక చేతిలో పాశం చెడు మార్గంలో పయనించేవారిని దీనితో బంధించి తన మార్గంలోకి తెచ్చుకోవడానికి.


గణాధిపత్యం కోసం జరిగిన పోటీలో తన సోదరుడు కుమారస్వామిపై వినాయకుడు మీద విజయం సాధించాడు.

కేవలం తల్లిదండ్రుల పాదపద్మాలే పుత్రునికి గొప్ప తీర్థం భావించాడు.


కైలాసంలో ఉండి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా సమస్త నదుల్లో స్నానమాచరించిన పుణ్యం వినాయకుడు సాధించాడు.

అందుకే అన్ని గణాలకు అధిపతి అయ్యాడు.

🍁🍁🍁🍁🍁


💥మనోరథసిద్ధిప్రద గణేశ స్తోత్రం💥


స్కంద ఉవాచ |

నమస్తే యోగరూపాయ సంప్రజ్ఞానశరీరిణే |

అసంప్రజ్ఞానమూర్ధ్నే తే తయోర్యోగమయాయ చ || ౧ ||


వామాంగభ్రాంతిరూపా తే సిద్ధిః సర్వప్రదా ప్రభో |

భ్రాంతిధారకరూపా వై బుద్ధిస్తే దక్షిణాంగకే || ౨ ||


మాయాసిద్ధిస్తథా దేవో మాయికో బుద్ధిసంజ్ఞితః |

తయోర్యోగే గణేశాన త్వం స్థితోఽసి నమోఽస్తు తే || ౩ ||


జగద్రూపో గకారశ్చ ణకారో బ్రహ్మవాచకః |

తయోర్యోగే హి గణపో నామ తుభ్యం నమో నమః || ౪ ||


చతుర్విధం జగత్సర్వం బ్రహ్మ తత్ర తదాత్మకమ్ |

హస్తాశ్చత్వార ఏవం తే చతుర్భుజ నమోఽస్తు తే || ౫ ||


స్వసంవేద్యం చ యద్బ్రహ్మ తత్ర ఖేలకరో భవాన్ |

తేన స్వానందవాసీ త్వం స్వానందపతయే నమః || ౬ ||


ద్వంద్వం చరసి భక్తానాం తేషాం హృది సమాస్థితః |

చౌరవత్తేన తేఽభూద్వై మూషకో వాహనం ప్రభో || ౭ ||


జగతి బ్రహ్మణి స్థిత్వా భోగాన్భుంక్షి స్వయోగగః |

జగద్భిర్బ్రహ్మభిస్తేన చేష్టితం జ్ఞాయతే న చ || ౮ ||


చౌరవద్భోగకర్తా త్వం తేన తే వాహనం పరమ్ |

మూషకో మూషకారూఢో హేరంబాయ నమో నమః || ౯ ||


కిం స్తౌమి త్వాం గణాధీశ యోగశాంతిధరం పరమ్ |

వేదాదయో యయుః శాంతిమతో దేవం నమామ్యహమ్ || ౧౦ ||


ఇతి స్తోత్రం సమాకర్ణ్య గణేశస్తమువాచ హ |

వరం వృణు మహాభాగ దాస్యామి దుర్లభం హ్యపి || ౧౧ ||


త్వయా కృతమిదం స్తోత్రం యోగశాంతిప్రదం భవేత్ |

మయి భక్తికరం స్కంద సర్వసిద్ధిప్రదం తథా || ౧౨ ||


యం యమిచ్ఛసి తం తం వై దాస్యామి స్తోత్రయంత్రితః |

పఠతే శృణ్వతే నిత్యం కార్తికేయ విశేషతః || ౧౩ ||


ఇతి శ్రీముద్గలపురాణే మనోరథసిద్ధిప్రదం నామ గణేశస్తోత్రం సంపూర్ణమ్ |

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు