మహిమాన్విత దైవం విఘ్నవినాయకుడు కొలువైన దివ్యథామం "అయినవిల్లి"

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


💥ప్రకృతి పురుషులకు పూర్వమే ఉద్భవించిన విశ్వవ్యాప్తమైన ప్రణవ స్వరూపమే గజాననుడు.


ఆ స్వామి యోగులకు పరబ్రహ్మ, నర్తకులకు నాట్యాచార్యుడు, భాగవతులకు గానమూర్తి, విద్యాకాంక్ష గలవారికి విద్యాగణపతి.


సామాన్య మానవులకు సంకటహరుడు, సర్వసిద్ధి ప్రదాత. ఏకాత్మకు సంకేతమయిన వినాయకుడు విశ్వజన ప్రియుడు.


విష్ణువు ఆయనే... ఓంకారం ఆయనే... సిద్ధిని, బుద్ధినీ ఇచ్చేది ఆయనే... అలాంటి మహిమాన్విత దైవం విఘ్నవినాయకుడు కొలువైన దివ్యథామం "అయినవిల్లి"


💥పురాణగాథ:


పవిత్ర గోదావరి నదీమతల్లి పాయ ఒడ్డున అలరారుతున్న అయినవిల్లి "శ్రీ సిద్ధి వినాయకస్వామి" వారి ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించారని ఇక్కడి స్థల పురాణాలు చెప్తాయి.


దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో చేసిన దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్నవినాయకుడైన అయినవిల్లి వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తోంది.


అలాగే వ్యాస మహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుడ్ని ప్రతిష్టించాడని మరో కథ ప్రచారంలో ఉంది.


💥ఈ సృష్టిలో ప్రప్రథమంగా పూజలందుకునే స్వామి విఘ్నేశ్వరుడు.

తనలో ఈశ్వర అంశను పుణికి పుచ్చుకున్న ఆ స్వామి తనను నమ్మి దర్శించే భక్తుల మనోభిష్టాలు నెరవేరుస్తాడని భక్తులు దృఢంగా నమ్ముతారు.

ఆ కారణంగానే భక్తులు సర్వప్రాపంచిక విషయాలు పక్కన పెట్టి, నిర్మల చిత్తంతో దక్షిణ ముఖంగా ఉన్న సిద్ధివినాయక స్వామిని మనసావాచా కొలుస్తారు. 


అలాగే ఇక్కడ కొలువైన స్వామిని దర్బ గడ్డితో పూజిస్తే, మనోవాంఛలన్నీ నెరవేరుతాయన్న నానుడి ఉంది. 


శివ అంశతో ఉదయించిన ఆ స్వామి దర్శనం సదా మంగళకరం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏