🌷శ్రీదక్షిణామూర్తి_స్తోత్రం🌷🔱 తాత్పర్య సహితం.

 ⚜️🕉️🚩ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏


🔱🌷శ్రీదక్షిణామూర్తి_స్తోత్రం🌷🔱 తాత్పర్య సహితం...


ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే ।

తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపమ్ ॥ 1 ॥


💥తాత్పర్యము:

ఉపాసకులకు ఉపాసింపదగినది, మర్రిచెట్టు క్రింద నివసించునది, జ్ఞాన రూపమైనది అగు తేజస్సు దయామయమైన తన రూపముతో నా హృదయము నందు వెలుగొందుగాక.


అద్రాక్షమక్షీణదయానిధానమాచార్యమాద్యం వటమూలభాగే ।

మౌనేన మన్దస్మితభూషితేన మహర్షిలోకస్య తమో నుదన్తమ్ ॥ 2 ॥


💥తాత్పర్యము:

క్షీణించని దయ కలవాడై మర్రిచెట్టు క్రింద కూర్చుని చిరునవ్వులొలుకు మౌనముతో మహర్షుల అజ్ఞానాంధకారమును పారద్రోలుచున్న ఆది గురువును దర్శించితిని. 


విద్రావితాశేషతమోగణేన ముద్రావిశేషేణ ముహుర్మునీనామ్ ।

నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్త్వమసీతి బోధమ్ ॥ 3॥


💥తాత్పర్యము:

అనంతములైన అజ్ఞానములను తొలగించు జ్ఞానముద్రతో దక్షిణామూర్తి మునుల యొక్క మోహమును పోగొట్టి దయతో ’”తత్త్వమసి” అని బోధించుచున్నాడు.


అపారకారుణ్యసుధాతరఙ్గైరపాఙ్గపాతైరవలోకయన్తమ్ ।

కఠోరసంసారనిదాఘతప్తాన్మునీనహం నౌమి గురుం గురూణామ్ ॥ 4॥


💥తాత్పర్యము:

కఠోర సంసారమనే మండుటెండలో తపించుచున్న మునులను అంతులేని కరుణామృత తరంగములైన కటాక్షములతో సేద తీర్చుచున్నవాడు, గురువులకే గురువైనవాడు అగు దక్షిణామూర్తిని నేను నమస్కరించుచున్నాను. 


మమాద్యదేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృతసన్నిధానః ।

ఓంకారరూపాముపదిశ్య విద్యామావిద్యకధ్వాన్తమపాకరోతు ॥ 5 ॥


💥తాత్పర్యము:

మర్రిచెట్టు క్రింద నివసించు దక్షిణామూర్తి కరుణతో దరి చేరినవాడై నాకు ఇప్పుడే ఓంకార రూపమైన విద్యనుపదేశించి అజ్ఞానాంధకారమును తొలగించుగాక. 


కలాభిరిన్దోరివ కల్పితాఙ్గం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిమ్ ।

ఆలోకయే దేశికమప్రమేయమనాద్యవిద్యాతిమిరప్రభాతమ్ ॥ 6 ॥


💥తాత్పర్యము:

చంద్రకళలతో నిర్మించినట్లున్న శరీరము కలవాడు , ముత్యాలరాశులతో చేయబడినట్లున్న ఆకారము కలవాడు. అనాదియైన అజ్ఞానాంధకారమును తొలగించువాడు అగు అద్వితీయుడైన గురువును చూచుచుంటిని. 


స్వదక్షజానుస్థితవామపాదం పాదోదరాలంకృతయోగపట్టమ్ ।

అపస్మృతేరాహితపాదమఙ్గే ప్రణౌమి దేవం ప్రణిధానవన్తమ్ ॥ 7 ॥


💥తాత్పర్యము:

తన కుడిమోకాలుపై ఎడమకాలునుంచినవాడు , పాద మధ్యమున యోగపట్టము కలవాడు , ధ్యాన సమయమునందు తొడ పైకి జారిన పాదము కలవాడు, ధ్యాననిమగ్నుడగు దక్షిణామూర్తిని నమస్కరించుచున్నాను. 


తత్త్వార్థమన్తేవసతామృషీణాం యువాఽపి యః సన్నుపదేష్టుమీష్టే ।

ప్రణౌమి తం ప్రాక్తనపుణ్యజాలైరాచార్యమాశ్చర్యగుణాధివాసమ్ ॥ 8 ॥


💥తాత్పర్యము:

యువకుడైననూ, ఏ దక్షిణామూర్తి తన వద్దకు చేరిన మునులకు తత్త్వమును ఉపదేశించుటకు సమర్థుడో, ఆశ్చర్యకరములైన గుణములు కల అట్టి ఆచార్యుని నా పూర్వపుణ్యములచే నమస్కరించుచున్నాను. 


ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః ।

స్వజానువిన్యస్తకరః పురస్తాదాచార్యచూడామణిరావిరస్తు ॥ 9॥


💥తాత్పర్యము:

ఒక చేతితో జ్ఞానముద్రను, వేరొక చేతితో గొడ్డలిని, ఇంకొక చేతితో లేడిని ధరించి నాల్గవచేతిని మోకాలుపై నుంచిన ఆచార్యచూడామణియగు దక్షిణామూర్తి నా ఎదుట ప్రత్యక్షమగుగాక.


ఆలేపవన్తం మదనాఙ్గభూత్యా శార్దూలకృత్త్యా పరిధానవన్తమ్ ।

ఆలోకయే కఞ్చన దేశికేన్ద్రమజ్ఞానవారాకరవాడవాగ్నిమ్ ॥ 10 ॥


💥తాత్పర్యము:

మన్మథుని దహించిన బూడిదను పూసుకున్న వాడు, పెద్దపులి తోలు కట్టుకున్న వాడు , అజ్ఞాన సముద్రమును శుష్కింపచేయు బడబాగ్ని వంటి వాడు అగు గురువర్యుని దర్శించుకొనుచున్నాను.


చారుస్మితం సోమకలావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపమ్ ।

ఉపాసతే కేచన యోగినస్త్వాముపాత్తనాదానుభవప్రమోదమ్ ॥ 11॥


💥తాత్పర్యము:

అందమైన చిరునవ్వు కలవాడవు, చంద్రకళను తలపై ధరించినవాడవు, వీణను పట్టుకున్నవాడవు , జటాజూటము కలవాడవు , నాదమును అనుభవించుచూ ఆనందించుచున్న వాడవు అగు నిన్ను కొందరు యోగులు ఉపాసించుచున్నారు. 


ఉపాసతే యం మునయః శుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః ।

తం దక్షిణామూర్తితనుం మహేశముపాస్మహే మోహమహార్తిశాన్త్యై ॥ 12॥


💥తాత్పర్యము:

శుకుడు మొదలగు మునులు ఆశలను వీడి మమకారమును వదిలి ఉపాశించుచున్న దక్షిణామూర్తి స్వరూపుడైన పరమేశ్వరుని , అజ్ఞానమనే మహాదుఃఖము నశించుటకై ధ్యానించుచున్నాను.


కాన్త్యా నిన్దితకున్దకన్దలవపుర్న్యగ్రోధమూలే వస న్కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః ।

మోహధ్వాన్తవిభేదనం విరచయన్బోధేన తత్తాదృశా దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా ॥ 13॥


💥తాత్పర్యము:

తెల్లని మల్లె పువ్వుల కంటే అధికమైన కాంతితో ప్రకాశించు శరీరము కలవాడు, మర్రిచెట్టు క్రింద ఉన్నవాడు, కరుణాసముద్రుడు, తన చూపులచే మునులను ఆదరించుచున్నవాడు, ఉపదేశముచే మునుల యొక్క అజ్ఞానాంధకారమును భేదించుచున్న వాడు అగు దక్షిణామూర్తి జ్ఞానముద్రను ధరించిన తన చేతితో నాకు "తత్త్వమసి” అను మహా వాక్యార్థమును బోధించుగాక. 


అగౌరగాత్రైరలలాటనేత్రైరశాన్తవేషైరభుజఙ్గభూషైః ।

అబోధముద్రైరనపాస్తనిద్రైరపూర్ణకామైరమరైరలం నః ॥ 14॥


💥తాత్పర్యము:

తెల్లని శరీరము లేనివారు, నుదుటి యందు మూడవ కన్ను లేనివారు, శాంతమైన వేషము లేనివారు, సర్పాభరణములు లేనివారు, నిద్రను జయించలేని వారు , కామ పరిపూర్ణత లేనివారు (దక్షిణామూర్తి కంటే ఇతరులు) అగు దేవతలతో మాకు పనిలేదు.


దైవతాని కతి సన్తి చావనౌ నైవ తాని మనసో మతాని మే ।

దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతమ్ ॥ 15॥


💥తాత్పర్యము:

భూమిపై ఎంతమంది దేవతలు లేరు? వారు నామనస్సుకు నచ్చినవారు కారు. మందమతులను సైతం అనుగ్రహించు దీక్ష కలవాడు , దక్షిణదిక్కు వైపు ఉన్న ముఖము కలవాడు అగు దక్షిణామూర్తియే దైవము.


ముదితాయ ముగ్ధశశినావతంసినే భసితావలేపరమణీయమూర్తయే ।

జగదీన్ద్రజాలరచనాపటీయసే మహసే నమోఽస్తు వటమూలవాసినే ॥ 16॥


💥తాత్పర్యము:

ఆనంద స్వరూపుడు, తలపై బాలచంద్రుని ధరించినవాడు , భస్మము పూసుకున్న సుందర శరీరము కలవాడు , ప్రపంచమనే ఇంద్రజాలమును ప్రదర్శించుటలో సమర్థుడు , మర్రిచెట్టు క్రింద ఉన్న వాడు అగు తేజోమూర్తికి నమస్కారము.


వ్యాలమ్బినీభిః పరితో జటాభిః కలావశేషేణ కలాధరేణ ।

పశ్యఁల్లలాటేన ముఖేన్దునా చ ప్రకాశసే చేతసి నిర్మలానామ్ ॥ 17॥


💥తాత్పర్యము:

ఓ దక్షిణామూర్తీ! చుట్టూ వ్రేలాడుచున్న జడలతో , ఒక్క చంద్రకళతో , మూడవ కంటితో , చంద్రుని వంటి ముఖముతో , నీవు పుణ్యాత్ముల హృదయము నందు ప్రకాశించుచున్నావు. 


ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేన్దుభావం ప్రకటీకరోషి ।

యదద్య తే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానసచన్ద్రకాన్తః ॥ 18 ॥


💥తాత్పర్యము:

ఓ దక్షిణామూర్తీ! నిన్ను ఉపాసించువారికి పార్వతితో కలిసి పూర్ణచంద్రుని వలే కనబడుచున్నావు. కనుకనే నా మనస్సనే చంద్రకాంతశిల నీ దర్శన మాత్రముననే నేడు ద్రవించుచున్నది.


యస్తే ప్రసన్నామనుసన్దధానో మూర్తిం ముదా ముగ్ధశశాఙ్కమౌలేః ।

ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యామన్తే చ వేదాన్తమహారహస్యమ్ ॥ 19॥


💥తాత్పర్యము:

ఓ దేవా! తలపై బాలచంద్రుని ధరించిన నీ ప్రసన్నమూర్తిని సంతోషముతో ధ్యానించువారికి ఐశ్వర్యము , దీర్ఘాయువు , జ్ఞానము లభించి చివరగా వేదాంత రహస్యము సిద్ధించును.


॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం దక్షిణామూర్తిస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు