🌹💥అష్టాదశ పురాణాల వివరాలు💥🌹
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన #అష్టాదశపురాణాలు రచించాడు. 💥అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం... మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగకూస్కాని పురాణాని ప్రచక్షత - ఇది అష్టాదశ పురాణములు గుర్తుంచుకునే శ్లోకం. 💥శ్లోక వివరణ: మద్వయం: మ కారంతో 2. అవి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం: భ కారంతో 2. అవి భాగవత పురాణం, భవిష్యత్ పురాణం. బ్రత్రయం: బ్ర కారంతో 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. వచతుష్టయం: వకారంతో 4. అవి వాయుపురాణం, వరహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం. అ - అగ్ని పురాణం, నా - నారద పురాణం, ప - పద్మ పురాణం, లిం - లింగ పురాణం, గ - గరుడ పురాణం, కూ - కూర్మ పురాణం మరియు స్క - స్కంద పురాణం 🌹💥అష్టాదశ పురాణాల వివరాలు💥🌹 💥మత్స్య పురాణం: దీనిలో 14000 శ్లోకములున్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యమ...