శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం:

 ⚜️🕉️🚩ఓం సరస్వత్యై నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


క్షోణితలంబునన్ నుదురు సోకక  మ్రొక్కినుతింతు సైకత

శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర

శ్రోణికి దోయజాత  భావచిత్త  వశీకరణైక వాణికిన్

వాణికి వక్షదామశుక వారిజపుస్తక రమ్యపానికిన్


🌹నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి, దేవతలను రక్షించే ఆమెకి, బ్రహ్మదేవుని మనస్సును వశపరుచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక,  పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి, సరస్వతీ దేవికి నా నుదురు నేలను తాకేటట్లు వంగి, భక్తితో నమస్కరిస్తాను.   

🍁🍁🍁🍁🍁


💥అన్ని సిరులకి మూలాధారం విద్య.

సమస్త విద్యల్ని అనుగ్రహించే తల్లి, అన్ని కళలకు శాస్త్రాలకు, వృత్తులకు, మేధస్సుకు, వాక్బుద్దికి అన్నింటికీ అధిష్టాన దేవత సరస్వతి దేవి.


శ్వేత వస్త్రాలను ధరించినదై హంస వాహనంతో తెల్లటి తామర పుష్పంపై కొలువుతీరి ఉంటుంది.

నాలుగు చేతులు నాలుగు దిక్కుల్లో వ్యాపించిన ఆ తల్లి శక్తిని సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి.


ఎడమ చేతి లోని పుస్తకం సమస్త భౌతిక విద్యలకు సంకేతమని తెలియచేస్తుంది.

కుడి చేతిలోని అక్షమాల సమస్త ఆధ్యాత్మిక విద్యలని ఆత్మ జ్ఞానాన్ని తెలియజేస్తుంది.


హస్త భూషణమైన వీణ, సకల కళల అధిదేవత గా ప్రకటిస్తుంది.

ఆ తల్లి చేతిలోని పాశాంకుశాలు మనిషి లోని మనోకాలుష్యాన్ని హరింపజేసే ఆయుధాలు గా చెప్పబడతాయి.


పాలని నీటిని వేరు చేసే హంస మంచి చెడుల విచక్షణ జ్ఞానంతో మసులుకోవాలనే సంకేతాన్ని తెలియచేస్తుంది.


సరః అంటే కాంతి..కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది.

అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.


తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది.

అహింసామూర్తి కనుకే ఈ తల్లి చేతిలో  ఆయుధాలు ఉండవు.

జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాలతో అవసరం ఏముంటుంది.


జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం.

అందుకే పుస్తకం, వీణలను చేతపట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది.


తత్వ విచారానికీ, పరిపూర్ణ వ్యక్తిత్వానికీ చిహ్నమైన కమలం మీద ఆశీనురాలై ఉంటుంది.

అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ  ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఆమెకు తొలిపూజలందిస్తారు.


💥శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం:


సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ

హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ {1}


ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ

తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా {2}


పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా

కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ {3}


నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ

ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ {4}


బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః

సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ

సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ {5}


ఇతి శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు