💥శ్రీ గణాధిప పంచరత్నం💥

 ⚜️🕉️🚩ఓం గం గణపతయే నమః🌹🙏


నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం

నమస్సురారి నిర్జనం నతాధికా పదుద్ధరం |

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం

మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం ||


💥తాత్పర్యము:

భక్తుల శత్రువులకు భయం కలిగించే వానికి,

అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి, సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు. 

🍁🍁🍁🍁🍁


జయ విఘ్నేశ్వర! నమో నమో, జగద్రక్షకా! నమో నమో

జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్ధారా! నమో నమో!


మూషిక వాహన! నమోనమో, మునిజనవందిత! నమో నమో

మాయా రాక్షస మదాపహరణా! మన్మధారిసుత! నమో నమో!


విద్యాదాయక! నమో నమో, విఘ్నవిదారక, నమో నమో

విశ్వసృష్టి లయ కారణ శంభో! విమల చరిత్రా! నమో నమో!


గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో

అధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవా! నమోనమో!


నిత్యానంద! నమో నమో, నిజఫలదాయక! నమో నమో

నిర్మలపురవర! నిత్యమహోత్సవ! రామనాథ సుత నమో నమో!

🔸🔹🔸🔹🔸


💥శ్రీ గణాధిప పంచరత్నం💥


సరాగిలోకదుర్లభం విరాగిలోకపూజితం

సురాసురైర్నమస్కృతం జరాపమృత్యునాశకమ్ |

గిరా గురుం శ్రియా హరిం జయంతి యత్పదార్చకాః

నమామి తం గణాధిపం కృపాపయః పయోనిధిమ్ || 1 ||


గిరీంద్రజాముఖాంబుజ ప్రమోదదాన భాస్కరం

కరీంద్రవక్త్రమానతాఘసంఘవారణోద్యతమ్ |

సరీసృపేశ బద్ధకుక్షిమాశ్రయామి సంతతం

శరీరకాంతి నిర్జితాబ్జబంధుబాలసంతతిమ్ || 2 ||


శుకాదిమౌనివందితం గకారవాచ్యమక్షరం

ప్రకామమిష్టదాయినం సకామనమ్రపంక్తయే |

చకాసతం చతుర్భుజైః వికాసిపద్మపూజితం

ప్రకాశితాత్మతత్వకం నమామ్యహం గణాధిపమ్ || 3 ||


నరాధిపత్వదాయకం స్వరాదిలోకనాయకం

జ్వరాదిరోగవారకం నిరాకృతాసురవ్రజమ్ |

కరాంబుజోల్లసత్సృణిం వికారశూన్యమానసైః

హృదాసదావిభావితం ముదా నమామి విఘ్నపమ్ || 4 ||


శ్రమాపనోదనక్షమం సమాహితాంతరాత్మనాం

సుమాదిభిః సదార్చితం క్షమానిధిం గణాధిపమ్ |

రమాధవాదిపూజితం యమాంతకాత్మసంభవం

శమాదిషడ్గుణప్రదం నమామి తం విభూతయే || 5 ||


గణాధిపస్య పంచకం నృణామభీష్టదాయకం

ప్రణామపూర్వకం జనాః పఠంతి యే ముదాయుతాః .

భవంతి తే విదాం పురః ప్రగీతవైభవాజవాత్

చిరాయుషోఽధికః శ్రియస్సుసూనవో న సంశయః || 6 ||

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏