"రామో విగ్రహవాన్ ధర్మః"
⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ।
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ॥
🌹మనోహరుడు, లక్ష్మణుని అగ్రజుడు, సీతాపతి, రఘుకులములో ఉత్తముడు, కరుణా సాగరుడు, సర్వ సులక్షణ సంపన్నుడు, బ్రాహ్మణులకు ప్రియుడు, ధర్మ రక్షకుడు, సత్య సంధుడు, రాజేంద్రుడు, దశరథ పుత్రుడు, నల్లని వాడు, శాంతమూర్తి, రావణుని సంహరించిన వాడు, లోకాభిరాముడు అయిన రామునికి వందనములు.
🍁🍁🍁🍁🍁
💥ఒక మంచి సోదరుడు, ఒక మంచి కుమారుడు, ఒక మంచి పాలకుడు, ఒక మంచి మిత్రుడు, ఒక మంచి శిష్యుడు, ఒక మంచి నాయకుడు, అసమాన వీరుడు ఇలా ఎన్నో ఉత్తమ పార్శ్వాలు దర్శనమిస్తాయి శ్రీరామునిలో...
మాధవుడే మానవునిగా జన్మించినా, పరిపూర్ణ మానవునిగా, మానవాళికి వెలుగుచూపే దారిదివ్వె.
నాటికీ, నేటికీ, ఏనాటికీ రాముని శీలసంపద, గుణసంపత్తి, అగాధమైన అమృతసాగరం.
సర్వకాలాలకూ, సర్వదేశాలకూ ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం.
జన్మతః రాక్షసుడైనా రామ బాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు రాముని వ్యక్తిత్వాన్నీ, దివ్యత్వాన్నీ సంపూర్ణంగా అవగాహన చేసుకొన్న ధన్యజీవి.
అతని మాటల్లోనే రాముని గురించిన ఏకవాక్య సమగ్ర వివరణ..
"రామో విగ్రహవాన్ ధర్మః"
- మూర్తీభవించిన ధర్మమే రాముడు.
💥"క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం" అని చెపుతాడు భర్తృహరి.
"ఇతర ఆభరణాలన్నీ నశించిపోయేవే శాశ్వతమైన భూషణం వాగ్భూషణమే" అని దీని భావం.
వాక్కు భావ ప్రకటనా సామర్థ్యానికి ప్రధానమైన సాధనం.
ఈ సామర్థ్యం రాముని సహజ లక్షణము.
శ్రీరాముడిని ‘వచస్విగా, ‘వాగ్మి’(చక్కని వక్త)గా వాల్మీకి వర్ణించాడు.
రామచంద్రుడు మృదుభాషి, మితభాషి, మధురభాషి, పూర్వభాషి, స్మితపూర్వభాషి అని ప్రశంసించాడు.
తానే ముందుగా పలకరించడం, నెమ్మదిగా, ప్రశాంతంగా ఆవేశానికి లోను కాకుండా మాట్లాడగలగడం రాముని ప్రధాన లక్షణాలు.
రాముడు పూర్వభాషి మాత్రమే కాదు.
బంగారానికి తావి అబ్బినట్టు, స్మిత పూర్వభాషి కూడా.
ముందు చిరునవ్వుతో పలకరించి, తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబరచేవాడు.
మితభాషిత్వం, సత్యభాషిత్వం, చిరునవ్వుతో సంభాషించడం ఇవన్నీ మనకందరికీ అనుసరణీయాలూ, ఆచరణీయాలు కూడా.
💥అంతేకాదు... కొద్ది నిముషాలు ఎదుటివ్యక్తితో మాట్లాడగానే అతని వ్యక్తిత్వాన్నీ, సామర్థ్యాన్నీ అంచనా వేయగలిగే సామర్థ్యం కూడా రాముని సొత్తు.
కిష్కింధకాండలో హనుమంతుడు రాముని తొలిసారిగా యతి వేషంలో కలిసి రామునితో పరిచయవాక్యాలుగా నాలుగు మాటలు మాట్లాడుతాడు.
సహజంగా తానే వాగ్మి ఐన రాముడు హనుమంతుని సామర్థ్యాన్ని గురించి ఖచ్చితమైన అంచనా వేస్తాడు.
ఈ వ్యక్తి వేదవేత్త అనీ, వ్యాకరణ నిపుణుడనీ, మాట్లాడే సమయంలో ఇతని శరీర భంగిమలు, మాట్లాడే విధానమూ ఇతనిని ఒక అసాధారణ ప్రతిభా సంపన్నుడిగా తెలియచేస్తున్నాయని అంటాడు.
ఇట్టి మంత్రివర్యుని కలిగిన రాజుకు అసాధ్యమైనది ఉండదనీ లక్ష్మణునితో చెబుతాడు రాముడు.
దీన్నిబట్టే రాముని సూక్ష్మబుద్ధి ఎలాంటిదో తెలుసుకోవచ్చు.
ఆదర్శ మానవ సంబంధాలు, ఆదర్శ కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని నా జీవితమే నా సందేశం అన్నట్లుగా జీవించి చూపిన అవతారమే శ్రీరామావతారం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment