⚜️🕉️🚩 ఓం గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏


బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణ్నిర్వికల్పం పునః

మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్

మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే


#తాత్పర్యము:

వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా  తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.


💥హిందూ పురాణాల ప్రకారం స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణామూర్తి ఉపాసనతో గురు దోషాలు తొలగిపోతాయని గురువులు చెబుతారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నియమనిష్టలతో పారాయణ చేస్తే గురు గ్రహ అనుకూలత లభిస్తుందని అంటారు.


శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రంలో వర్ణించిన దక్షిణామూర్తి స్వరూపాన్ని పరిశీలించినప్పుడు.. దక్షిణామూర్తి ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఒక కాలు కింద రాక్షసుణ్ణి తొక్కిపట్టినట్లుగా ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. దక్షిణామూర్తి చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలో ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.


బ్రహ్మ నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం ఎన్ని రకాల తపస్సులు చేసిన వారికి బ్రహ్మజ్ఞానం అంతుపట్టలేదు. చివరికి వారు పరమ శివుని దగ్గరకు వెళ్లి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు.


అప్పుడు పరమశివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. మహదాశ్చర్యం! ఋషులందరికీ వారి అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తి స్వరూపంగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.


దక్షిణామూర్తి రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.


శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ వాటంతవే తొలగిపోతాయి.


దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి.


దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే చదువులో ఏకాగ్రత కోసం దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు. సరస్వతీదేవి తర్వాత విద్యా బుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.


చిన్న పిల్లలకు చదువు, ఐశ్వర్య కాముకులకు సంపద, మోక్ష కాముకులకు మోక్షాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్య, లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షానికి అదిష్టానం అయిన దక్షిణామూర్తి సదా పూజనీయుడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం