Posts

💥॥ శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రమ్ ॥💥

Image
 ⚜️ 🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏 గురువు అనగా అజ్ఞానమును రూపుమాపి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేసి ఆత్మోన్నతిని కలుగజేసేవాడు. అటువంటి గురువులకే గురువు, గురుశ్రేష్ఠుడూ దక్షిణామూర్తి. ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో పరిపుష్టులో వారు మాత్రమే దక్షిణామూర్తి వైభవాన్ని తెలుసుకోగలరని ఆదిశంకరుల వాక్కు... ఇది అది అని లౌకిక విషయాలు కాదు. ఆయన ఇవ్వలేని దంటూ ఏదీ లేదు. ఏదైనా అపారంగా వర్షిస్తాడు. పరమ కారుణ్యమూర్తి ఉపాసనాపరంగా మనల్ని వెంట ఉండి నడిపించే శక్తి ఆయన... అయితే ఆయనను ఆరాధించే వారు ఎవరూ కూడా లౌకిక విషయాలు అడగలేరు. ఎందుకంటే ఆయన పాదాలను మనం పట్టే స్థితికి వచ్చాము అంటే మనకు లౌకిక విషయాల పట్ల కోరికలను కోరుకునే స్థితి ఉండదు. అంతా నీ కృప స్వామి ఏది ఇచ్చినా నీవే. కాపాడినను నీవే, కష్టపెట్టినా నీవే. అని నమ్మి అన్నింటినీ సాక్షి గా చూసే స్థితి ఉన్న వారే ఆయన అనుగ్రహానికి పాత్రులౌతారు. అలాంటి దక్షిణామూర్తి స్తోత్రం మన ఉన్నతి కోసం. ఆదిశంకరుల అనుగ్రహ విరచితం. 💥॥ శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రమ్ ॥💥 మూలేవటస్య మునిపుంగవసేవ్యమానం ముద్రావిశేషముకులీకృతపాణిపద్మం మందస్మితం మధురవేషముదారమాద్యం తేజస్తద...

💥ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి.. శ్రీలక్ష్మీజయంతి.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥 ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి.. శ్రీలక్ష్మీజయంతి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగాధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్ శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరం త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ పురాణాల ప్రకారం, శ్రీ లక్ష్మీదేవి ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి నక్షత్రంలో జన్మించింది. లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. 1. స్వాయంభువ మన్వంతరంలో - భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం. 2. సార్వోచిష మన్వంతరంలో - అగ్ని నుండి అవతరణ. 3. జౌత్తమ మన్వంతరంలో - జలరాశి నుండీ, 4. తామస మన్వంతరంలో - భూమి నుండీ, 5. రైవత మన్వంతరంలో - బిల్వవృక్షం నుండీ, 6. చాక్షుష మన్వంతరంలో - సహస్రదళ పద్మం నుండీ, 7. వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది. ఇందులో మొదటి మన్వంతరముగా చెప్పుకుంటున్న స్వాయంభువ మన్వతరంలో - భృగుమహర్షి, ఖ్యాతిలకు పుత్రసంతానం ఉన్నప్పటికీ కుమార్తెలు కూడా కావాలనే కోరిక అమితంగా ఉండడంతో, భర్త అనుమతితో ఖ్యాతి పుత్రికను ప్రసాదించమని దేవ...

అరుణాచల శివ అరుణాచల శివ

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 అరుణాచల శివ అరుణాచల శివ       అరుణాచల శివ అరుణాచల శివ  శ్లో: "దర్శనాత్ అబ్రసదసి జననాత్ కమలాలయే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః " భావం : చిదంబరం లో శివదర్శనం, తిరువాయూర్ లో జననం, అరుణాచలేశ్వరుని స్మరణం, లేదా కాశీలో మరణం ముక్తి కారకములు. కాశీలో మరణించిన వారికి ముక్తిని ప్రసాదిస్తానని తాను చేసిన ప్రతిజ్ఞని పరమేశ్వరుడు ఎలా నెరవేర్చుకుంటాడో శ్రీనాధ కవిసార్వభౌముడు కాశీఖండంలో తెలియచేసిన పద్యం: పద్యం: పాలిండ్లు కదలంగా పసిడి పైయెద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ, ధుఃకారమొనరించు తొండంబు ముక్కున శిఖరారావము జిలుకు డుంఠి, ప్రత్యక్షమైవచ్చి భాగీరధీ గంగ మృదుల హస్తంబు చాచి మేను నిమురు, ప్రధమోత్తముండు భృంగి భయరక్షణార్ధంబు ఫాలాగ్రమున దీర్చు భసిత రేఖ, దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్లి, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడుపదేశమొనరించు కాశి! భావం : ఊపిరి అందక మరణావస్థలో ఉన్న జీవుడు ప్రాణోత్క్ర్కమణం అవుతున్నవేళ: 1. చక్కటి సువాసనలు వెదచల్లుతూ, గాజుల, కాలియందెల చప్పుడు వినిపిస్తుండగా పర్వత రాజపుత్రి అయిన పార్వతి దేవ...

💥లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🌹🙏 💥 లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం💥 శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే । యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥ బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత । లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥ సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య । త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥ సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య । ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 4 ॥ సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య । దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 5 ॥ సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ । ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 6 ॥ సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః । నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 7 ॥ సంసారవృక్షబీజమనంతకర్మ...

అమలక ఏకాదశి విశిష్టత

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 అమలక ఏకాదశి ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని "అమలక ఏకాదశి" లేదా "అమలకి ఏకాదశి" అంటారు. ఈ రోజు ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు. ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత. భక్తి శ్రద్ధలతో "ఓం నమో నారాయణాయ" అని స్మరిస్తూ ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్ళను పోయాలి. ఆ తర్వాత చెట్టునకు పసుపు, కుంకుమ, గంధం పూలతో అలంకరించి, దీపం, ధూపం, అరటి ఆకులో అరటిపండు నైవేద్యం పెట్టిన తర్వాత.. చెంబులో కొన్ని నీళ్ళను పోసుకుని అందులో తెల్లని దారం ఉండను వేసి దారాన్ని పచ్చగా తడవనిచ్చిన తర్వాత పచ్చగా పసుపునీటిలో తడిసిన ఆ పసుపు దారాన్ని ఉసిరిక చెట్టునకు సవ్య దిశగా ప్రదక్షిణాలు చేస్తూ చుట్టునకు ఓ అకు వరస చొప్పున పదమూడు చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన ధారాన్ని నిష్కల్మషమైన మనస్సుతో ముడి వేయాలి. ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో స్మరించ వలసిన మంత్రం :- ధాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి ! వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తధాకురు !! భగవంతుడు భక్తుడి యొక్క ప్రేమతో కూడుకున్న పిలుపునకు స్వామి ...

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏 విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే తాత్పర్యము : ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది.  నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు.  మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము)  పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై  శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి  నా నమస్కారములు. దక్షిణామూర్తి గురుపరంపరను, ఆయన తత్త్వాన్ని తెలియజేసే ప్రసిద్ధ శ్లోకం ఈ కింది విధంగా వుంది: సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం। అస్మదాచార్య పరియంతాం వందే గురుపరంపరాం॥ (అర్థం: సదాశివుడు నుండి ప్రారంభమై, శంకరాచార్యుల ద్వారా మధ్యలో కొనసాగి, మన గురువుల వరకు వచ్చిన గురుపరంపరను వందనాలు.) వేదాంతంలో అత్యంత గంభీరమైన తత్త్వం – దక్షిణామూర్తి తత్త్వం. ఇది ఒక ఆధ్యాత్మిక ఆవిష్కరణ మాత్రమే కాదు; జీవన దిశను, ...

వినాయక అష్టోత్తర శతనామ స్తోత్రం

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!! 'మెలితిరిగిన తొండంతో మహారూపంతో కోటి సూర్యులతో సమాన తేజస్సుతో వెలుగొందే దేవా! చేపట్టే ప్రతి కార్యం నిర్విఘ్నంగా కొనసాగేలా అనుగ్రహించు’ అంటూ యుగయుగాలుగా పూజలందుకుంటున్న వినాయకుడు ప్రమథ గణాలకు అధిపతి. గణాలన్నిటిని ఏకతాటిపై నడిపించేవాడు గణనాథుడు. ప్రథమ పూజ్యుడు. సత్యప్రమాణాల దేవుడు. వినాయకుడు అంటే వేరే నాయకుడు లేనివాడనీ, తనకు తానే నాయకుడనీ అర్థం. విశేషమైన నాయకత్వ లక్షణాలు కలవాడు. అద్వితీయుడు. ఆనంద స్వరూపుడు. వినాయకోత్పత్తి గురించి ఎన్ని పురాణ గాథలు ఉన్నా, పార్వతీదేవి మంగళస్నానం సందర్భంగా నలుగుపిండితో తయారు చేసిన బొమ్మకు ప్రాణం పోసి, వాకిలి వద్ద కావలి ఉంచడం, తన ప్రవేశాన్ని అడ్డగించడంతో ఆగ్రహించిన శివుడు బాలుడి తలను తుంచి, పార్వతీ విలాపంతో గజాసురుని తలను అతికించి పునర్జీవింపచేయడం లోకంలో ప్రసిద్ధమైన కథ. వినాయకుడు ప్రకృతి ప్రేమికుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. విఘ్నాలు తొలగేందుకు ఆయనను అర్చించడంతో పాటు ఆయన లోకానికి అందించిన వ్యక్తిత్వ వికాస కోణంలోని సందేశాన్ని అవగాహన చేసుకోవలసి ఉంది...