⚜️🕉️🚩 ఓం నమో భగవతే రమణాయ నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం నమో భగవతే రమణాయ నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥మౌనమే అత్యుత్తమ ఉపదేశం...


తన ఉనికి ద్వారానే భక్తుల జీవితాలలో వెలుగు నింపిన భగవాన్‌ రమణ మహర్షి 1879వ సంవత్సరం డిసెంబర్‌ 29వ తేదీ అర్థరాత్రి జన్మించారు.


దక్షిణ భారతావనిలోని తమిళనాట తిరుచ్చుళీ క్షేత్రం.

శివుని పంచమూర్తులలో నటరాజ ఆనందమూర్తి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని, జరుపుకున్న ఆరుద్ర దర్శనం అనే ఉత్సవ సందర్భం. 


శ్రీభూమినాథేశ్వర ఆలయ సంబంధ ఆలంకృత ఉత్సవ మూర్తులను రథంపై వీధులగుండా ఊరేగించిన ఉత్సవ సమయం.


అర్థరాత్రి దాటాక డిసెంబర్‌ 30నాటి తొలి గంటలో కోవెలను ఆనుకుని ఉన్న ఇంటిలో ఒక మగ శిశువు జన్మించాడు.

సుందరం అయ్యర్‌, ఆళగమ్మ దంపతులకు కలిగిన ఆ బాలునికి.. 'వేంకటేశ్వరన్‌’ అని పేరు పెట్టారు.

ఆ బాలుడే తర్వాతి కాలాన "భగవాన్‌ రమణ మహర్షి" అని ఖ్యాతి గడించాడు. 

🍁🍁🍁🍁🍁


🌹భగవంతుడిని అంతర్నేత్రంలో దర్శించడానికి ఉత్తమమైన ఆధ్యాత్మిక మార్గం "మౌనం" అని తన జీవితం ద్వారా రుజువుచేసిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్‌ రమణ మహర్షి.


మౌనం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు రమణ మహర్షి.


నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని మౌన సాధనవల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుందంటారు.


🌹గురువు అనుగ్రహానికి ఉత్తమోత్తమ రూపం మౌనమే.

అదే అత్యుత్తమ ఉపదేశం.


మౌనంలోనే సాధకుని ప్రార్థన పరాకాష్టకు చేరు తుంది. గురువు మౌనంలో ప్రతిష్ఠితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది అన్నది రమణుల మౌన బోధ.


ఎన్నో ప్రశ్నలు అడగాలని అరుణాచలం వచ్చిన భక్తులు గంటల తరబడి మహర్షి సమక్షంలో మౌనంగా కూర్చునేవారు.

వారి మధ్య మాటలు వుండవు.

అడగాలనుకున్న ప్రశ్నలు అడగరు.

మహర్షి సమాధానం చెప్పరు.

అయితేనేం అప్రతిహతమైన శాంతిప్రవాహం అన్ని దిక్కుల నుండి వెల్లువలా వ్యాపించి మనస్సును శాంతితో నింపుతుంది.

ఇదే రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థం.


🌹 "నిన్ను నువ్వు తెలుసుకో.

నువ్వు ఎవరో తెలిస్తే ఈ సమస్తం తెలుస్తుంది.

దేహమే నేను అనే సంకుచిత భావనే అహానికి, ప్రారబ్ద కర్మకు కారణ మవుతుంది.

జన్మజన్మల కర్మబంధానికి హేతువు అవుతుంది.

ఒక్కసారి దేహభావన తొలగిందంటే కర్మబంధం పటాపంచలవుతుంది”

ఇదే ఎల్లప్పుడూ ఆయన ఉపదేశం.

🔸🔹🔸🔹🔸


💥1896 ఆగస్టు 29న చదువుల పట్ల నిరాసక్తత కలిగి, ఇల్లు వదిలి స్కూల్‌ ఫీజుకు 5 రూపాయలు అన్న వద్ద తీసుకుని,

ఉదాత్తమైన ఆశయ సాధన కోసం వెళుతున్నానని 3 రూపాయలు వెంట ఉంచుకుని, లేఖ వదిలి వెళ్ళి, దైవ మార్గ నిర్దేశత్వంతో, కష్ట నష్టాలకు ఓర్చి,


సుదీర్ఘ ప్రయాణానంతరం సెప్టెంబర్‌ 1న అరుణోదయ వేళలో అరుణాచలంలో మంగళప్రద మంగళ వారం మంచి ఘడియలో పాదం మోపి,


ప్రాకార ద్వారాలు, గర్భాలయం సహా బార్లా తెరిచి ఉన్న శ్రీ అరుణాచలేశ్వర ఆలయ ప్రవేశం చేశారు. మహా లింగాలింగనం ద్వారా ఆత్మ సమర్పణం చేసుకున్నారు


💥నాటి అరుణాచల ఆగమనం నుండి నేటి రమణాశ్రమంగా రూపుదిద్దుకున్న గిరి దక్షిణ పాదంలో స్థిరపడి, 1950, ఏప్రిల్‌ 14 మహా నిర్యాణం వరకు 54 ఏళ్ళు అరుణగిరి పొలిమేర దాటనే లేదు.


స్వామి ఉనికిని గురించి తెలుసుకున్న తల్లి అళగమ్మ, ఇంటికి వెళదామని అర్థించగా..


”కర్త వారివారి ప్రారబ్ధానుసారం జీవులనాడించును. జరుగనిది ఎంత ప్రయత్నించినను జరుగదు. జరుగునది ఎవరెంత యడ్డుకున్నను జరుగనే జరుగును. ఇది సత్యము. కనుక మౌనముగ ఉండుటయే ఉత్త మము".. అని కాగితంపై రాయగా, ఆమె ఖిన్నవదనయై వెనుతిరిగారు.


🌹1949 లో మహర్షుల ఎడమ మోచేతిపై సార్కమా (క్యాన్సర్‌) రాగా 1950, ఏప్రిల్‌ 14న స్వామి అంతిమ ఘడియలు సమీపించాయని గ్రహించిన భక్తులు ‘అరుణాచల శివ’ అంటూ రమణ మహర్షి విరచితాలను నినదించగా,


రాత్రి 8.47లకు దక్షిణాకాశంలో పెద్ద కాంతిగోళం మెరసి, ఈశాన్యం వైపు పయనించి, అరుణాచల శిఖరాన అంతర్హితమైంది.

రమణుల ఆధ్యాత్మిక శక్తి నానాటికీ భాసిస్తూనే ఉన్నది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏