💥॥ శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రమ్ ॥💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏


గురువు అనగా అజ్ఞానమును రూపుమాపి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేసి ఆత్మోన్నతిని కలుగజేసేవాడు. అటువంటి గురువులకే గురువు, గురుశ్రేష్ఠుడూ దక్షిణామూర్తి.


ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో పరిపుష్టులో వారు మాత్రమే దక్షిణామూర్తి వైభవాన్ని తెలుసుకోగలరని ఆదిశంకరుల వాక్కు...


ఇది అది అని లౌకిక విషయాలు కాదు. ఆయన ఇవ్వలేని దంటూ ఏదీ లేదు. ఏదైనా అపారంగా వర్షిస్తాడు. పరమ కారుణ్యమూర్తి ఉపాసనాపరంగా మనల్ని వెంట ఉండి నడిపించే శక్తి ఆయన...


అయితే ఆయనను ఆరాధించే వారు ఎవరూ కూడా లౌకిక విషయాలు అడగలేరు. ఎందుకంటే ఆయన పాదాలను మనం పట్టే స్థితికి వచ్చాము అంటే మనకు లౌకిక విషయాల పట్ల కోరికలను కోరుకునే స్థితి ఉండదు. అంతా నీ కృప స్వామి ఏది ఇచ్చినా నీవే. కాపాడినను నీవే, కష్టపెట్టినా నీవే. అని నమ్మి అన్నింటినీ సాక్షి గా చూసే స్థితి ఉన్న వారే ఆయన అనుగ్రహానికి పాత్రులౌతారు.


అలాంటి దక్షిణామూర్తి స్తోత్రం మన ఉన్నతి కోసం. ఆదిశంకరుల అనుగ్రహ విరచితం.


💥॥ శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రమ్ ॥💥


మూలేవటస్య మునిపుంగవసేవ్యమానం

ముద్రావిశేషముకులీకృతపాణిపద్మం

మందస్మితం మధురవేషముదారమాద్యం

తేజస్తదస్తు హృది మే తరుణేందుచూడం 


శాంతం శారదచంద్రకాంతిధవళం చంద్రాభిరమాననం

చంద్రార్కోపమకాంతికుండలధరం చంద్రావదాతాంశుకం

వీణాపుస్తకమక్షసూత్రవలయం వ్యాఖ్యానముద్రాంకరై

ర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదం


కర్పూరపాత్రమరవిందదళాయతాక్షం

కర్పూరశీతలహృదం కరుణావిలాసం

చంద్రార్ధశేఖరమనంతగుణాభిరామ

మింద్రాదిసేవ్యపదపంకజమీశమీడే


ద్యుద్రోధః స్వర్ణమయాసనస్థం

ముద్రోల్లసద్బాహుముదారకాయం

సద్రోహిణీనాథకళావతంసం

భద్రోదధిం కంచన చింతయామః


ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాంగరాగప్రభం

బాలం మౌంజిధరం ప్రసన్నవదనం న్యగ్రోధమూలేస్థితం

పింగాక్షం మృగశావకస్థితికరం సుబ్రహ్మసూత్రాకృతిం

భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికం


శ్రీకాంతద్రుహిణోపమన్యు తపన స్కందేంద్రనంద్యాదయః

ప్రాచీనాగురవోఽపియస్య కరుణాలేశాద్గతాగౌరవం

తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మందస్మితాలంకృతం

చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తం శివం కుర్మహే


కపర్దినం చంద్రకళావతంసం త్రిణేత్రమిందుపతిమాననోజ్వలం

చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివం


వామోరూపరిసంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం

శ్యామాముత్పలధారిణీ శశినిభాంచాలోకయంతం శివం

ఆశ్లిష్టేన కరేణ పుస్తకమధో కుంభం సుధాపూరితం

ముద్రాం జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలాం భజే


వటతరునికటనివాసం పటుతరవిజ్ఞానముద్రితకరాబ్జం

కంచనదేశికమాద్యం కైవల్యానందకందళం వందే


ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం సంపూర్ణం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు