⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ🌹🙏
⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ🌹🙏
రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మనుమ్ /
యావజ్జీవం జపన్ మర్త్యో జీవన్ముక్తో న సంశయః //
🌹రామ, రామచంద్ర, రామభద్ర, అను ఈ మంత్రాలలో దేనినైనను జీవితాంతం వరకు జపించు మనుజుడు జీవన్ముక్తుడు కాగలడు. ఇందులో సంశయం లేదు.
రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం విగచ్ఛతి /
మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి //
🌹'రా' అను శబ్దం ఉచ్చరించగానే పాపం వదనము నుండి బయటపడును. పిదప 'మ'కారము వినుటతోడనే భస్మమైపోవును
కృశాను (అగ్ని) 'ర'అక్షరం అగ్నిబీజాక్షరం.
భాను (సూర్యుడు) 'అ'అక్షరం సూర్యబీజాక్షరం.
హిమారక (చంద్రుడు) 'మ'అక్షరం చంద్రబీజాక్షరం.
ఈ మూడు బీజాక్షరములు కలసి "రామ" శబ్దమయ్యెను.
అగ్ని గుణం దహించుట. అగ్నిబీజాక్షరమగు 'ర' శుభాశుభ కర్మలను దహించి మోక్షమును ఇచ్చును.
సూర్యుని వలన అంధకారం నశించును.
అటులనే సూర్య బీజాక్షరం 'అ' మోహాంధకారమును పోగొట్టును.
చంద్రుడు తాపమును హరించును. అటులనే చంద్రుని బీజాక్షరం 'మ' తాపత్రయమును హరించును.
ఉత్పత్తి కర్తయగు బ్రహ్మవంటివాడు చంద్రుడు.
పోషణ కర్తయగు విష్ణువువంటివాడు సూర్యుడు.
సంహార కర్తయగు శివునివంటివాడు అగ్నిదేవుడు.
ఈ త్రిమూర్తి స్వరూపుడు "శ్రీరాముడు"
రా శబ్దోశ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః /
పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్ //
🌹నోరు తెరిచి "రా" అని చెప్పునప్పుడే పాపములన్నియు నోటినుండి బయటికి వెళ్లి పోవుచున్నవి. మరల అవి లోపలకు ప్రవేశించకుండా "మ"కారం తో నోటిని మూసి బంధించుచున్నది.
"రా" అక్షరం ఉచ్చరించుట వలన నోరు తెరవబడి పాపములు పోయి ముఖం మధురముగా ఉండును. "మ" అక్షరం ఉచ్చరించుటవలన నోరు మూతపడి సంతోషం కలుగును.
"రా" అక్షరం బ్రహ్మస్వరూపుడునగు ఆదికూర్మముతో సమానం. "మ" అక్షరం జీవస్వరూపుడగు ఆదిశేషువుతో సమానం.
"రా" అక్షరం ఛత్రం వలెను, "మ" అక్షరం కిరీటం వలెను సర్వ వర్ణములకంటే అధికముగా ప్రకాశించును.
ఇటువంటి రామనామమును జపించిన సిద్ధత్వమును పొందుదురు.
"రా" అగ్ని బీజాక్షరం కావున దానిని స్మరించిన మాత్రమున సకల పాపములు భస్మము కావించుననియు..
"మ" అమృత బీజాక్షరం కావున దానిని స్మరించిన యెడల సత్యముగా మోక్షం ఇచ్చుననియు ఋషులు తెలిపారు.
రామ అన్న భవబంధములు నశించును.
రామ అన్న సమస్త సంపదలు కల్గును.
రామ అన్న సర్వార్ధములు సిద్ధించును.
రామ అన్న బ్రహ్మహత్యాదిపాతకములెల్ల నివర్తియగును.
రామ అన్న సకల సంశయములు నివృత్తియగును.
రామనామం స్మరణం చేసేవారికి మోక్షం కరస్థమై రామమయమై ఉన్నది. రామ మంత్రముకంటే అధికమైన యజ్ఞంగాని, తపంగాని, వ్రతం గాని, మంత్రం గాని మరియొకటి లేదు.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే /
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే //
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment