🔱🌷శ్రీ దండపాణి పంచరత్నం🌷🔱

 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏


యదా సన్నిధానం గతామానవామే

భవామ్భోధిపారం గతాస్తేతదైవ।

ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే

తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం॥ 


యథాభ్ధే స్తరంగా లయం యాంతి తుంగాః

తథైవాపదః సన్నిధౌ సేవతాంమే।

ఇతీవోర్మి పంక్తీర్ నృణామ్ దర్శయంతం

సదా భావయే హృత్సరోజే గుహంతం॥


💥భావం:

"నా సాన్నిధ్యమును పొందిన వెంటనే మనుజులు సంసార సాగరమును దాటుదురు” అని సూచించుచు, సముద్ర తీరముననున్న పరాదేవత యొక్క పుత్రుడగు పవిత్రుడైన సుబ్రహ్మణ్యుని స్తుతింతును.


"ఎగసిపడు సముద్ర తరంగములు (ఒడ్డున ఉన్న) నన్ను చేరి లయమగునట్లుగా నా సన్నిధానమున సేవించు జనుల ఆపదలు నశించిపోవును” అని చెప్పుచున్నట్లుగా మానవులకు సముద్ర తరంగములను చూపుచున్న ఆ కార్తికేయుని నా హృదయపద్మము నందు సదా తలంతును.

🍁🍁🍁🍁🍁


🔱🌷శ్రీ దండపాణి పంచరత్నం🌷🔱


చండపాపహరపాదసేవనం

గండశోభివరకుండలద్వయమ్ |

దండితాఖిలసురారిమండలం

దండపాణిమనిశం విభావయే || 1 ||


కాలకాలతనుజం కృపాలయం

బాలచంద్రవిలసజ్జటాధరమ్ |

చేలధూతశిశువాసరేశ్వరం

దండపాణిమనిశం విభావయే || 2 ||


తారకేశసదృశాననోజ్జ్వలం

తారకారిమఖిలార్థదం జవాత్ |

తారకం నిరవధేర్భవాంబుధే-

-ర్దండపాణిమనిశం విభావయే || 3 ||


తాపహారినిజపాదసంస్తుతిం

కోపకామముఖవైరివారకమ్ |

ప్రాపకం నిజపదస్య సత్వరం

దండపాణిమనిశం విభావయే || 4 ||


కామనీయకవినిర్జితాంగజం

రామలక్ష్మణకరాంబుజార్చితమ్ |

కోమలాంగమతిసుందరాకృతిం

దండపాణిమనిశం విభావయే || 5 ||


ఇతి శృంగేరిజగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీదండపాణి పంచరత్నమ్ |

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏