గజలక్ష్మి (ఏనుగులతో ఉన్న లక్ష్మి) లక్ష్మీదేవి కి గల అష్ఠలక్ష్మి అంశాలలో ఒక రూపం.
⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
💥🌷 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌷💥
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ 🌷🙏
💥🐘గజలక్ష్మి🐘💥
గజలక్ష్మి (ఏనుగులతో ఉన్న లక్ష్మి) లక్ష్మీదేవి కి గల అష్ఠలక్ష్మి అంశాలలో ఒక రూపం.
💥గజలక్ష్మి సర్వసంపత్కరి.
పరమపవిత్రకు చిహ్నం.
ఈ విషయం చెప్పడానికే ఏనుగులు తొండంతో నీరు చిమ్ముతూ అమ్మవారికి అభిషేకం చేయిస్తున్నట్టుగా కూడా కనబడుతుంది.
💥తామర పువ్వుకే పద్మం అని మరో పేరు కూడా ఉంది.
పద్మంలో ఉండే తల్లి కాబట్టి ఆమెను పద్మ, పద్మిని అని కూడా పిలుస్తారు.
ఈ పద్మం నవనిధులలో ఒకటి.
పద్మం అనే నిధిలో కూచునే తల్లి కనుక ఆమెను సంపదదాయిని, భాగ్యదాయినిగా ఆరాధిస్తారు.
💥గజలక్ష్మి తామర పువ్వులో పద్మాసనం మీద కూచుంటుంది.
ఇరుపక్కలా రెండు ఏనుగులు ఉంటాయి.
యోగముద్రలో కూర్చుని ఉంటుంది.
నాలుగు చేతులు ఉంటాయి.
పై చేతులలో తామర పువ్వులు ఉంటాయి.
కింది చేతులు అభయ, వరద ముద్రలు చూపిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది
💥సామాజికంగా ఆలోచించినపుడు సంపద చంచలమైంది.
ఎవరి వద్దకు డబ్బులు సంపద ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో, ఎంతకాలం ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. పరమ చపలమైంది.
ఇవాళ కోటీశ్వరుడుగా ఉన్నవాడు తెల్లారేలోపు భిక్షాధికారి అయి దేహీ అని రోడ్డున పడుతున్నాడు.
💥ఈ చంచలత్వానికి, చాపల్యానికి తామర ఒక సంకేతం.
సరసులో పద్మం నిలకడగా ఉండదు.
అటూ ఇటూ కదులుతూ ఊగుతూ ఉంటుంది.
దాని మీద కూచున్న లక్ష్మి పద్మాన్ని కదిలిపోకుండా నిరోధిస్తుంది.
అలా కూచునే లక్ష్మి యోగముద్రలో ఉంటుంది.
💥నిలకడలేని సంపదకు కుదురు తెచ్చేది #యోగం మాత్రమే అన్న సందేశం ఇందులో ఉంది.
💥యోగ బుద్ధితో సంపదలను అనుభవించే వారికి
ఆ సంపద మీద వ్యామోహం ఉండదు.
కనుక సంపదను ఎవరైనా స్వార్ధ బుద్ధితో కాక త్యాగబుద్ధితోనే అనుభవించాలని గజలక్ష్మి ఉపదేశిస్తోంది.
💥ఇలా సిరిసంపదలను నిర్మోహత్వంతో అనుభవించేవారే సర్వసమర్థులనీ, శక్తిశాలురనీ, వారిని లోకమంతా ఆరాధిస్తుందని చెబుతుంది.
💥ఈ మాట చెప్పడానికే ఏనుగులు లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నట్టుగా, అభిషేకిస్తున్నట్టుగా చిత్రాలలో చూపిస్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment