💥శ్రావణమాసం శుక్ల పంచమి... "నాగపంచమి"/"గరుడ పంచమి"

 ⚜️🕉️🚩 ఓం నాగేంద్రాయ నమః🌹🙏 

🏵️🌼🏵️🌼🏵️


💥శ్రావణమాసం శుక్ల పంచమి... "నాగపంచమి"/"గరుడ పంచమి"


పార్వతీదేవికి సాక్షాత్తు పరమేశ్వరుడు నాగపంచమి వైశిష్ట్యాన్ని వివరించినట్లు స్కంద పురాణంలో ఉంది.


నిత్యం పూజించే నారాయణుడి శేషశయునుడి పర్వమే ఈ నాగ పంచమి.

బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు..


ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతడిని ఏదైనా వరం కోరుకొమ్మని అడిగితే, తాము (సర్పజాతి) ఆవిర్భవించిన రోజున సృష్టిలోని మానవులంతా తమకు పూజ చేసేలా అనుగ్రహించమని అడిగాడు. విష్ణుమూర్తి అనుగ్రహించాడు.


ఈ వరం కారణంగా శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకునే ఆచారం వ్యాప్తిలోకి వచ్చింది.


నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు.

సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజు మరియు నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక రోగాలు రావు. వంశము అభివృద్ధి అవుతుంది.

సంతానోత్పత్తి కలుగుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది.

అన్ని కార్యములు సవ్యంగా నెరవేరతాయి.

కాలసర్ప దోషాలు, నాగ దోషాలు ఉన్నా తొలగిపోతాయి.


💥చక్కని సంతానాన్ని ఇచ్చే "గరుడ పంచమి"


కశ్యప ప్రజాపతికి వినత.. కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు.

వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది.

అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి 'నాగ పంచమి'గా పిలవబడుతోంది.


ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తుంటారు.


శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్ప భయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు.


అలాగే 'గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. 


అయితే సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది.

సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. 


విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది.


సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది.

అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు.

అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు.


సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు.

అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.


💥గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకొంటారు.


ఇంటి ద్వారానికి రెండువైపులా సర్పాల ఆకృతులను వేస్తారు.

పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకిస్తారు.

అలాగే పసుపు రంగు దారాలను చేతికి కడతారు.

కొందరు వెండి, రాగి, రాతి, చెక్కలతో నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు.


నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేసి పెరుగును, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యముగా పెడతారు.


పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇస్తారు. 


నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు.

ఈ విధంగా చేసిన వారికి నాగరాజు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి అని నమ్ముతారు.


తమను ఆరాధించిన వారికి ఎటువంటి హాని కల్గించకుండా వారిని నాగులు సంరక్షిస్తాయని అగ్ని పురాణం, స్కంద పురాణం, నారద పురాణాలలో ఉన్న నాగ విశిష్టత తెలుపుతోంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం