వినాయక అష్టోత్తర శతనామ స్తోత్రం

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!!


'మెలితిరిగిన తొండంతో మహారూపంతో కోటి సూర్యులతో సమాన తేజస్సుతో వెలుగొందే దేవా! చేపట్టే ప్రతి కార్యం నిర్విఘ్నంగా కొనసాగేలా అనుగ్రహించు’ అంటూ యుగయుగాలుగా పూజలందుకుంటున్న వినాయకుడు ప్రమథ గణాలకు అధిపతి.


గణాలన్నిటిని ఏకతాటిపై నడిపించేవాడు గణనాథుడు. ప్రథమ పూజ్యుడు. సత్యప్రమాణాల దేవుడు. వినాయకుడు అంటే వేరే నాయకుడు లేనివాడనీ, తనకు తానే నాయకుడనీ అర్థం. విశేషమైన నాయకత్వ లక్షణాలు కలవాడు. అద్వితీయుడు. ఆనంద స్వరూపుడు.


వినాయకోత్పత్తి గురించి ఎన్ని పురాణ గాథలు ఉన్నా, పార్వతీదేవి మంగళస్నానం సందర్భంగా నలుగుపిండితో తయారు చేసిన బొమ్మకు ప్రాణం పోసి, వాకిలి వద్ద కావలి ఉంచడం, తన ప్రవేశాన్ని అడ్డగించడంతో ఆగ్రహించిన శివుడు బాలుడి తలను తుంచి, పార్వతీ విలాపంతో గజాసురుని తలను అతికించి పునర్జీవింపచేయడం లోకంలో ప్రసిద్ధమైన కథ.


వినాయకుడు ప్రకృతి ప్రేమికుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. విఘ్నాలు తొలగేందుకు ఆయనను అర్చించడంతో పాటు ఆయన లోకానికి అందించిన వ్యక్తిత్వ వికాస కోణంలోని సందేశాన్ని అవగాహన చేసుకోవలసి ఉంది.


గెలవాలని సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని, స్వీయ లోపాలను అధిగమించడం పెద్ద సమస్య కాబోదని వినాయకుడు లోకానికి చాటి చెప్పాడు. తన కుశాగ్రబుద్ధితో సర్వలోకాల మన్ననలు అందుకుంటున్నాడు.


సూక్ష్మబుద్ధి, వినయంతో విజయాలు సొంతం చేసుకున్నాడు. గణాధిపత్యాన్ని సాధించాడు. కుశాగ్రబుద్ధి కలవాడు కనుకే మహభారత రచనలో వ్యాస భగవానుడికి రాయసకారుడిగా ప్రతిభను ప్రదర్శించాడు. 


తాను చెబుతున్నప్పుడు తన వేగాన్ని అందిపుచ్చుకుంటూ, చెప్పేది అర్థం చేసుకున్న తర్వాతే రాయాలన్న వ్యాసుడి నిబంధనను అంగీకరించాడు. తన దంతాన్నే గంటంగా చేసుకొని పంచమవేదం రచనా బాధ్యతను దిగ్విజయంగా నిర్వర్తించాడు.


💥వినాయక అష్టోత్తర శతనామ స్తోత్రం💥


వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః ।

స్కందాగ్రజోఽవ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః ॥ 1 ॥


అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదాయకః ।

సర్వసిద్ధిప్రదః శర్వతనయః శర్వరీప్రియః ॥ 2 ॥


సర్వాత్మకః సృష్టికర్తా దేవానీకార్చితః శివః ।

సిద్ధిబుద్ధిప్రదః శాంతో బ్రహ్మచారీ గజాననః ॥ 3 ॥


ద్వైమాతురో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః ।

ఏకదంతశ్చతుర్బాహుశ్చతురః శక్తిసంయుతః ॥ 4 ॥


లంబోదరః శూర్పకర్ణో హరిర్బ్రహ్మవిదుత్తమః ।

కావ్యో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః ॥ 5 ॥


పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః ।

అకల్మషః స్వయం సిద్ధః సిద్ధార్చితపదాంబుజః ॥ 6 ॥


బీజాపూరఫలాసక్తో వరదః శాశ్వతః కృతీ ।

ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ ॥ 7 ॥


శ్రీదోఽజ ఉత్పలకరః శ్రీపతిస్తుతిహర్షితః ।

కులాద్రిభేత్తా జటిలశ్చంద్రచూడోఽమరేశ్వరః ॥ 8 ॥


నాగయజ్ఞోపవీతీ చ కలికల్మషనాశనః ।

స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః ॥ 9 ॥


స్థూలతుండోఽగ్రణీర్ధీరో వాగీశః సిద్ధిదాయకః ।

దూర్వాబిల్వప్రియః కాంతః పాపహారీ సమాహితః ॥ 10 ॥


ఆశ్రితశ్రీకరః సౌమ్యో భక్తవాంఛితదాయకః ।

శాంతోఽచ్యుతార్చ్యః కైవల్యో సచ్చిదానందవిగ్రహః ॥ 11 ॥


జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః ।

ప్రమత్తదైత్యభయదో వ్యక్తమూర్తిరమూర్తిమాన్ ॥ 12 ॥


శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసః ।

స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహః ॥ 13 ॥


సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః ।

రమార్చితో విధిశ్చైవ శ్రీకంఠో విబుధేశ్వరః ॥ 14 ॥


చింతామణిద్వీపపతిః పరమాత్మా గజాననః ।

హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః ॥ 15 ॥


అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుమ్ ।

యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్ ॥ 16 ॥


దూర్వాదళైః బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః ।

సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే ॥ 17 ॥


ఇతి భవిష్యోత్తరపురాణే వినాయకాష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు