Posts

🚩 ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 యోగినాం గురుమాచార్యం యోగగమ్యం సనాతనమ్ | సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణో థిపమ్ | | శాశ్వతం సర్వగం శాంతం బ్రహ్మాణం బ్రహ్మణ ప్రియమ్ | | కపర్దినం కళాముర్తి మమూర్తి మమరేశ్వరమ్ | | 💥పాపాన్ని ఒకే ఒక్క కోణంలో పోగొట్టగలిగే వస్తువు ఒక్కటి ఉంది. దానికోసం అన్ని చోట్లా వెతకక్కరలేదు. వేదాలకు జీవరత్నము, దేహానికి ప్రాణమూ, దేవాలయమునకు మహాలింగము వలె వెలుగుతున్న "శివ" అనే రెండు అక్షరాలు పాపాలన్నీ పటాపంచలు చేసే పరమౌషధం. మానవునిగా పుట్టి మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారికి శివ నామోచ్చారణమే శరణ్యము. ఆ పరమేశ్వరుడు మనకి నాలుక వాక్కు ఇచ్చినందుకు పంచాక్షరిని ఉపదేశం లేకపోతే శివ శివ అని జపం చేయడమే మన విధి. 💥శివమహాపురాణము - 12 వ అధ్యాయము - మయస్తుతి .. మయ ఉవాచ:- దేవ దేవ మహాదేవ భక్తవత్సల శంకర! కల్పవృక్ష స్వరూపోసి సర్వపక్ష వివర్జితః!! జ్యోతి రూపో నమస్తేస్తు విశ్వరూప నమోస్తుతే! నమః పూతాత్మనే తుభ్యం పావనాయ నమో నమః!! చిత్ర రూపాయ నిత్యాయ రూపాతీతాయ తే నమః! దివ్యరూపాయం దివ్యాయ సుదివ్యా కృతయే నమః!! నమః ప్రణత సర్వార్తి నాశకాయ శివాత్మనే! కర్త్రే భర్త్రే చ సంహర్ర్తే త్రిలోకా...

ఆదర్శమూర్తుల మేలుకలయికే రామాయణం

Image
 ⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 💥 ఆదర్శమూర్తుల మేలుకలయికే రామాయణం .. రామాయణము సకల వేదసారము, సర్వమానవులకూ ఆదర్శము. నాటికీ నేటికీ సర్వకాలాల్లోని మానవులకు అందరికీ రామాయణంలోని పాత్రలు ఆదర్శమై ఉంటున్నాయి. ఋగ్వేదము రామునిగా రూపుదాల్చగా, యజుర్వేదము లక్ష్మణునిగానూ, సామవేదము భరతునిగానూ, అథర్వణవేదము శత్రుఘ్నునిగానూ రూపుదాల్చాయి. అందుకే రామాయణం సకలవేద సారమైంది. నిజానికి రాముడు, అతని ముగ్గురు సోదరులూ దశరథ మహారాజు యొక్క పుత్రులు కారు, వారు అగ్ని నుంచీ ఉద్భవించిన వారు, కనుక వారి ప్రవర్తన సంపూర్ణంగా ధర్మబధ్ధమై ఉండినది.  💥రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నదమ్ములందరికీ ఆదర్శమైనారు. పసితనంలో  ఒకనాడు నలుగురూ కలిసి ఆడుకుంటున్నపుడు  ఉన్నట్లుండి భరతుడు పరుగెత్తు కుంటూ వచ్చి కౌసల్య వళ్ళో కూర్చుని ఏడ్చాడు. "కుమారా! ఎందుకేడుస్తున్నావు? ఆటలో ఓడిపోయావా?" అని ఆమె అడగ్గా, భరతుడు "అమ్మా! మీరన్నట్లు నేను ఓడితే ఆనందించేడిని. కాని నేను ఓడే సమయంలో రాముడు కావాలని ఓడి నన్ను గెలిపించాడు. అన్న ఓటమికి నాకు చాలా బాధగా ఉంది" అన్నాడు. ఇలా పసితనం నుండే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పరస్పరం ఎంతో ప్రేమగా, ఐక...

ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🙏 💥కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు" అని నిలదీస్తాడు… అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు… "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ.  యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతకుడివి (వేటగాడు).. ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాట...

⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
  ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై! నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై!! 🌹తాత్పర్యము: బంగారు పద్మమునే తన పీఠముగా అధివసించి యున్న శ్రీమన్మహాలక్ష్మీ భగవతికి నమస్కారము. సమస్త భూమండలమునకున్ను నాయికయై యున్న శ్రీ భార్గవీ మాతకు వందనము. దేవ, దానవ, మనుష్యాదులందఱి పట్లను దయఁ జూపఁజాలిన ఆ మహాశక్తి సంపన్నురాలికి ప్రణామము. శార్ఞ్గమను ధనుస్సును ధరించిన భగవాన్ విష్ణుమూర్తికి ప్రియురాలును యైన  శ్రీ కమలాదేవికి వందనములు. 💥శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలకు అధిదేవత. జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక. సృష్టికి కారణభూతమైన ఆద్యపరాశక్తిని మన ప్రాచీన మహాద్రష్టలు సుమనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలచారు. ప్రతి రూపం ఒక దివ్య సంకేతం. ప్రతి సంకేతం వెనక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది. మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధురమోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణవికసిత పద్మంపై ఆశీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంక...

💥దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం:

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీదత్తాయ నమః🌹🙏 సర్వ కష్టాలను కడతేర్చే శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం... దీనిని నిత్యం పారాయణం చేయట ద్వారా సర్వాభీష్ట సిద్ది కలుగును. 💥దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం: అస్య శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్ర మహా మంత్రస్య, పరమహంస ఋషిః, దత్త పురుష పరమాత్మా దేవతా, సకల కామనా సిద్ధ్యర్తే పారాయణే జపే వినియోగ: హరిః ఓం... ప్రథమస్తు మహాయోగీ ద్వితీయ ప్రభురీశ్వరః తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్ధ జ్ఞాన సాగరః పంచమో జ్ఞాన విజ్ఞానం షష్ఠస్యాత్ సర్వమంగళమ్ సప్తమః పుండరీకాక్షో అష్టమో దేవ వల్లభః నవమో నందదేవేశ దశమా నందదాయకః ఏకాదశ మహారుద్రో ద్వాదశః కరుణాకరః!! ఏతాని ద్వాదశ నామాని దత్తాత్రేయ మహాత్మనః! మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయో హరఃపరః!! క్షయాపస్మార కుష్ణాది తాపజ్వర నివారణం! రాజద్వారే పతే ఘోరే సంగ్రామేషు జలాంతరే!! గిరేర్గుహాంతరేరణ్యే వ్యాఘ్రచోర భయాదిషు! ఆవర్తన సహస్త్రేషు లభతే వాంఛితం ఫలం!! త్రికాలే యః పఠే నిత్యం మోక్ష సిద్ధిమవాప్నుయాత్! దత్తాత్రేయః సదారక్షిత్ యశః సత్యం న సంశయః!! విద్యార్థీ లభతే విద్యాం రోగీ రోగాత్ ప్రముచ్యతే! అపుత్రో లభతే పుత్రం దరిద్రీ లభతే ధనమ్!! అభార్యో లభతే భార్యా...

💥హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 💥హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం: హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః [1] ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా [2] ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ [3] 💥మూర్తిభవించిన దాసభక్తి స్వరూపుడు.. కార్యదీక్షాపరుడే కాక మానవజాతికి మార్గదర్శకుడు, అభయప్రదాత ఆంజనేయస్వామి. సీతారాములను కలుపువారు శ్రీమద్రామాయణంలో పేర్కొన్నట్లు ఇద్దరు. ఒకరు విశ్వామిత్రుడు, రెండవవాడు ఆంజనేయస్వామి. లోక కళ్యాణార్థం సీతారాముల కళ్యాణాన్ని జరిపించినవాడు విశ్వామిత్రుడైతే, విడిపోయిన జంటను మరల కలిపి జగత్కల్యాణం గావించినవాడు ఆంజనేయుడు. హనుమంతుని బుద్ధిబలం, పాండిత్యం, మాటనేర్పు శ్రీరామచంద్రుణ్ణి ఆకర్షింపజేశాయి. ఇటువంటి దూత గల ప్రభువుదే కార్యసిద్ధి. ఇటువంటి వాడు సచివుడుగా ఉండే సాధించలేనిది ఏదీ ఉండదు అని శ్రీరాముడు స్వయంగా లక్ష్మణునితో అన్నాడు. అదీ ఆంజనేయుని వ్యక్తిత్వం. ఆంజనేయస్వామి భక్తి అనుపమానం, ఆదర్శం, స్వార్థరహితం, స్వచ్ఛం.  ఇక సీతాన్వేషణ...

💥మనం తెలుసుకోవాల్సిన జీవిత యధార్థం…!!

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే | శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే || 💥 మనం తెలుసుకోవాల్సిన జీవిత యధార్థం…!! ధనము ఉన్నదని.. అనుచరణ గణం ఉన్నదని.. యౌవనం ఉన్నదని గర్వించే మానవ జన్మకు ఉపనిషత్తులు తెలిపిన చిన్న సూచన... ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి, ఈ క్షణిక మైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు… ధన జన యౌవన గర్వం...!!! కొందరికి ధన గర్వం...!!! కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు... వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి, ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు… అంతా డబ్బే, డబ్బున్నవారు మాత్రమే మిత్రులు, డబ్బులేని వారు శతృవులు, అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు... ఎవరిని ఏ మోసం చేసి, ఏమి మాయమాటలు చెప్పి ఎలా డబ్భు, ధనం లాగాలనే నిత్య స్మరణ లో వుంటారు... కొందరికి జన గర్వం...!!! తన వెనుక ఎందరో ఉన్నారు అనుకుంటారు, తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని త...