💥శ్రీ హనుమాన్ చాలీసా.. తెలుగులో
⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
🌹🌹జై శ్రీరామ్ - జై హనుమాన్🌹🌹
💥శ్రీ హనుమాన్ చాలీసా.. తెలుగులో
అనువాదము: శ్రీ ఎం ఎస్ రామారావు గారు.
ఆపదామపహర్తారం
దాతారం సర్వసంపదాం |
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం ||
హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః |
ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా |
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ ||
-------*---------*---------
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు |
బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్భుదములని తెలుపు సత్యములు ||
జయ హనుమంత జ్ణానగుణవందిత
జయపండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ
అంజనీపుత్ర పవనసుతనామ
ఉదయభానుని మధురఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన
కాంచనవర్ణ విరాజితవేశా
కుండలమండిత కుంచితకేశా ||
| శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు |
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీపతి ముద్రిక దోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని
సూక్ష్మరూపమున సీతను చూచి
వికటరూపమున లంకను గాల్చి
భీమరూపమున అసురుల జంపిన
రామకార్యమును సఫలముజేసిన
| శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు |
సీత జాడకని వచ్చిననిను కని
శ్రీరఘువీరుడు కౌగిట నినుగొని
సహస్రరీతుల నిను కొనియాడగ
కాగలకార్యం నీపై నిడగా
వానరసేనతో వారధిదాటి
లంకేశునితో తలపడి పోరి
హోరుహోరున పోరుసాగిన
అసురసేనల వరుసన గూల్చిన
| శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు |
లక్ష్మణ మూర్చతో రాముడడలగ
సంజీవిదెచ్చిన ప్రాణప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాటికి
అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని శ్రీరామ బాణము
జరిపించెను రావణ సంహారము
ఎదిరిలేని ఆ లంకాపురమున
ఏలికగా ఆ విభీషణు చేసిన
| శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు |
సీతారాములు నగవులు గనిరి
ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశ్రువులే
అయోధ్యాపురి పొంగిపొరలే
సీతారాముల సుందర మందిరం
శ్రీకాంతుపదం నీ హృదయం
రామచరిత కర్ణామృతగానా
రామనామ రసామృతపాన
| శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు |
దుర్గమమగు ఏ కార్యమైన
సుగమమేయగు నీ కృపజాలిన
కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణయున్న
రామద్వారపు కాపరివైన నీ
కట్టడిమీర బ్రహ్మాదుల తరమా
భూతపిశాచ శాకినీ ఢాకినీ
భయపడి పారు నీ నామ జపమువిని
| శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు |
ధ్వజావిరాజా వజ్రశరీరా
భుజబలతేజా గదాధరా
ఈశ్వరాంశ సంభూత పవిత్ర
కేసరీపుత్ర పావనగాత్ర
సనకాదులు బ్రహ్మాదిదేవతలు
శారద నారద ఆదిశేషులు
యమకుబేర దిక్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తిగానముల
| శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు |
సోదర భరత సమానాయని
శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా
సాధులపాలిట ఇంద్రుడవన్నా
అసురలపాలిట కాలుడవన్నా
అష్టసిద్ధి నవనిధులకు దాతగా
జానకీమాత దీవించెనుగా
రామరసామృతపానము చేసిన
మృత్యుంజయదవై వెలసిన
| శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు |
నీనామ భజన శ్రీరామ రంజన
జన్మ జన్మాంతర దుఃఖభంజన
ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగ మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన
| శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు |
శ్రద్ధగా దీనిని ఆలకింపుమా
శుభమగు ఫలములు గలుగుసుమా
భక్తిమీరగ గానముసేయగ
ముక్తి గలుగు గౌరీశులసాక్షిగ
తులసీదాస హనుమాను చాలీసా
తెలుగున సుళువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున
దోశములున్న మన్నింపుమన్నా
| శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు |
మంగళ హారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత |
నా అంతరాత్మ నిలుమో అనంతా
నీవే అంతా శ్రీహనుమంత ||
సంపూర్ణము ఓం శాంతిః శాంతిః శాంతిః
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment