💥మహా మహిమోన్నతం భస్మధారణం💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥మహా మహిమోన్నతం భస్మధారణం💥


శివరూపం మంగళకరం. శివనామం ముక్తిదాయకం. శివశబ్దము ఆనందదాయకం. జ్ఞానదాయకం. శివరూపం మహిమాన్వితం.


మంగళమూర్తియైన శివుడు లోకాలన్నింటిని అతలాకుతలం చేసే గరళాన్ని తన కంఠమునందు నిల్పుకొని గరళకంఠుడయ్యాడు. గరళముచే కంఠము నీలిరంగుగా మారడంచే నీలకంఠుడయ్యాడు. అల్ప సంతోషి. పరమ దయాసాగరుడు, దీనబాంధవుడు, 


సంహారశక్తిగా కనిపించే శివయ్య లోకరక్షకుడు కూడా అయ్యాడు. నిత్యము శరీరమునకు భస్మమును దరించుట చేత భస్మాంధగుడయ్యాడు.


సృష్టి స్థితి లయ కారులైన త్రిమూర్తులలో లయకారుడైన శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది భస్మము. భస్మధారణ వైదిక సంస్కృతి. శైవమతాలన్నీ వేదము నుండి స్వీకరించిన సంప్రదాయమిది.


భస్మంలో అగ్ని, నీరు, పృథివి అనే మూడు ప్రత్యక్ష భూతముల మేళనముంది.


భస్మమనగా "భాసనాత్ భసితం ప్రోక్తం భస్మకిల్బిష భక్షనాత్" అని శివపురాణ వాక్యము. భాసము చేత భస్మము. అనగా ప్రకాశ స్వరూపం.


సర్వ పాపాలను భస్మం చేసి జ్ఞానదీప్తిని అందించేది భస్మం. అగ్నిసారమైన భస్మం ఐశ్వర్యదాయకం. కనుకనే విభూతి అని నామాంతరం. "భూతిర్విభూతి రైశ్వర్యం" అని నిఘంటువు ద్వారా తెలియుచున్నది.


విభూతి మంత్రం:


భూతిర్భూతి కరీ, పవిత్ర జననీ, పాపౌఘ విధ్వంసినీ 

సర్వోపద్రవ నాశనీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ 

భూత ప్రేత పిశాచ రాక్షస గణాధ్యక్షాది సంహారిణీ 

తేజోరాజ్య విశేష మోక్షకరీ భూతి స్సదాధార్యతాం 


విభూతి ధారణా సమయ మందు...


శ్రీకరంచ పవిత్రంచ శోక మోహ వినాశనం

ధరామి భసితం దివ్యం తేజః కాంతిం ప్రయచ్ఛతు


భావం:

విభూతి ధారణ చేయటం వలన సకల అశుభాలు తొలగి పవిత్రత దరిచేరును, మనలోని అజ్ఞాన తిమిరాలు అడుగంటి సుజ్ఞాన జ్యోతి వెలుగొందును.


అగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ

సర్వగ్‍ంహవాఇదం భస్మ వాఙ్మన ఇత్యేతాని చక్షూగ్‍ంషి కరణాని భస్మాని

                                                  - జాబాలోపనిషత్


దీనితో పాటే శ్రీరుద్రంలోని "త్రయంబకం యజామహే..." కూడా చదివడం మంచిది.


అలాగే తైత్తరీయ సంహితలోని..


"త్రియాయుషం జమదగ్నేః కశ్యపస్య త్రియాయుషమ్ అగస్త్య త్రియాయుషమ్

యద్దేవానాం త్రియాయుషమ్ తన్మే అస్తు త్రియాయుషమ్" కూడా పఠించవచ్చు.


అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది.


విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. నిర్గుణుడు అయిన మహాశివునికి విభూతి మహా ప్రీతికరమైంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం