కృష్ణం వందే జగద్గురుమ్🌹🌹🙏
⚜️🕉️🚩ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః🌹🙏 💥 కృష్ణంవందేజగద్గురుమ్ ..! 💥 రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ | అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ || 🍁🍁🍁🍁🍁 🌹నెమలిపింఛం, నీలవర్ణం, నల్లని గొల్లవాడు పిల్లనగ్రోవితో భాగవతంలో వెన్నదొంగగా దర్శనమిచ్చే నీలమేఘశ్యాముడు... మహాభారతంలో నగర రాజ్యాల నిర్మాతగా, యుద్ధవీరుడిగా, తాత్వికుడిగా, రాజనీతిజ్ఞుడిగా అరివీర భయంకర యుద్ధానికి దార్శనిక సమాధానమిచ్చే వ్యూహకర్తగా ప్రత్యక్షమవుతాడు. మహాభారత యుద్ధ మైదానంలో అర్జునుడి నైతిక సంశయాన్ని పటా పంచలు చేసే చింతనాపరుడిగా రూపుగడతాడు. " నల్లనివాడు పద్మనయనంబులవాడు" అంటూ శ్రీకృష్ణుడి రూపాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు పోతనామాత్యుడు. 'కృష్’ అంటే దున్నడమనే అర్థం ఉంది. భూమిని దున్నడానికి ఉపయోగించే నాగలి కర్రు మొన నల్లగా ఉంటుంది. అందుకే ‘కృష్ణ’ అనే శబ్దానికి ‘నలుపు’ అనే అర్థం ఏర్పడింది. శ్రీకృష్ణుడిని కేవలం ఒక "సాహిత్య పాత్ర"గా భావిస్తే ఆ పాత్ర విశ్వసాహిత్య జగత్తులో నిరుపమాన సృష్టి. ఒక చారిత్రక వ్యక్తి అనుకుంటే, ఆ వ్యక్తి ప్రపంచ చరిత్రలో "నభూతో న భవిష్యతి" "లీలామ...