💥దారిద్య్ర దహన గణపతి స్తోత్రం💥
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం.
సకల శుభాలనూ అనుగ్రహించే ఈ గణపతి స్తోత్రం భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే, ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ప్రతీరోజూ ఈ మహా మహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం.
ఆర్థిక సమస్యలతో, దారిద్య్ర బాధలతో ఇబ్బంది పడేవారు ప్రతీరోజూ ఈ స్తోత్రాన్ని పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వల్ల అన్ని అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ స్తోత్రాన్ని శ్రీ ఆది శంకరాచార్యులవారు రచించారు.
💥దారిద్య్ర దహన గణపతి స్తోత్రం💥
సువర్ణ వర్ణ సుందరం సితైక దంత-బంధురం
గృహీత పాశ-మంకుశం వరప్రదా-ఽభయప్రధమ్ ।
చతుర్భుజం త్రిలోచనం భుజంగ-మోపవీతినం
ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్ ॥
కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి-యష్టికమ్ ।
ప్రభాత సూర్య సుందరాంబర-ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి-పంకజమ్ ॥
సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం
గృహ ప్రతీర్ణ సుందరం యుగక్షణ ప్రమోదితమ్ ।
కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం
షడక్షర స్వరూపిణం భజేద్గజేంద్ర రూపిణమ్ ॥
విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతిం
గిరీశ దర్శనేచ్ఛయా సమార్పితం పరాశాయా ।
నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట-మిష్ట-కర్మను భజామి తుందిలమ్ ॥
మదౌఘ లుబ్ధ చంచలార్క మంజు గుంజితా రవం
ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకమ్ ।
అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తి దాయకం
నమామి నిత్య-మాదరేణ వక్రతుండ నాయకమ్ ॥
దారిద్ర్య విద్రావణ మాశు కామదం
స్తోత్రం పఠెదేత-దజస్ర-మాదరాత్ ।
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్-భవే-దేకదంత వరప్రాసాదాత్ ॥
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణమ్ ॥
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment