ఇతిహాసాల్లో సూర్యవైభవం...
⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥ఇతిహాసాల్లో సూర్యవైభవం...
ఇతిహాస, పురాణాల్లోనూ సూర్య మహిమ అనేక చోట్ల కనిపిస్తుంది.
"యాజ్ఞవల్క్య మహర్షి" సూర్యోపాసన ద్వారా "వాజసనేయ సంహిత" (శుక్ల యజుర్వేదం) పొందాడు.
🍁🍁🍁🍁🍁
💥#పురాణగాథ:
నాలుగు భాగాలుగా విభజించిన వేదాలని నేర్పడానికి నలుగురు శిష్యుల్ని ఎంచుకున్నారు వేదవ్యాస మహర్షి.
"పైలవ" మహర్షితో ఋగ్వేదం, "వైశంపాయన" మహర్షితో యజుర్వేదం, "జైమిని" మహర్షితో సామవేదం, "సుమంత" మహర్షితో అథర్వణవేదం అధ్యయనం చేయించారు.
ఈ మహర్షులందరు తాము నేర్చుకున్న వేదభాగాన్ని తమ తమ శిష్యులకి నేర్పించారు.
ఆ శిష్యులు తాము నేర్చుకున్న వేదాన్నిమళ్ళీ తమ శిష్యులకి నేర్పించడంతో వేదవిద్య క్రమంగా వ్యాప్తిలోకి వచ్చింది.
💥వైశంపాయన మహర్షి తను నేర్చుకున్న వేద భాగాల్లో ఒకటైన యజుర్వేదాన్ని "యాజ్ఞవల్క్యుడు" మొదలైన శిష్యులకి నేర్పించారు.
ఒకరోజు భారతదేశంలో ఉన్న మహర్షులందరు మేరు పర్వతం మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అందరూ తప్పకుండా ఆ సమావేశానికి హాజరవాలని, ఎవరేనా రాకపోతే వాళ్ళకి బ్రహ్మహత్యా దోషం కలుగుతుందనీ కూడా నిర్ణయించారు.
అనుకోని కారణాల వలన వైశంపాయన మహర్షికి ఆ సమావేశానికి వెళ్ళడానికి వీలు కలగలేదు.
దానివల్ల అయనకి బ్రహ్మహత్యాదోషం కలిగింది.
అంతే కాకుండా పసివాడయిన ఆయన మేనల్లుడు ప్రమాదవశాత్తూ ఆయన కాళ్ళకిందే పడి చనిపోయాడు. దానితో వైశంపాయన మహర్షికి బ్రహ్మహత్యా దోషంతో పాటు బాలహత్యాదోషం కూడా సంక్రమించింది.
ఆ పాపాల్ని పోగొట్టుకోవడం కోసం తన శిష్యులైన చరకాధ్వర్యుల్ని పిలిచి తపస్సు చెయ్యమన్నారు. గురువు ఆజ్ఞ ప్రకారం చరకాధ్వర్యులు తపస్సు చెయ్యడం ప్రారంభించారు.
ఆ సమయంలో యాజ్ఞవల్క్య మహర్షి తన గురువైన వైశంపాయన మహర్షిని కలుసుకోవాలని వచ్చారు.
చరకాధ్వర్యులు తపస్సు చెయ్యడం చూసి విషయం ఏమిటని గురువుగార్నిఅడిగారు.
వైశంపాయనులు జరిగిన విషయం శిష్యుడికి వివరించారు.
అది విని యాజ్ఞవల్క్య మహర్షి "గురువర్యా ! వీళ్ళకి జ్ఞానం తక్కువ. అంత గొప్ప తపస్సు చెయ్యడం వీళ్ళ వలన ఏమవుతుందీ? మీకు కలిగిన పాపాలన్నీ పోయేలా నేను గొప్ప తపస్సు చేస్తాను. దయచేసి అనుగ్రహించండి!” అన్నారు.
తన తోటి శిష్యుణ్ణి అవమాన పరుస్తూ మాట్లాడిన యాజ్ఞవల్క్య మహర్షిని చూసి "నీతో కలిసి చదువుకుంటున్న వాళ్ళని, తోటి బ్రాహ్మణుల్ని అమితమైన అహంకారంతో అవమానించి మాట్లాడావు. ఇంత అహంకారంతో విర్రవీగుతున్న నువ్వు నా దగ్గర విద్య నేర్చుకునేందుకు అర్హుడవు కాదు. నేను నీకు నేర్పించిన వేదవిద్యని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపో!” అన్నారు వైశంపాయన మహర్షి.
గొప్ప శక్తిసామర్ధ్యాలు, ఆత్మాభిమానం కలిగిన యాజ్ఞవల్క్య మహర్షి తను నేర్చుకున్న యజుర్వేద మంత్రాల్ని గురువుగారి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు.
యాజ్ఞవల్క్య మహర్షి వదిలి వెళ్ళిన యజుర్వేద మంత్రాల్ని వైశంపాయన మహర్షి శిష్యులు చరకాధ్వర్యులకి నేర్పించారు.
యాజ్ఞవల్క్య మహర్షి వదిలి వెళ్ళిన తరువాత చరకాధ్వర్యులు ఇద్దరూ నేర్చుకున్న యజుర్వేద మంత్రాలనే "కృష్ణ యజుర్వేదం" అంటారు.
దీని సంహిత పేరు ’తైత్తరీయ సంహిత’
యాజ్ఞవల్క్య మహర్షి తను నేర్చుకున్న యజుర్వేద మంత్రాల్ని గురువుగారి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాక సూర్యుణ్ణి ఆరాధించారు.
సూర్యుడి అనుగ్రహంతో యజుర్వేద మంత్రాల్ని మళ్ళీ పొందగలిగారు.
సూర్యుడి అనుగ్రహంతో యాజ్ఞవల్క్య మహర్షి నేర్చుకున్న యజుర్వేదాన్ని “శుక్ల యజుర్వేదం” అంటారు.
యాజ్ఞవల్క్య మహర్షి కణ్వమహర్షిని, మాధ్యందిన మహర్షిని తన శిష్యులుగా స్వీకరించి సూర్యుడు తనకు అనుగ్రహించిన శుక్ల యజుర్వేదాన్ని వాళ్ళకి నేర్పించారు.
ఈ వేదభాగాన్ని "వాజసనేయ సంహిత అంటారు.
💥సూర్యారాధన వల్ల విజ్ఞానం, ఉత్తమ గుణాలు, వర్చస్సు, ఆయుష్షు, ధనం, సంతానభాగ్యం కలుగుతాయి.
వాత, పిత్త, క్షయ, కుష్ఠు వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మొత్తంగా ఆరోగ్య సంపద ఆదిత్యుని ఉపాసన ద్వారా వరంగా లభిస్తుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment