Posts

Showing posts from April, 2025

💥శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 దుర్గమ్మ భక్తులకు సులభంగా వరాలిచ్చే తల్లి. భక్తులను తన కంటి రెప్పలా కాపాడుకునే ఆ తల్లి వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంత విన్నా తనివితీరదు..  ఆమె అనంత శక్తి మంతురాలు.. ఈ జగానికే మాత.. శ్రీ మాతా మహారాజ్ఞి లీలలు.. చింతామణి గృహంలో కొలువైన ఆమె శోభను గురించి ఎంత వర్ణించినా తక్కువే.. సర్వకార్యాలను సులభంగా నెరవేరుస్తుంది..  నమ్మిక ఉంచి అర్చించి శరణు కోరుకున్న వారికి నిత్యం అండగా ఉంటుంది. కలియుగంలో సర్వేష్ట సాథిని ఆమె.. ఆమెను స్మరించినంత మాత్రాన భయాలుండవు.. ఈతి బాధలుండవు.. దరిద్రం దుఃఖాలు ఉండవు.. ఆమె సర్వోపకారిణి, శరణాగత దీనార్త పరాయణి దుర్గాదేవి. 💥శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం💥 నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే । నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 1 ॥ నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే । నమస్తే నమస్తే సదానందరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 2 ॥ అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః । త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి ద...

⚜️🕉️🚩 ఓం గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏 బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్ మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే #తాత్పర్యము: వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా  తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు. 💥హిందూ పురాణాల ప్రకారం స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణామూర్తి ఉపాసనతో గురు దోషాలు తొలగిపోతాయని గురువులు చెబుతారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నియమనిష్టలతో పారాయణ చేస్తే గురు గ్రహ అనుకూలత లభిస్తుందని అంటారు. శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రంలో వర్ణించిన దక్షిణామూర్తి స్వరూపాన్ని పరిశీలించినప్పుడు.. దక్షిణామూర్తి ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఒక కాలు కింద రాక్షసుణ్ణి తొక్కిపట్టినట్లుగా ఉంటుంది. మరో కాలు పైకి ...

⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏 'జటాధరమ్ పాండురంగమ్ శూలహస్తం కృపానిధిమ్ సర్వరోగహరమ్ దేవమ్ దత్తాత్రేయ మహంభజే' భూలోకంలో సాధారణ మానవుడిగా జన్మించి సంపూర్ణ ఇహపర జ్ఞానాన్ని మానవాళికి అందించిన మహత్తర గురువుగా దత్తాత్రేయుడు పూజలందుకుంటున్నాడు. త్రిమూర్తుల అంశ. గురువులకే మహా గురువు. 'అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామీ స్వభక్తానా ముద్దర్తా భవసంకటాత్'... 'స్మర్తృగామీ' అంటే 'తలచిన వెంటనే ప్రసన్నుడవుతాడు' అని అర్థం. సమస్త ప్రాణకోటికి తనకు తాను అర్పితమైనవాడు (దత్తమైనవాడు) కనుక దత్తుడని, అత్రి మహర్షి వరపుత్రుడు కనుక ఆత్రేయుడని... ఈ రెండు పదాల కలయికతోనే 'దత్తాత్రేయుడు'గా పేరు పొందారని చెబుతారు. తనకు తానుగా భక్తులకు దత్తమవుతాడు అంటే... భక్తుల అధీనంలో ఉంటాడని అర్థం. భక్తులకు లోకాన్ని ఏలే తండ్రిగా కంటే పుత్రసమానుడిగా సేవలు అందిస్తాడు. తన మహిమలు చూపడం కంటే భక్తుల మహిమల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చి, వారి కీర్తిని పెంచుతాడట. అందుకే... 'భక్త కీర్తి వివర్ధనుడు'గా కీర్తి పొందాడు. ఆయనను దిగంబరుడు అనీ అంటారు. అంటే నగ్నం అని కాకుండా 'దిగంతాలనే అం...

💥శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నారసింహాయ నమః🌹🙏 నృసింహ స్వామి వారి "ద్వాదశ నామ స్తోత్రం" మహా మహిమాన్వితం, శక్తివంతం. ఈ స్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామి వారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు. బుధవారం పూట ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠిస్తే.. అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి, భయం తొలగుతుంది. 💥శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం💥 అస్య శ్రీనృసింహ ద్వాదశనామస్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ఛందః లక్ష్మీనృసింహో దేవతా శ్రీనృసింహ ప్రీత్యర్థే వినియోగః | #ధ్యానం స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణమ్ | నృసింహమద్భుతం వందే పరమానంద విగ్రహమ్ || #స్తోత్రం  ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ | తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః || 1 || పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః | సప్తమో యాతుహన్తా చ అష్టమో దేవవల్లభః || 2 || నవ ప్రహ్లాదవరదో దశమోఽనంతహస్తకః | ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా || 3 || ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః | మన్త్రరాజేతి విఖ్యాతం సర్వపాపవినాశనమ్ || 4 || క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణమ్ | రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే || 5 || గిరిగహ్వార ఆరణ్యే వ్యాఘ్రచ...

💥దారిద్య్ర దహన గణపతి స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం.  సకల శుభాలనూ అనుగ్రహించే ఈ గణపతి స్తోత్రం భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే, ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ప్రతీరోజూ ఈ మహా మహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం. ఆర్థిక సమస్యలతో, దారిద్య్ర బాధలతో ఇబ్బంది పడేవారు ప్రతీరోజూ ఈ స్తోత్రాన్ని పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వల్ల అన్ని అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ స్తోత్రాన్ని  శ్రీ ఆది శంకరాచార్యులవారు రచించారు. 💥దారిద్య్ర దహన గణపతి స్తోత్రం💥 సువర్ణ వర్ణ సుందరం సితైక దంత-బంధురం గృహీత పాశ-మంకుశం వరప్రదా-ఽభయప్రధమ్ । చతుర్భుజం త్రిలోచనం భుజంగ-మోపవీతినం ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్ ॥ కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి-యష్టికమ్ । ప్రభాత సూర్య సుందరాంబర-ద్వయ ప్రధారిణం సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి-పంకజమ్ ॥ సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం గృహ ప్రతీర్ణ సుందరం యుగక్షణ ప్రమోదితమ్ । కవీంద్ర చి...

💥సనత్కుమారుడు పార్వతీ పరమేశ్వరులకు ఇచ్చిన వరమేమి?

Image
 ⚜️🕉️ ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 మహామ్భోధి తీరే మహాపాపచోరే మునీన్ద్రానుకూలే సుగంధాఖ్య శైలే | గుహాయాం వసన్తం స్వభాసా లసన్తం జనార్తిం హరన్తం శ్రయామో గుహం తమ్ భావం: మహా సముద్ర తీరమందున్నదీ, మహా పాపములు హరించునదీ, మునీంద్రులకు ఆవాసమునగు గంధశైలమునందు, గుహయందు తన కాంతితో ప్రకాశించుచు నివసించుచున్నవాడును, జనుల బాధలను హరించువాడును అగు కుమారస్వామిని సేవింతుము. 💥సనత్కుమారుడు పార్వతీ పరమేశ్వరులకు ఇచ్చిన వరమేమి? సరే ఇంతమందికి పుత్రుడైనాడు, మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు... అని అడిగితే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్య ఖండంలో, బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా, శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అక్కర్లేదు. ఇవ్వడానికి నువ్వొకడివి, నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది. ఉన్నది అంతా ఒకటే కాబట్టి, నాకే వరమూ అవసరం లేదు అని చెప్తాడు....

⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 ‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్‌ బాష్పవారి పరిపూర్ణ లోచనమ్‌ మారుతిం నమత రాక్షసాంతకమ్‌..’ 'శ్రీరాముడి కీర్తనం ఎక్కడ వీనులవిందుగా వినిపిస్తుందో.. అక్కడ తలవంచి, జోడించిన చేతులు తల మీద ఉంచి, ఆనందబాష్పాలు చిందిస్తూ ఉండే, రాక్షసాంతకుడైన మారుతికి నమస్కరిస్తున్నాను’ అని దీని భావం.  ఆంజనేయుడు రామనామ చింతనా స్వాంతుడు. రామ పాదారవింద సేవా భాగ్యవంతుడు. ఏ చిత్రపటంలో చూసినా రాముని పాదాల చెంత ముకుళిత కరకమలాలతో కూర్చొని దర్శనమిస్తూ ఉంటాడు. ఆ మహాత్ముడు రక్తిని కోరలేదు. విరక్తినీ కోరలేదు. భక్తినీ కోరలేదు. ముక్తినీ కోరలేదు. నిరంతరం రామసేవలో తరించాడు. సేవ.. సేవ.. సేవ.. అంతే! 'ఈ రోజు ఏం తిథి?’ అని హనుమను ఎవరో అడిగితే ‘తిథులు, వారాలు నాకు తెలియవు. రామనామం ఒక్కటే తెలుసు’ అన్నాడట. ఆ రామనామ స్మరణతోనే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. వానరులలో ఎవ్వరూ కనుక్కోలేని సీతామాత జాడను తెలుసుకొని లోకోత్తర కార్యాన్ని సాధించగలిగాడు. అదీ భగవత్‌ సేవ అంటే! అందుకే రామానుగ్రహం పొంది భవిష్యత్‌ విధాత అయ్యే అవకాశానికి నోచుకున్నాడు ఆంజనేయుడు. పరాక్రమంలో హనుమకు...

💥శివ స్తోత్రం (హిమాలయకృతం)💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥శివ స్తోత్రం (హిమాలయకృతం)💥 💥ఈ శక్తివంతమైన స్తోత్రం చదివినా లేదా విన్నా దీనిని ప్రార్థించడం ద్వారా  శంకర భగవానుని అనుగ్రహాన్ని పొందుతారు. ఈ శివ స్తోత్రాన్ని అభ్యసించడం ద్వారా సాధకుని కోరికలన్నీ నెరవేరుతాయి. || శివాయ నమః ||  💥హిమాలయ కృతం శివ స్తోత్రమ్💥 హిమాలయ ఉవాచ ||  త్వం బ్రహ్మా సృష్టికర్తా చ త్వం విష్ణుః పరిపాలకః |  త్వం శివః శివదోఽనన్తః సర్వసంహారకారకః || 1 ||  త్వమీశ్వరో గుణాతీతో జ్యోతీరూపః సనాతనః  ప్రకృతః ప్రకృతీశశ్చ ప్రాకృతః ప్రకృతేః పరః || 2 ||  నానారూపవిధాతా త్వం భక్తానాం ధ్యానహేతవే |  యేషు రూపేపు యత్ప్రీతిస్తత్తద్రూపం బిభర్షి చ || 3 ||  సూర్యస్త్వం సృష్టిజనక ఆధారః సర్వతేజసామ్ |  సోమస్త్వం సస్యపాతా చ సతతం శీతరశ్మినా || 4 ||  వాయుస్త్వం వరుణస్త్వం చ విద్వాంశ్చ విదుషాం గురుః |  మృత్యుఞ్జయో మృత్యుమృత్యుః కాలకాలో యమాన్తకః || 5 ||  వేదస్త్వం వేదకర్తా చ వేదవేదాఙ్గపారగః |  విదుషాం జనకస్త్వం చ విద్వాంశ్చ విదుషాం గురుః || 6 ||  మన్త్రస్త్వం హి జపస్త్వం హి తపస్త్వం తత్ఫలప్రదః | వ...

💥మహా మహిమోన్నతం భస్మధారణం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥మహా మహిమోన్నతం భస్మధారణం💥 శివరూపం మంగళకరం. శివనామం ముక్తిదాయకం. శివశబ్దము ఆనందదాయకం. జ్ఞానదాయకం. శివరూపం మహిమాన్వితం. మంగళమూర్తియైన శివుడు లోకాలన్నింటిని అతలాకుతలం చేసే గరళాన్ని తన కంఠమునందు నిల్పుకొని గరళకంఠుడయ్యాడు. గరళముచే కంఠము నీలిరంగుగా మారడంచే నీలకంఠుడయ్యాడు. అల్ప సంతోషి. పరమ దయాసాగరుడు, దీనబాంధవుడు,  సంహారశక్తిగా కనిపించే శివయ్య లోకరక్షకుడు కూడా అయ్యాడు. నిత్యము శరీరమునకు భస్మమును దరించుట చేత భస్మాంధగుడయ్యాడు. సృష్టి స్థితి లయ కారులైన త్రిమూర్తులలో లయకారుడైన శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది భస్మము. భస్మధారణ వైదిక సంస్కృతి. శైవమతాలన్నీ వేదము నుండి స్వీకరించిన సంప్రదాయమిది. భస్మంలో అగ్ని, నీరు, పృథివి అనే మూడు ప్రత్యక్ష భూతముల మేళనముంది. భస్మమనగా "భాసనాత్ భసితం ప్రోక్తం భస్మకిల్బిష భక్షనాత్" అని శివపురాణ వాక్యము. భాసము చేత భస్మము. అనగా ప్రకాశ స్వరూపం. సర్వ పాపాలను భస్మం చేసి జ్ఞానదీప్తిని అందించేది భస్మం. అగ్నిసారమైన భస్మం ఐశ్వర్యదాయకం. కనుకనే విభూతి అని నామాంతరం. "భూతిర్విభూతి రైశ్వర్యం" అని నిఘంటువు ద్వారా తెలియుచున్నది. విభూతి ...

⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ🌹🙏 రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మనుమ్ / యావజ్జీవం జపన్ మర్త్యో జీవన్ముక్తో న సంశయః // 🌹రామ, రామచంద్ర, రామభద్ర, అను ఈ మంత్రాలలో దేనినైనను జీవితాంతం వరకు జపించు మనుజుడు జీవన్ముక్తుడు కాగలడు. ఇందులో సంశయం లేదు. రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం విగచ్ఛతి / మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి // 🌹'రా' అను శబ్దం ఉచ్చరించగానే పాపం వదనము నుండి బయటపడును. పిదప 'మ'కారము వినుటతోడనే భస్మమైపోవును కృశాను (అగ్ని) 'ర'అక్షరం అగ్నిబీజాక్షరం. భాను (సూర్యుడు) 'అ'అక్షరం సూర్యబీజాక్షరం. హిమారక (చంద్రుడు) 'మ'అక్షరం చంద్రబీజాక్షరం. ఈ మూడు బీజాక్షరములు కలసి "రామ" శబ్దమయ్యెను.  అగ్ని గుణం దహించుట. అగ్నిబీజాక్షరమగు  'ర' శుభాశుభ కర్మలను దహించి మోక్షమును ఇచ్చును.  సూర్యుని వలన అంధకారం నశించును. అటులనే సూర్య బీజాక్షరం 'అ' మోహాంధకారమును పోగొట్టును. చంద్రుడు తాపమును హరించును. అటులనే చంద్రుని బీజాక్షరం 'మ' తాపత్రయమును హరించును. ఉత్పత్తి కర్తయగు బ్రహ్మవంటివాడు చంద్రుడు. పోషణ కర్తయగు విష్ణువువంటివాడు సూర్యుడ...

💥ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాః💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏 "ఆరోగ్యం భాస్కరాదిత్యేత్" అంటుంది శాస్త్రం. ఆరోగ్య ప్రదాతగా, ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకునే సూర్యభగవానుడు సమస్త జీవరాశికి పోషకుడు.  సూర్యభగవానుడికి నమస్కరించి ఆ తరువాత చేసే పూజలకు మాత్రమే ఫలితం దక్కుతుందనేది మహర్షుల మాట. ఈ క్రమంలో పన్నెండు మాసాలలో ద్వాదశ ఆదిత్యులు సంచరిస్తూ ఉంటారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.  హిందూ పురాణాల ప్రకారం సూర్యుని ద్వాదశ ఆదిత్యులుగా ఆరాధించడం సంప్రదాయం. అదితి, కశ్యపులు యొక్క 12మంది పుత్రులను "ద్వాదశాదిత్యులు" అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో అభివర్ణిస్తారు. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో శుచియై సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ద్వాదశ ఆదిత్యులలో ఒక్కో ఆదిత్యుని పేరు చెబుతూ 12 సూర్య నమస్కారాలు చేయడం సూర్యుని ఆరాధించే విధానం. ఈ విధంగా ఎవరైతే ప్రతిరోజూ చేస్తారో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని శాస్త్ర వచనం. 💥ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాః💥 1. ధాతా ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే । పులస్త్యస్తుంబురురితి మధుమాసం నయంత్యమీ ॥ ధాత...

💥#శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏 అనంత స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్న వారికి కోరినన్ని వరాలను ఇచ్చే  దయామయుడు. అందుకే ఆ స్వామిని '#కోటివరాలదేవుడు' అని పిలుస్తున్నారు. ఆ స్వామి నామస్మరణ సకల శుభకరం.  ఆ స్వామి 'నారాయణ' నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అన్ని రకాలైన దుఃఖాలను నేలమట్టం చేసి, సకల ఐశ్వర్యాలను ప్రసాదించి, పరమపదానికి చేరుస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం.. విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది. 💥#శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి💥 ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || 1 || న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || 2 || మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్ మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || 3 || నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || 4 || రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్ కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || 5 || య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ యజ్ఞాంగరూపిణే తుభ్యం య...

💥చైత్ర శుద్ధ పౌర్ణమి.. శ్రీ హనుమద్విజయోత్సవం💥

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ । తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తు తే ॥ 💥చైత్ర శుద్ధ పౌర్ణమి.. శ్రీ హనుమద్విజయోత్సవం💥 పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు. అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.  ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్రపూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చే...

💥శ్రీ కామాక్షీ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥శ్రీ కామాక్షీ స్తోత్రం💥 కల్పానోకహపుష్పజాలవిలసన్నీలాలకాం మాతృకాం కాంతాం కంజదళేక్షణాం కలిమలప్రధ్వంసినీం కాళికామ్ । కాంచీనూపురహారదామసుభగాం కాంచీపురీనాయికాం కామాక్షీం కరికుంభసన్నిభకుచాం వందే మహేశప్రియామ్ ॥ 1 ॥ కాశాభాం శుకభాసురాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాం చంద్రార్కానలలోచనాం సురుచిరాలంకారభూషోజ్జ్వలామ్ । బ్రహ్మశ్రీపతివాసవాదిమునిభిః సంసేవితాంఘ్రిద్వయాం కామాక్షీం గజరాజమందగమనాం వందే మహేశప్రియామ్ ॥ 2 ॥ ఐం క్లీం సౌరితి యాం వదంతి మునయస్తత్త్వార్థరూపాం పరాం వాచామాదిమకారణం హృది సదా ధ్యాయంతి యాం యోగినః । బాలాం ఫాలవిలోచనాం నవజపావర్ణాం సుషుమ్నాశ్రితాం కామాక్షీం కలితావతంససుభగాం వందే మహేశప్రియామ్ ॥ 3 ॥ యత్పాదాంబుజరేణులేశమనిశం లబ్ధ్వా విధత్తే విధి- -ర్విశ్వం తత్పరిపాతి విష్ణురఖిలం యస్యాః ప్రసాదాచ్చిరమ్ । రుద్రః సంహరతి క్షణాత్తదఖిలం యన్మాయయా మోహితః కామాక్షీమతిచిత్రచారుచరితాం వందే మహేశప్రియామ్ ॥ 4 ॥ సూక్ష్మాత్సూక్ష్మతరాం సులక్షితతనుం క్షాంతాక్షరైర్లక్షితాం వీక్షాశిక్షితరాక్షసాం త్రిభువనక్షేమంకరీమక్షయామ్ । సాక్షాల్లక్షణలక్షితాక్షరమయీం దాక్షాయణీం సాక్షిణీం కామాక్షీం శుభల...

⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🌹🙏 రాముడు అయోధ్యలో జన్మించినా వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశాడంటారు. అందుకే దక్షిణభారతం పొడవునా రామాయణ ఘట్టాలకి సంబంధించిన క్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒంటిమిట్ట ఒకటి. దేశ వ్యాప్తంగా ఉన్న రామాయలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అయితే వీటన్నింటి కన్నా  "ఒంటిమిట్ట" చాలా ప్రత్యేకం. సాధారణంగా దేశ వ్యాప్తంగా వైష్ణవ ఆలయంలో చూసినా సీతారాముల కళ్యాణం చైత్ర మాసం నవమి రోజు పగలు జరిగితే.. ఒంటిమిట్టలో మాత్రం #చైత్రపౌర్ణమి రోజు, వెన్నెల్లో జరుగుతుంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడట. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. శ్రీ రామచంద్రుడిపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం. దీనికి "#ఏకశిలానగరం" అనే పేరు కూడా ఉంది. సీత, రామ, లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా చెక్కారు. అందుకే ఏకశిలా నగరం అనే పేరొచ్చింది.  ఆ ఏకశిలకు దగ్గర్లోనే మృకండుడు...

⚜️🕉️🚩ఓం శ్రీ దత్తాయ నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ దత్తాయ నమః🌹🙏 అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే । విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥  లోకానికి జ్ఞానకాంతులను ప్రసరింపజేసేందుకు అవతరించిన గురుమూర్తి దత్తాత్రేయుడు. జన్మసంసార బంధనాలను సులువుగా వదిలించి, జ్ఞానానందాన్ని పంచుతూ, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించ గలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు. ఈయన అవతార వర్ణన నారదపురాణం, శాండిల్యోపనిషత్తు, అవధూతగీత, జీవన్ముక్తిగీత తదితరాలలో కనపడుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు వేరుకారని నిరూపించిన సన్నివేశమే దత్తాత్రేయ ఆవిర్భావం. త్రిమూర్తులే తనకు పుత్రులుగా జన్మించాలంటూ అత్రిమహర్షి-అనసూయ దంపతులు చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రాంశతో దూర్వాసుడు జన్మించగా, విష్ణు అంశతో అవతరించినవాడే దత్తాత్రేయుడు! 'దత్తా' అనే పదానికి 'సమర్పించిన' అని అర్థం. త్రిమూర్తులు అత్రి-అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక దత్తా అని పేరు వచ్చింది. అత్రిపుత్రుడు కాబట్టి 'ఆత్రేయ' అయింది. దిక్కులనే అంబరముగా చేసుకుని, భక్తులనుద్ధరించేందుకు అనేక రూపాలను ధరించిన దత్తాత్రేయుడి మూడుత...

💥శ్రీ నృసింహ పంచామృత స్తోత్రం (శ్రీరామ కృతం)

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏 త్రేతాయుగమున శ్రీరాముల వారు దండకారణ్యమున సీతాన్వేషణకై వెళ్ళినప్పుడు అహోబిల నరసింహస్వామిని దర్శించి "నృసింహ పంచామృత స్తోత్రం"తో ఆరాధించినట్లు పురాణం చెబుతుంది. శ్రీరాముడు అహోబిలంలోని నరసింహుని ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ ప్రార్థనను రచించాడు. ప్రతి చరణం అమృతం లాంటిది కనుక దానిని "#పంచామృతం" అంటారు. 💥శ్రీ నృసింహ పంచామృత స్తోత్రం (శ్రీరామ కృతం) అహోబిలం నారసింహం గత్వా రామః ప్రతాపవాన్ | నమస్కృత్వా శ్రీనృసింహం అస్తాషీత్ కమలాపతిమ్ || 1 || గోవింద కేశవ జనార్ధన వాసుదేవ విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప | శ్రీపద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే || 2 || దేవాః సమస్తాః ఖలు యోగిముఖ్యాః గంధర్వ విద్యాధర కిన్నరాశ్చ | యత్పాదమూలం సతతం నమంతి తం నారసింహం శరణం గతోస్మి || 3 || వేదాన్ సమస్తాన్ ఖలు శాస్త్రగర్భాన్ విద్యాబలే కీర్తిమతీం చ లక్ష్మీమ్ | యస్య ప్రసాదాత్ సతతం లభంతే తం నారసింహం శరణం గతోస్మి || 4 || బ్రహ్మా శివస్త్వం పురుషోత్తమశ్చ నారాయణో సౌ మరుతాం పతిశ్చ | చంద్రార్క వాయ్వగ్ని మరుద్గణాశ్చ త్వమేవ తం త్వాం సతతం నతోస్...

⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 సనాతన సంప్రదాయం ప్రకారం ఏ పూజలు చేపట్టినా, ఏ యజ్ఞ యాగాదులు చేపట్టినా వినాయకుడికే తొలిపూజ చేసి, ఆ తర్వాత మిగిలిన క్రతువులను కొనసాగించడం ఆనవాయితీ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు ప్రమథగణాలకు ఆధిపత్యం పొందినందున గణపతిగా, విఘ్నాలను నివారించే దేవుడు కనుక విఘ్నేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.  వినాయక వ్రతకల్పంలోని గాథ వినాయకుడి సృష్టి ఎలా జరిగిందో మాత్రమే చెబుతుంది. అయితే, పార్వతీ పరమేశ్వరులు గణపతిని ఎందుకు సృష్టించారనే దానికి సంబంధించిన గాథ స్కాంద పురాణంలో ఉంది. ఇది వ్రతకల్పంలోని గాథకు కొంత భిన్నమైనది. గణపతిని ఎందుకు సృష్టించారంటే..? స్వర్గలోకం సకల భోగాలకు నిలయం. భూలోకంలో జీవితాంతం అలాంటి భోగాలను అనుభవించడం అసాధ్యం. జరామరణాలతో కూడిన మర్త్య జీవితం కంటే, స్వర్గాన్ని చేరి అమర సౌఖ్యాలను అనుభవిస్తేనే కదా సార్థకత అనుకున్న మానవులు ఘోర తపస్సులు ఆచరిస్తూ, తపః ఫలితంగా ఒక్కొక్కరే స్వర్గానికి వెళ్లసాగారు. స్వర్గంలో దేవతల కంటే మనుషులే ఎక్కువయ్యారు. స్వర్గంలో తమ ఆధిక్యత పెరగడంతో మానవులు ఏకంగా దేవతల మీద ఆధిపత్యం చలాయిస్తూ స్వైరవిహారం చేయడం ప్రారంభించారు. మానవుల...

⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 స్తోత్రం: గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజం స్వరూపం సేనాన్యాం తారకఘ్నం గురుమచల మతిం కార్తికేయం షడస్యం సుబ్రహ్మణ్యం మాయూరధ్వజరధ సహితం దేవదేవం నమామి గంగాదేవి శివుని శక్తిని కొంత సేపు మోసి, శక్తిని భరించ లేక రెల్లు గడ్డిలోకి త్రోయటం వలన గాంగేయుడు అని, అగ్ని శివుని శక్తిని తన వద్ద ఉంచుకొని గంగలో విడుచుట వలన అగ్నిగర్భుడని, జ్ఞాన శక్తి పరబ్రహ్మమని, గుహుడని, అమలమైన గుణము కలవాడని, రుద్రుని తేజస్స్వరూపమని, దేవతల సేనాపతియని, తారకాసురుని చంపిన వాడని, జ్ఞానానికి నిధియై గురు స్వరూపమని, అచలమైన బుద్ధి కలవాడని, రెల్లు గడ్డి నందు పుట్టినందు వలన శరవణభవుడని, ఆరు ముఖములు ఉండుట వలన షడాననుడు అని, నెమలిని అధిరోహించినందు వలన మయూర ధ్వజుడని, రథమును అధిరోహించిన వాడు అని ఈ ధ్యాన శ్లోకము ద్వారా ప్రార్ధించ బడినాడు. పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం-సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే ద...

⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 భగవంతుడు బందీ అయ్యేది భక్తి పాశానికే! అందుకే నవవిధ భక్తిమార్గాల ద్వారా దైవాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ భక్తి విధానాల్లో దాస్యభక్తికి నిలువెత్తు నిదర్శనం హనుమంతుడు. అనంతశక్తులు తనలో దాగి ఉన్నా.. రామబంటుగా ఒదిగి ఉండటమే దాసాంజనేయుడికి ఇష్టం. ఆ పరమభక్తుడు పిల్లల దేవుడు, పెద్దల దేవుడు, అందరి దేవుడు. మనందరికీ దేవుడే అయినా, తనను తాను సదా రామచంద్రుడి దాసుడిగానే భావిస్తాడు స్వామి. లంకాపురిలో సీతమ్మ జాడ కనిపెట్టిన రోజు చైత్ర పౌర్ణమి. అంతటి ఘనకార్యం చేసినా.. దానికి సహకారం చేసింది రామనామమే అని వినమ్రంగా చెప్పుకొన్నాడు. శ్రీమద్భాగవతంలో తెలిపిన నవవిధ భక్తి మార్గాల్లో దాస్యభక్తికి ప్రతీకగా హనుమంతుడిని చెప్పుకొంటారు. అయితే, ‘వానరుడిగా జన్మించిన హనుమ ఇంతటి పరిపూర్ణతను ఎలా సాధించగలిగాడు?’ అన్న ప్రశ్నకు ప్రభుపాదుల వారు సహేతుకమైన వివరణ ఇచ్చారు.  ‘హనుమంతుడు చేసిందల్లా ఒక దాసునిగా తనకు అప్పజెప్పిన పనిని నిర్వర్తించడమే. అది ఎంతటి దుస్సాధ్యమైన కార్యమే గాని, రామచంద్రుడు చెప్పాడంటే అంతే! మరో ఆలోచన లేకుండా ఆచరించడమే హనుమ వంతు. తన అపారమైన దేహబలాన్ని ప్రభుసేవలో వినియోగ...

💥శివాష్టకం - తాత్పర్యము💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥శివాష్టకం - తాత్పర్యము💥 ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే తాత్పర్యము: ప్రభువు, మా ప్రాణ నాథుడు, జగత్పతి, విశ్వనాథుడు, జగన్నాథుడు అయిన విష్ణువునకు నాథుడు, ఎల్లప్పుడూ ఆనందంలో అలరు వాడు, జగమంతటికి ప్రకాశాన్ని కలిగించే వాడు, జీవులకు, భూతములకు, అన్నిటికి నాథుడయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను. గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాఝూటగంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే తాత్పర్యము: మెడలో కపాలములు ధరించిన వాడు, శరీరము అంతా సర్పములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, గణేశునికి అధిపతి, గంగానదీ ప్రవాహము ధరించుట వలన విశాలమైన జటా ఝూటములు కలిగిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను. ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహహారం శివం శంకరం శంభుమీశానమీడే తాత్పర్యము: ప్రపంచానికి ఆనందం పంచే వాడు, అంతటా ఉన్నవాడు, సర్వము తనే అయిన వాడు, భస్మము శరీరమంతా కలిగిన వాడు, ఆది లేని వాడు, కొలత లేని వాడు, మహా మోహములను సంహరించే వాడు అయ...

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! ఉమానాథుడయితే మారేడు దళము, శ్రీమహా విష్ణువయితే తులసిదళంతో మనం పూజ చేస్తాము. రెండూ దళాలే. మారేడుదళం ఏర్పడడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీసూక్తం చదివినప్పుడు మనం ఈ క్రింది మంత్రమును చదువుతుంటాము. ఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథబిల్వః! తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః!! లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దామని అనుకున్నప్పుడు కుడి చేతితో ఆమెచేత సృష్టించబడిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలము’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉన్నది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది.  దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు మూడు కింద తొమ్మి...

⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 మన కర్మ భూమి అయినటువంటి దక్షిణ భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రములు ఉన్నాయి. ప్రతీ క్షేత్రమునకు ఒక విశేషమైనటువంటి మహత్మ్యము ఉన్నది. అలాంటి క్షేత్రాలలో పౌరాణికంగా చారిత్రకంగా విశేషము పొందినటువంటి క్షేత్రము శ్రీభద్రాచల క్షేత్రము, శ్రీసీతారామచంద్ర లక్ష్మణ స్వామి వారి దేవాలయము. భారతావనిలో పౌరాణికంగా, చారిత్రకంగాను అతి ప్రసిద్ధమైన దివ్య క్షేత్రం భద్రాచల శ్రీరామ క్షేత్రం. 💥త్రేతాయుగమున దండకారణ్యములోని పర్ణశాల ప్రాంతములో వనవాసము చేయుచున్న సీతారాములకు ఒకనాటి విహార సమయమున విశ్రాంతి స్థానమైన ఒక శిల ఆ దివ్య దంపతులకు ఆనందాన్ని కలిగించి వారి అనుగ్రహానికి పాత్రమయ్యెను. ఆ శిలయే బ్రహ్మదేవుని వరప్రసాదముగా మేరుదేవి మేరు పర్వతరాజ దంపతులకు భద్రుడు అను పేరిట పుత్రుడై జన్మించెను. బాల్యం నుండి శ్రీరామభక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రమును ఉపదేశంగా పొంది, శ్రీరామ సాక్షాత్కారమునకై దండకారణ్యములో ఘోర తపస్సునాచరించెను. ఆ తపః ప్రభావముతో శ్రీమన్నారాయణుడు మరల శ్రీరామ రూపమును దాల్చి చతుర్భుజ రామునిగా శంఖ చక్ర ధనుర్భాణములను ధరించి, వామాంకమున (ఎడమ తొడపై) సీతతో...

💥శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 💥శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం💥 ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ । లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥ నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ । దండితాఖిలదైత్యాయ రామాయాపన్నివారిణే ॥ 1 ॥ ఆపన్నజనరక్షైకదీక్షాయామితతేజసే । నమోఽస్తు విష్ణవే తుభ్యం రామాయాపన్నివారిణే ॥ 2 ॥ పదాంభోజరజస్స్పర్శపవిత్రమునియోషితే । నమోఽస్తు సీతాపతయే రామాయాపన్నివారిణే ॥ 3 ॥ దానవేంద్రమహామత్తగజపంచాస్యరూపిణే । నమోఽస్తు రఘునాథాయ రామాయాపన్నివారిణే ॥ 4 ॥ మహిజాకుచసంలగ్నకుంకుమారుణవక్షసే । నమః కల్యాణరూపాయ రామాయాపన్నివారిణే ॥ 5 ॥ పద్మసంభవ భూతేశ మునిసంస్తుతకీర్తయే । నమో మార్తాండవంశ్యాయ రామాయాపన్నివారిణే ॥ 6 ॥ హరత్యార్తిం చ లోకానాం యో వా మధునిషూదనః । నమోఽస్తు హరయే తుభ్యం రామాయాపన్నివారిణే ॥ 7 ॥ తాపకారణసంసారగజసింహస్వరూపిణే । నమో వేదాంతవేద్యాయ రామాయాపన్నివారిణే ॥ 8 ॥ రంగత్తరంగజలధిగర్వహృచ్ఛరధారిణే । నమః ప్రతాపరూపాయ రామాయాపన్నివారిణే ॥ 9 ॥ దారోపహితచంద్రావతంసధ్యాతస్వమూర్తయే । నమః సత్యస్వరూపాయ రామాయాపన్నివారిణే ॥ 10 ॥ తారానాయకసంకాశవదనాయ మహౌజసే । నమోఽస్తు తాటకాహంత్రే రామాయాపన్నివారిణే ॥ 11 ॥ రమ్యసా...

💥చైత్ర మాస శుక్లపక్ష నవమి... #శ్రీరామనవమి.

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 💥చైత్ర మాస శుక్లపక్ష నవమి... #శ్రీరామనవమి. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణభేద క్లేశ విచ్చేద మంత్రమ్ సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రమ్!! హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంది. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు శ్రీరాముడు. పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసం. ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకు ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని ర...

💥భవానీ అష్టకం💥 తాత్పర్య సహితం..

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥భవానీ అష్టకం💥 తాత్పర్య సహితం.. న తాతో న మాతా న బంధుర్న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 1 ॥ తాత్పర్యం:  అమ్మా ! ఓ భవానీ ! నాకు తల్లిగానీ, తండ్రిగాని, కొడుకు గాని, కూతురు గాని, యజమాని గాని, సేవకుడు గాని, బంధువు గాని, భార్య గాని, విద్య గాని, వృత్తిగాని ఏదియు లేదు కేవలం నీవే నాకు దిక్కు. నాకు దిక్కు. భవాబ్ధావపారే మహాదుఃఖభీరు పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః కుసంసారపాశప్రబద్ధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 2 ॥ తాత్పర్యం:  అమ్మా! భవానీ! కామాంధుడనై, లోభినై, మత్తుడనై, జన్మపాశ బద్ధుడనై భరించలేని దుఖ్ఖముతో మిక్కిలి భయాన్వితుడనై, సంసార సాగరమున మునిగి పోయాను. తల్లీ నీవు తప్ప నాకు ఎవరు దిక్కులేరు. నీవే దిక్కు. న జానామి దానం న చ ధ్యానయోగం న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం న జానామి పూజాం న చ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 3 ॥ తాత్పర్యం:  అమ్మా ! భవానీ ! ధనము, ధాన్యము, మంత్రము, యంత్రము, పూజ, పునస్కారము, న్యాసము, యోగము ఇవి ఏవి నాకు తెలీదు. తల్లీ నీవు ...

⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి । సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ కార్యసిద్ధిదాయినిగా, సంపత్ప్రదాయినిగా మహాలక్ష్మీ దేవిని పూజించడం మన దేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ప్రత్యేకించి శ్రావణ, మార్గశిర మాసాల్లో లక్ష్మీ ఆరాధన అభీష్టాలను నెరవేరుస్తుందన్న విశ్వాసం ఉంది. దేశంలో అత్యంత పురాతనమైన లక్ష్మీ మందిరంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. పంచగంగ నదీ తీరాన శ్రీ మహాలక్ష్మి కొలువైన క్షేత్రం కొల్హాపూర్‌. పూర్వం దీన్ని ‘కరవీరపురం’ అనేవారు. ఇక్కడ అమ్మవారిని ‘కరవీర వాసిని’గా, ‘అంబాబాయి’గా పిలుస్తారు. కాశీ అంతటి ప్రాచీన క్షేత్రంగా... ఆరువేల ఏళ్ళ నాటిదిగా కొల్హాపూర్‌ భక్తులు పరిగణిస్తారు. కాశీని విడిచిపెట్టి మహా శివుడు ఉండడనీ, అదే విధంగా మహాలక్ష్మి స్థిర నివాసం కొల్హాపూర్‌ అనీ ప్రతీతి. ఈ క్షేత్ర ప్రస్తావన దేవీ భాగవతంలో, స్కాంద పురాణంలో ఉంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఏడవదిగానూ కొల్హాపూర్‌కు విశిష్టత ఉంది. సతీదేవి దేహంతో శివుడు తాండవం చేస్తున్నప్పుడు.. ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడ్డాయనీ, సర్వేంద...