💥అంతులేని సంపదనిచ్చే దక్షిణామూర్తి స్తోత్రం
⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏
💥అంతులేని సంపదనిచ్చే దక్షిణామూర్తి స్తోత్రం:
"దక్షిణామూర్తి" స్తోత్రం గురించి తెలుసుకునే ముందు ఆది గురువు దక్షిణామూర్తి గుణగణాలను తెలుసుకుందాం.
ప్రధానంగా దక్షిణామూర్తి చాలా శాంత స్వరూపులు.
అసలు దక్షిణామూర్తి అనే పేరు దక్షిణం వైపు ఉండే మూర్తిగా కొందరికి తెలుసు.. అయితే దక్షిణామూర్తిలో దక్షిణము అనగా దాక్షిణ్యం (సమర్ధత) కురిపించే స్వామీ అనే అర్ధం కూడా వస్తుంది.
చాలా వరకూ దక్షిణామూర్తి ఫోటోను పరిశీలిస్తే ఆయన తత్త్వం చాలా వరకూ అర్ధమైపోతుంది.
దక్షిణామూర్తిని చూడగానే ఆయన చిన్ ముద్రలో మర్రిచెట్టు క్రింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కి ఉండగా క్రింద ఋషులు కూర్చుని ఉంటారు.
ప్రశాంతంగా కనిపించే స్వామి కుడివైపు చెవికి నాగాభరణం ఉండగా ఎడమవైపు చెవికి జగన్మాత యొక్క కర్ణాభరణం ఉంటుంది.
దీనిని బట్టి "#అర్ధనారీశ్వర" రూపంలో ఆ స్వామి భక్తులను ఆశీర్వదిస్తున్నారని తెలుస్తోంది.
ఇక ప్రతీ ఒక్కరూ వెళ్ళే శివాలయాలలో దక్షిణ దిక్కు వైపు ఉన్న దక్షిణామూర్తిని ధ్యానించడం చాలా మంచిది.
దక్షిణం వైపు ఉన్న స్వామికి ఎదురుగా ఆప్రాంతంలో స్వామికి అభిముఖంగా కూర్చొని స్వామిని ధ్యానించడం వల్ల అపమృత్యువు దరిచేరదు.
💥దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం వల్ల అద్భుత ఫలితాలు:
దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వల్ల అపమృత్యువు దరిచేరదు.
కష్టాలకు ప్రధాన కారణం గురు గ్రహ బలం లేకపోవడం.. ప్రతినిత్యం పారాయణం చేయడం వల్ల గురు గ్రహం బలం పెరిగి కష్టాలు, బాధలూ తొలగడంతో పాటు జీవితంలో తెలిసీ తెలియకుండా చేసిన పాపాలను నశింపజేస్తుంది.
విద్యా బుద్దులు చేకూరాలనుకునేవారు తప్పనిసరిగా దక్షిణామూర్తి ఆరాధన చెయ్యాలి
జ్ఞానం కోరుకునే వాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని సైతం ప్రసాదించే స్వామి దక్షిణామూర్తి.
దక్షిణామూర్తిని ఆరాధించే వారికి సంపదకు కొదవ ఉండదు.
💥#స్తోత్రం
విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా ।
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥
బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ ।
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ।
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4 ॥
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః ।
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥
రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ ।
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా ।
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః ।
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥
భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 ॥
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ ।
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ ॥ 10 ॥
॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ ॥
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment