💥ద్వాదశఆదిత్య ధ్యాన శ్లోకాః💥
⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణస్వామినే నమః🌹🙏
💥12 నెలలలో, 12 పేర్లతో, 12 రూపాలతో సంచరిస్తూ ఉండటం వల్ల సూర్యభగవానునికి "#ద్వాదశాత్ముడు" అనే పేరు వచ్చింది.
ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఆయా ఆదిత్యుని నామంతో పూజలందుకుంటాడు.
🍁హిందూ పురాణాలలో అదితి, కశ్యపుని 12 మంది పుత్రులను #ద్వాదశాదిత్యులు అంటారు.
💥మహాభారతం, ఆదిపర్వంలోని శ్లోకాలలో (65-15,16) చెప్పిన ద్వాదశ ఆదిత్యుల పేర్లు:
ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచ
భగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథా
ఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతే
జఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః
💥(ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు)
💥ఏ నెలలో సూర్యుడిని ఎలా పిలుస్తారు...
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో - అర్యముడు
3. జ్యేష్టం - మిత్రుడు
4. ఆషాఢం - వరుణుడు
5. శ్రావణంలో - ఇంద్రుడు
6. భాద్రపదం - వివస్వంతుడు
7. ఆశ్వయుజం - త్వష్ణ
8. కార్తీకం - విష్ణువు
9. మార్గశిరం - అంశుమంతుడు
10. పుష్యం - భగుడు
11. మాఘం - పూషుడు
12. ఫాల్గుణం - పర్జజన్యుడు
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
💥ద్వాదశఆదిత్య ధ్యాన శ్లోకాః💥
1. ధాతా –
ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే ।
పులస్త్యస్తుంబురురితి మధుమాసం నయంత్యమీ ॥
ధాతా శుభస్య మే దాతా భూయో భూయోఽపి భూయసః ।
రశ్మిజాలసమాశ్లిష్టః తమస్తోమవినాశనః ॥
2. అర్యమ –
అర్యమా పులహోఽథౌజాః ప్రహేతి పుంజికస్థలీ ।
నారదః కచ్ఛనీరశ్చ నయంత్యేతే స్మ మాధవమ్ ॥
మేరుశృంగాంతరచరః కమలాకరబాంధవః ।
అర్యమా తు సదా భూత్యై భూయస్యై ప్రణతస్య మే ॥
3. మిత్రః –
మిత్రోఽత్రిః పౌరుషేయోఽథ తక్షకో మేనకా హహః ।
రథస్వన ఇతి హ్యేతే శుక్రమాసం నయంత్యమీ ॥
నిశానివారణపటుః ఉదయాద్రికృతాశ్రయః ।
మిత్రోఽస్తు మమ మోదాయ తమస్తోమవినాశనః ॥
4. వరుణః –
వసిష్ఠో హ్యరుణో రంభా సహజన్యస్తథా హుహుః ।
శుక్రశ్చిత్రస్వనశ్చైవ శుచిమాసం నయంత్యమీ ॥
సూర్యస్యందనమారూఢ అర్చిర్మాలీ ప్రతాపవాన్ ।
కాలభూతః కామరూపో హ్యరుణః సేవ్యతే మయా ॥
5. ఇంద్రః –
ఇంద్రో విశ్వావసుః శ్రోతా ఏలాపత్రస్తథాఽంగిరాః ।
ప్రమ్లోచా రాక్షసోవర్యో నభోమాసం నయంత్యమీ ॥
సహస్రరశ్మిసంవీతం ఇంద్రం వరదమాశ్రయే ।
శిరసా ప్రణమామ్యద్య శ్రేయో వృద్ధిప్రదాయకమ్ ॥
6. వివస్వాన్ –
వివస్వానుగ్రసేనశ్చ వ్యాఘ్ర ఆసారణో భృగుః ।
అనుమ్లోచాః శంఖపాలో నభస్యాఖ్యం నయంత్యమీ ॥
జగన్నిర్మాణకర్తారం సర్వదిగ్వ్యాప్తతేజసమ్ ।
నభోగ్రహమహాదీపం వివస్వంతం నమామ్యహమ్ ॥
7. త్వష్టా –
త్వష్టా ఋచీకతనయః కంబళాఖ్యస్తిలోత్తమా ।
బ్రహ్మాపేతోఽథ శతజిత్ ధృతరాష్ట్ర ఇషంభరా ॥
త్వష్టా శుభాయ మే భూయాత్ శిష్టావళినిషేవితః ।
నానాశిల్పకరో నానాధాతురూపః ప్రభాకరః ।
8. విష్ణుః –
విష్ణురశ్వతరో రంభా సూర్యవర్చాశ్చ సత్యజిత్ ।
విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయంత్యమీ ॥
భానుమండలమధ్యస్థం వేదత్రయనిషేవితమ్ ।
గాయత్రీప్రతిపాద్యం తం విష్ణుం భక్త్యా నమామ్యహమ్ ॥
9. అంశుమన్ –
అథాంశుః కశ్యపస్తార్‍క్ష్య ఋతసేనస్తథోర్వశీ ।
విద్యుచ్ఛత్రుర్మహాశంఖః సహోమాసం నయంత్యమీ ॥
సదా విద్రావణరతో జగన్మంగళదీపకః ।
మునీంద్రనివహస్తుత్యో భూతిదోఽంశుర్భవేన్మమ ॥
10. భగః –
భగః స్ఫూర్జోఽరిష్టనేమిః ఊర్ణ ఆయుశ్చ పంచమః ।
కర్కోటకః పూర్వచిత్తిః పౌషమాసం నయంత్యమీ ॥
తిథి మాస ఋతూనాం చ వత్సరాఽయనయోరపి ।
ఘటికానాం చ యః కర్తా భగో భాగ్యప్రదోఽస్తు మే ॥
11. పూష –
పూషా ధనంజయో వాతః సుషేణః సురుచిస్తథా ।
ఘృతాచీ గౌతమశ్చేతి తపోమాసం నయంత్యమీ ।
పూషా తోషాయ మే భూయాత్ సర్వపాపాఽపనోదనాత్ ।
సహస్రకరసంవీతః సమస్తాశాంతరాంతరః ॥
12. పర్జన్యః –
క్రతుర్వార్చా భరద్వాజః పర్జన్యః సేనజిత్ తథా ।
విశ్వశ్చైరావతశ్చైవ తపస్యాఖ్యం నయంత్యమీ ॥
ప్రపంచం ప్రతపన్ భూయో వృష్టిభిర్మాదయన్ పునః ।
జగదానందజనకః పర్జన్యః పూజ్యతే మయా ॥
ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణస్సరసిజాసన సన్నివిష్టః।
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ॥
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️

Comments
Post a Comment