⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏
'జటాధరమ్ పాండురంగమ్ శూలహస్తం కృపానిధిమ్
సర్వరోగహరమ్ దేవమ్ దత్తాత్రేయ మహంభజే'
భూలోకంలో సాధారణ మానవుడిగా జన్మించి సంపూర్ణ ఇహపర జ్ఞానాన్ని మానవాళికి అందించిన మహత్తర గురువుగా దత్తాత్రేయుడు పూజలందుకుంటున్నాడు. త్రిమూర్తుల అంశ. గురువులకే మహా గురువు.
'అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః
స్మర్తృగామీ స్వభక్తానా ముద్దర్తా భవసంకటాత్'...
'స్మర్తృగామీ' అంటే 'తలచిన వెంటనే ప్రసన్నుడవుతాడు'
అని అర్థం. సమస్త ప్రాణకోటికి తనకు తాను
అర్పితమైనవాడు (దత్తమైనవాడు) కనుక దత్తుడని,
అత్రి మహర్షి వరపుత్రుడు కనుక ఆత్రేయుడని... ఈ
రెండు పదాల కలయికతోనే 'దత్తాత్రేయుడు'గా పేరు
పొందారని చెబుతారు. తనకు తానుగా భక్తులకు
దత్తమవుతాడు అంటే... భక్తుల అధీనంలో ఉంటాడని
అర్థం.
భక్తులకు లోకాన్ని ఏలే తండ్రిగా కంటే పుత్రసమానుడిగా సేవలు అందిస్తాడు. తన మహిమలు చూపడం కంటే భక్తుల మహిమల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చి, వారి కీర్తిని పెంచుతాడట. అందుకే... 'భక్త కీర్తి వివర్ధనుడు'గా కీర్తి పొందాడు.
ఆయనను దిగంబరుడు అనీ అంటారు. అంటే నగ్నం
అని కాకుండా 'దిగంతాలనే అంబరాలు'గా
చేసుకున్నవాడని అర్థం చెబుతారు. ఏ అవతారానికి
లేని 'గురుదేవ' అనే విశేషణం దత్త ప్రభువుకు
మాత్రమే ఉంది.
అరిషడ్వర్గాలు కలి ప్రభావంతో పెచ్చరిల్లుతూ మానవజీవితం పతన దిశగా ప్రయాణించడాన్ని నివారించి మనిషిని మనీషిగా చేయాలన్నదే ఈ అవతార తత్వం. మానవులకు జ్ఞానభిక్ష, ధర్మరక్షణ ఈ అవతార లక్ష్యం కనుక మానవజాతి ఉన్నంత వరకు ఈ అవతారం విలసిల్లుతూనే ఉంటుంది.
కార్తవీర్యార్జునుడు, పరశురాముడు తదితరులు దత్త
సంప్రదాయాన్ని అనుసరించారని పురాణాలు
పేర్కొంటున్నాయి. అసలు వామదేవుడు అనే రుషి ఈ
సంప్రదాయాన్ని పరిచయం చేశారంటారు. ఆయన
గురించి ఆసక్తి గల కథనం ప్రచారంలో ఉంది. ఆయన
తల్లి గర్భం నుంచి బయటికి చూసి తిరిగి గర్భస్థుడై,
దేవతల కోరిక మేరకు జన్మించాడట.
దత్తావతారం గురించి కొన్ని పురాణాలో ఉంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం, సృష్టికార్యాల కోసం సనక, సనందన, సనత్కుమారలను సృష్టించాడట. అయితే వారు అందుకు అంగీకరించకపోవడంతో బ్రహ్మ కోపంతో కళ్లెర్ర చేయగా, ఆయన కనుబొమల నుంచి 'అత్రి' జన్మించాడు.
అత్రి అంటే త్రిగుణాలకు అతీతుడు. పది మంది బ్రహ్మ మానస పుత్రులలో అత్రి రెండవవాడు. సృష్టి కార్యానికి అవసరమైన శక్తిని సంపాదించేందుకు అత్రి చేసిన తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షం కాగా, మీ ముగ్గురు ఒక్కటిగా కుమారుడిగా జన్మించాలని కోరి వరం పొందాడు.
మరో కథనం (స్మృతి కౌస్తుభం) ప్రకారం, ఒకనాడు
అత్రి, అనసూయ దంపతుల ఆతిథ్యం స్వీకరించిన నారదుడు వైకుంఠం, కైలాస, సత్యలోకాలను సందర్శించిన సందర్భంలో అనసూయను మించిన పతివ్రత సృష్టిలోనే లేరని లక్ష్మీ, పార్వతి, సరస్వతులకు చెప్పడంతో, ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలని 'త్రిమాతలు' త్రిమూర్తులను కోరారు. సరేనంటూ బ్రాహ్మణ వేషధారులుగా వచ్చి భిక్ష అడిగారు.
అయితే వివస్త్రగా తమకు వడ్డించాలని షరతు పెట్టడంతో ఆమె వారిని పసిపాపలుగా మార్చి వారి అభీష్టాన్ని నెరవేరుస్తుంది. భర్తల జాడను వెదక్కుంటూ వచ్చిన 'త్రిమాత'లకు వారిని నిజరూపంతో అప్పగించింది. అనంతరం పొందిన వరంతో మార్గశిర పౌర్ణమి నాడు దత్తాత్రేయ అవతరించారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment