Posts

వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ "అక్షయ తృతీయ"

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥అక్షయం... లక్ష్మీప్రదం...  వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ "అక్షయ తృతీయ " మహాభారతంలో ధర్మరాజు సూర్యారాధన చేసి, భాస్కరుడి నుంచి అక్షయపాత్రను పొందిన రోజు ఇదేననీ, అందువల్ల ఈ పర్వదినం ‘అక్షయ తృతీయ’గా ప్రసిద్ధి పొందిందనీ కొందరి విశ్వాసం.  పరమ పవిత్రమైన గంగానది దివినుంచి భువికి దిగివచ్చిన రోజు ఇదేనని పురాణ కథనం.  అంతే కాదు, కుచేలుడు శ్రీకృష్ణ దర్శనంతో అక్షయమైన సంపదలు పొందిన రోజు ఇదేనని కొందరి భావన. ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి, ఆమె దాన గుణాన్ని గుర్తించి ఆదిశంకరులు అమ్మవారిని ‘కనకధారా స్తోత్రం’తో ప్రార్థించి ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే అని చెబుతారు. 🌹మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు.  వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకా...

🌹శంకరుల నోట పలికిన లక్మీ స్తోత్రమే "కనకధారా స్తోత్రం

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥"జగద్గురు" "ఆదిశంకరులు" భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళార‌ట‌.    యజమాని ఇంట లేని సమయంలో కటిక దరిద్రంతో బాధపడుతున్న ఆ ఇల్లాలు దిక్కు తోచని స్థితిలో ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరి కాయను దానం చేసింది ఆ మ‌హాత‌ల్లి. వారి దారిద్ర్యాన్ని తొలగించమని శంకరులు లక్ష్మీదేవిని ప్రార్థించారు. లక్ష్మి ప్రసన్నమై ఆ ఇంట బంగారు ఉసిరికాయలు ధారగా కురిపించింది.    🌹 శంకరుల నోట పలికిన లక్మీ స్తోత్రమే "కనకధారా స్తోత్రం" మాన‌వాళికి క‌న‌క‌ధారా స్త్రోత్రం ఒక పెద్ద వ‌రం. లక్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతి రోజు "కనకధారా" స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం ద‌రిచేర‌దు. సకలసంపత్ప్రదాయకమని ఈ స్తోత్రం పారాయణ పట్ల భక్తులకు విశ్వాసం. 🍁🍁🍁🍁🍁 💥🌷శ్రీ కనకధారా స్తోత్రం🌷💥 వందే వందారు మందార మందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం   అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ భృంగాగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః   ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత...

⚜️🕉️🚩 ఓం నమో భగవతే రమణాయ నమః 🌹🙏

Image
 ⚜️ 🕉️🚩 ఓం నమో భగవతే రమణాయ నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥మౌనమే అత్యుత్తమ ఉపదేశం... తన ఉనికి ద్వారానే భక్తుల జీవితాలలో వెలుగు నింపిన భగవాన్‌ రమణ మహర్షి 1879వ సంవత్సరం డిసెంబర్‌ 29వ తేదీ అర్థరాత్రి జన్మించారు. దక్షిణ భారతావనిలోని తమిళనాట తిరుచ్చుళీ క్షేత్రం. శివుని పంచమూర్తులలో నటరాజ ఆనందమూర్తి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని, జరుపుకున్న ఆరుద్ర దర్శనం అనే ఉత్సవ సందర్భం.  శ్రీభూమినాథేశ్వర ఆలయ సంబంధ ఆలంకృత ఉత్సవ మూర్తులను రథంపై వీధులగుండా ఊరేగించిన ఉత్సవ సమయం. అర్థరాత్రి దాటాక డిసెంబర్‌ 30నాటి తొలి గంటలో కోవెలను ఆనుకుని ఉన్న ఇంటిలో ఒక మగ శిశువు జన్మించాడు. సుందరం అయ్యర్‌, ఆళగమ్మ దంపతులకు కలిగిన ఆ బాలునికి.. 'వేంకటేశ్వరన్‌’ అని పేరు పెట్టారు. ఆ బాలుడే తర్వాతి కాలాన "భగవాన్‌ రమణ మహర్షి" అని ఖ్యాతి గడించాడు.  🍁🍁🍁🍁🍁 🌹భగవంతుడిని అంతర్నేత్రంలో దర్శించడానికి ఉత్తమమైన ఆధ్యాత్మిక మార్గం "మౌనం" అని తన జీవితం ద్వారా రుజువుచేసిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్‌ రమణ మహర్షి. మౌనం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు రమణ మహర్షి. నిశ్శబ్దా...

💥అనంత కరుణా సముద్రుడై భక్తులను సతతమూ రక్షించే సనాతన శాశ్వత ఆనందమే "శ్రీదత్తాత్రేయ" అవతారం

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీదత్తాయ నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥అనంత కరుణా సముద్రుడై భక్తులను సతతమూ రక్షించే సనాతన శాశ్వత ఆనందమే "శ్రీదత్తాత్రేయ" అవతారం . స్వామి ఇహ, పర ఉభయ ఫలప్రదాత.. 🌹అవధూతకు అందరూ గురువులే! ప్రహ్లాదుడికి అజగరవ్రతధారి మునిరూపంలో సాక్షాత్కరించి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని చరాచరాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు. తనకు "ఇరవై నాలుగు" మంది ప్రధానమైన గురువులు అని అజగర రూపంలో ప్రహ్లాదుడికి ఇలా వివరించాడు... 💢 కర్మబంధంలో చిక్కి స్వయంగా బాధపడే అజ్ఞానుల వల్ల.. కలిగే బాధలన్నిటినీ భరిస్తూనే, వారికి వీలైనంత మేలు చేస్తాను. దీన్ని నేను "భూమాత" నుంచి నేర్చుకున్నాను. 💢 సుగంధ దుర్గంధాల్ని మోస్తూనే వాటికి అంటకుండా ఉండే "వాయువు"ను చూసి సుఖదుఃఖాల మధ్య ఉంటూనే వాటికి చిక్కకుండా ఉండటం అవగతం చేసుకున్నాను. 💢 దేనితోనూ సంబంధం లేకుండా ఉండే "ఆకాశాన్ని" చూసి, ఈ జడమైన శరీరాన్ని మోస్తూనే, అది నేను కానట్లు ఉండటం తెలుసుకున్నాను. 💢 తనను తాకిన అన్నిటినీ శుద్ధి చేసే "నీటి"ని చూసి నా సంగంలోకి వచ్చిన వారందరికీ పవిత్రతను, మంచిని ప...

నిజరూపం... అపురూపం (అప్పన్న చందనోత్సవం)

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామినే నమః🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥నిజరూపం... అపురూపం (అప్పన్న చందనోత్సవం) సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం!!  🌹ప్రహ్లాదుని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. అలాగే ప్రహ్లాదుని కోరిక మేరకే, వరాహ నారసింహ అవతారాల కలయికతో ఇలపై వెలసిన దివ్యక్షేత్రం "సింహాచలం"  ఇక్కడ స్వామి వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. ఏడాదిలో 364 రోజులూ సుగంధ పరిమళ చందనమై పూతలో దర్శనమిచ్చే స్వామి ఒక్కనాడు అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే అదీ ఓ పూట శ్రీచందన ముసుగును తొలగించి భక్తులకు నిజరూప దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు.  కుందాభ సుందర తనుః పరిపూర్ణ /  చంద్రబింబానుకారి వదన ద్విభుజస్ర్తీ నేత్రః శాంతస్ర్తీభంగి లలితః క్షితి గుప్తపాదః / సింహాచలే జయతి దేవ వరోనృసింహః 🌹ఇచ్చట వెలసిన శ్రీ వరాహ నారసింహుడు సుందరమైన తనువు కలవాడు. పూర్ణ చంద్రుని వంటి మేనిఛాయ కలవాడు, ద్విభుజుడు, త్రినేత్రుడు, శాంతమూర్తి, శరీరమందు మూడు వంకలు కలవాడు, భూమి లోపల పాదాలు నిక్షిప్త...

💥సత్యప్రమాణాల దేవుడు "శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి"

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥 సత్యప్రమాణాల దేవుడు "శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి" 🌹కోర్కెలు తీర్చే స్వామి... ఏ క్షేత్రానికైనా ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉంటుంది. కోర్కెలు తీర్చే దేవతగానో, మొక్కులు తీర్చే దేవుడుగానో ఒక్కో ఆలయం ఒక్కో రకంగా భక్తుల హృదయాలలో పవిత్ర భావాన్ని కలిగిస్తుంది. అయితే ఒకే ఆలయం రెండు విశేష ప్రాముఖ్యతలకు ప్రాతినిథ్యం వహించడం అరుదు. కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి దేవస్థానంలో ఒక వైపు భక్తులకు వరాలు ఇచ్చే దేవుడుగా, మరోవైపు ప్రమాణాలతో సత్య శోధన చేసి దేవదేవుని క్షేత్రంగా ప్రసిద్ది గాంచింది.  🌹ఆలయ చరిత్ర... ఈ ఆలయానికి సుమారు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చెబుతోంది. తొలుత ఈ గ్రామాన్ని "విహారపురి" అని పిలిచేవారు. ఇక్కడ జన్మతః మూగ, చెవిటి, గుడ్డి అయిన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకొని జీవనం గడిపేవారు. వీరు ఒక రోజు ఏతంతో నీటిని తోడుతూ పొలాలకు పారిస్తుండగా నీటి మట్టం తగ్గిపోవడంతో ఏతం బాన బావి అడుగుకు తగిలి ఖంగుమని శబ్ధం చేసింది. చూస్తే వినాయకుడి విగ్రహం కనపడింది. తల వెనుక భాగానికి ఏతం తగలడంతో అక్కడ ఊటలాగా రక్తం రా...

💥శ్రీ షణ్ముఖ దండకం...

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥 శ్రీ షణ్ముఖ దండకం... శ్రీపార్వతీపుత్ర, మాం పాహి వల్లీశ, త్వత్పాదపంకేజ సేవారతోఽహం, త్వదీయాం నుతిం దేవభాషాగతాం కర్తుమారబ్ధవానస్మి, సంకల్పసిద్ధిం కృతార్థం కురు త్వమ్ । భజే త్వాం సదానందరూపం, మహానందదాతారమాద్యం, పరేశం, కలత్రోల్లసత్పార్శ్వయుగ్మం, వరేణ్యం, విరూపాక్షపుత్రం, సురారాధ్యమీశం, రవీంద్వగ్నినేత్రం, ద్విషడ్బాహు సంశోభితం, నారదాగస్త్యకణ్వాత్రిజాబాలివాల్మీకివ్యాసాది సంకీర్తితం, దేవరాట్పుత్రికాలింగితాంగం, వియద్వాహినీనందనం, విష్ణురూపం, మహోగ్రం, ఉదగ్రం, సుతీక్షం, మహాదేవవక్త్రాబ్జభానుం, పదాంభోజసేవా సమాయాత భక్తాళి సంరక్షణాయత్త చిత్తం, ఉమా శర్వ గంగాగ్ని షట్కృత్తికా విష్ణు బ్రహ్మేంద్ర దిక్పాల సంపూతసద్యత్న నిర్వర్తితోత్కృష్ట సుశ్రీతపోయజ్ఞ సంలబ్ధరూపం, మయూరాధిరూఢం, భవాంభోధిపోతం, గుహం వారిజాక్షం, గురుం సర్వరూపం, నతానాం శరణ్యం, బుధానాం వరేణ్యం, సువిజ్ఞానవేద్యం, పరం, పారహీనం, పరాశక్తిపుత్రం, జగజ్జాల నిర్మాణ సంపాలనాహార్యకారం, సురాణాం వరం, సుస్థిరం, సుందరాంగం, స్వభాక్తాంతరంగాబ్జ సంచారశీలం, సుసౌందర్యగాంభీర్య సుస్థైర...