💥సత్యప్రమాణాల దేవుడు "శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి"
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥సత్యప్రమాణాల దేవుడు "శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి"
🌹కోర్కెలు తీర్చే స్వామి...
ఏ క్షేత్రానికైనా ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉంటుంది.
కోర్కెలు తీర్చే దేవతగానో, మొక్కులు తీర్చే దేవుడుగానో ఒక్కో ఆలయం ఒక్కో రకంగా భక్తుల హృదయాలలో పవిత్ర భావాన్ని కలిగిస్తుంది.
అయితే ఒకే ఆలయం రెండు విశేష ప్రాముఖ్యతలకు ప్రాతినిథ్యం వహించడం అరుదు.
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి దేవస్థానంలో ఒక వైపు భక్తులకు వరాలు ఇచ్చే దేవుడుగా, మరోవైపు ప్రమాణాలతో సత్య శోధన చేసి దేవదేవుని క్షేత్రంగా ప్రసిద్ది గాంచింది.
🌹ఆలయ చరిత్ర...
ఈ ఆలయానికి సుమారు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చెబుతోంది.
తొలుత ఈ గ్రామాన్ని "విహారపురి" అని పిలిచేవారు. ఇక్కడ జన్మతః మూగ, చెవిటి, గుడ్డి అయిన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకొని జీవనం గడిపేవారు.
వీరు ఒక రోజు ఏతంతో నీటిని తోడుతూ పొలాలకు పారిస్తుండగా నీటి మట్టం తగ్గిపోవడంతో ఏతం బాన బావి అడుగుకు తగిలి ఖంగుమని శబ్ధం చేసింది. చూస్తే వినాయకుడి విగ్రహం కనపడింది.
తల వెనుక భాగానికి ఏతం తగలడంతో అక్కడ ఊటలాగా రక్తం రావడం ప్రారంభమైంది.
వినాయకుని రక్తజలంతో వారి శరీరాలు ప్రక్షాళన అయ్యాయని ప్రతీతి.
దీంతో మూగ వానికి మాటలు వచ్చాయి.
చెవిటి వారికి శ్రావ్యంగా వినపడింది.
గుడ్డివానికి చూపు వచ్చింది.
దీంతో ముగ్గురు సోదరులు ఆ గ్రామస్థులకు తెలియజేశారు.
గ్రామ ప్రజలు వచ్చి బావిలో స్వామివారికి పూజలు నిర్వహించారు.
తరువాత ఎంత తవ్వినా స్వామి వారి విగ్రహం చివరి భాగాన్ని కనుక్కొలేకపోయారు.
అందుచేత విగ్రహాన్ని అక్కడే ఉంచి పూజలు చేయసాగారు.
భక్తులు వినాయకునికి నారికేళ ఫలాలు ఇష్టమని ఒక్క క్షణం నిలపకుండా కొబ్బరి కాయలు కొట్టసాగారు.
స్వచ్చమైన కొబ్బరినీళ్ళతో ఆ బావి నుంచి నీరు పొంగి ప్రవహించింది.
బావి నుంచి పొంగి పొరలిన కొబ్బరి నీళ్ళు కాణిమాగాణి అంతా పాకింది.
కాణి అనగా ఎకరా పాతికనేల.
అలా ఎకరానేల కొబ్బరి నీళ్ళు పాకిన ఆ ప్రాంతాన్ని "కాణేపాకం"గా పిలుస్తూ వచ్చారు.
కాలక్రమేణా అది "కాణిపాకం" పేరు మారింది.
🌹బహుదానది పేరూ చారిత్రకమే...
స్వామి వారు ఆలయ సమీపంలో వెలసి ఉన్న బహుదానదికి కూడా ఆ పేరు రావడానికి మరో కథ ప్రచారంలో ఉంది.
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి వారిని దర్శించుకునేందుకు శంఖుడు, లిఖుతుడి అనే ఇద్దరు సోదరులు కాలినడకన బయలు దేరారు.
నడకతో అలిసిపోయిన వారు ఒక మామిడి చెట్టు కింద విశ్రమించారు.
ఆకలితో ఉన్న లిఖుతుడు అన్నమాటను పెడచెవిన పెట్టి మామిడి పండు కోసుకొని తిన్నాడు.
ఈ విషయం తెలిసిన రాజు అతని రెండు చేతులను ఖండించి వేయించాడు.
దీంతో దుఖఃసాగరంలో మునిగిన ఆ సోదరులు ఆలయ సమీపంలో ఓ కొలనులో మునగడంతో లిఖితునికి చేతులు వచ్చాయి.
చేతులు ప్రసాదించిన తీర్ధం కావడంతో దానిని ‘బహుదానది’ అన్న పేరు స్ధిరపడిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
🌹ప్రమాణాలకు నెలవు - స్వామివారి కొలువు...
వివాదాలను, సవాళ్ళను, ప్రతి సవాళ్ళను పరీక్షించుకునేందుకు ప్రజలు చేసే ప్రమాణాలకు కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయకస్వామి ఆలయం ప్రధాన స్దావరంగా నిలుస్తోంది.
కాణిపాకం ఆలయం సత్య ప్రమాణాలకు ప్రసిద్ది చెందింది.
దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడుగా కీర్తి గడించిన స్వామి ఎదుట సత్యప్రమాణం చేస్తే తప్పుడు ప్రమాణం చేసిన వ్యక్తికి ప్రతిఫలం అనుభవిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
🌹వరాల మారాజు...
కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి భక్తులకు వరాలనిచ్చే మారాజుగా భక్తులచే కొనియాడబడుతున్నాడు.
గ్రహపీడితులు, దీర్ఘకాలిక రోగగ్రస్థులు, వ్యసనపరులు, వివాహం కాని వారు, పలు రకాల సమస్యలు ఉన్న భక్తులు ఇక్కడ మొక్కుకుంటే వారి ఇబ్బందులు తొలగడంతో పాటు ప్రశాంత జీవనం దొరుకుతుం దని భక్తుల నమ్మకం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment