వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ "అక్షయ తృతీయ"
⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥అక్షయం... లక్ష్మీప్రదం...
వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ "అక్షయ తృతీయ"
మహాభారతంలో ధర్మరాజు సూర్యారాధన చేసి, భాస్కరుడి నుంచి అక్షయపాత్రను పొందిన రోజు ఇదేననీ, అందువల్ల ఈ పర్వదినం ‘అక్షయ తృతీయ’గా ప్రసిద్ధి పొందిందనీ కొందరి విశ్వాసం.
పరమ పవిత్రమైన గంగానది దివినుంచి భువికి దిగివచ్చిన రోజు ఇదేనని పురాణ కథనం.
అంతే కాదు, కుచేలుడు శ్రీకృష్ణ దర్శనంతో అక్షయమైన సంపదలు పొందిన రోజు ఇదేనని కొందరి భావన.
ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి, ఆమె దాన గుణాన్ని గుర్తించి ఆదిశంకరులు అమ్మవారిని ‘కనకధారా స్తోత్రం’తో ప్రార్థించి ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే అని చెబుతారు.
🌹మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు.
వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది.
అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది.
ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది.
ఈనాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది.
🌹ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు.
అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు.
ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి,
అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు.
ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు.
అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము.
అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు.
ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.
ఈ తిథినాడు పదహారు మాష మితమగు (పదహారు మినప గుండ్ల ఎత్తు) స్వర్ణమును విప్రునకు దానమిచ్చిన, వాని ఫలము అక్షయము.
వాడు అన్ని లోకములందు పూజ్యుడై విరాజమానుడగును.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment