Posts

Showing posts from August, 2026

శ్రీసుబ్రహ్మణ్య పంచరత్నం💥 తాత్పర్య సహితము..

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం 💥శ్రీసుబ్రహ్మణ్య పంచరత్నం💥 తాత్పర్య సహితము.. షడాననం చందన లేపితాంగం – మహోరసం దివ్యమయూరవాహనమ్ | రుద్రస్యసూనుం సురలోకనాథం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 🌹 తాత్పర్యం: ఆరు ముఖములుకలవాడు, శరీరముపై చందనమును ధరించువాడు, రసస్వరూపుడు, నెమలి వాహనముకలవాడు, శివుని తనయుడు, దేవలోకాలకు అధిపతియైన పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను. జాజ్వల్యమానం సురవృన్దవంద్యం – కుమారధారాతట మందిరస్థమ్ | కందర్పరూపం కమనీయగాత్రం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 🌹 తాత్పర్యం: దేదీప్యమానంగా భాసిల్లువాడు, సురులచే కొలవబడువాడు, కుమారధార నదీతీరమున ఆలయంలో వెలసినవాడు, ఆకర్షణీయమైన రూపముకలవాడు అయిన పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను. ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమశిందధానమ్ | శేషావతారం కమనీయరూపం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 🌹 తాత్పర్యం: ఆరుజతల చేతులు కలవాడు, ద్వాదశ పవిత్ర నేత్రాలు కలవాడు, త్రినేత్రుని తనయుడు, శూలమును ఆయుధముగా ధరించువాడు, శేషుని అవతా...

యమ కృత శివ కేశవ స్తోత్రం

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹 🙏 "యమ కృత శివ కేశవ స్తోత్రం" (శ్రీ శివకేశవ స్తుతిః) అనేది యమధర్మరాజు చేత ఉపదేశించబడిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఈ స్తోత్రంలో శివుడు (హర), విష్ణువు (హరి) ఇద్దరి నామాలు కలిసి ఉంటాయి. దీనిని భక్తితో పఠించేవారి జోలికి వెళ్ళవద్దని యమధర్మరాజు తన దూతలను ఆదేశిస్తాడు. విశేషించి కార్తీక మాసంలోను, నిత్య ప్రార్థనలోను దీనిని చదవడం వల్ల అపమృత్యు భయాలు తొలగి, ఆరోగ్యం, సర్వసిద్ధులు చేకూరుతాయి. 💥యమ కృత శివ కేశవ స్తోత్రం💥 ధ్యానం మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ । వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ ॥ స్తోత్రం గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే । దామోదరాఽచ్యుత జనార్దన వాసుదేవ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 1 గంగాధరాంధకరిపో హర నీలకంఠ వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే । భూతేశ ఖండపరశో మృడ చండికేశ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 2 విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ । నారాయణాఽసురనిబర్హణ శార్ఙ్గపాణే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 3 మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే । ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ త్యాజ్యాభటాయ...