💥వైభవలక్ష్మీదేవి🌷🙏

 ⚜️🕉️🚩ఓం శ్రీ వైభవలక్ష్మీ దేవ్యై నమః🌹🙏


💥ధ్యానం:

 (శ్రీ వైభవ లక్ష్మీ మూల మంత్ర)


యా రక్తాంబుజవాసినీ విలాసినీ చన్డాంశు తేజస్వినీ

యారక్తా రుధిరాంబరః హరిసఖీ యా శ్రీ మనోహ్లాదినీ

యా రత్నాకరమంథనాథ్ ప్రఘటితా విష్ణోశ్చ యా గేహినీ

సా మాం పాతు మనోరమా భగవతీ లక్ష్మీః చ పద్మావతి

🔸🔹🔸🔹🔸🔹🔸


💥వైభవలక్ష్మీదేవి🌷🙏


💥పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీ దేవి పరమేశ్వరుడిని చూసి ప్రాణ నాధా!

భూలోకంలో  మానవులందరూ  ధనార్జనకోసం ఎడతెరిపిలేని శ్రమను అనుభవిస్తూ ఉన్నారు.

అయినా వారిలో అతికొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే బాసించటానికి గల కారణమేమిటని అడుగగా... సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి...


"దేవీ, సర్వమూ "వైభవలక్ష్మీ" దేవి దయను బట్టే ఉంటుంది. సమస్త సిరి సంపదలకు, ధన ధాన్యాలకు ఆవిడే అధిదేవతా కాబట్టి ఎవరైతే ఈసత్యాన్ని గుర్తించి ఆ ఐశ్వర్య లక్ష్మీ యందు అంతులేని భక్తి కలిగి సదా ఆమెను ఆరాధించుకుంటారో, ఆ వైభవలక్ష్మీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లియొక్క అపార కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి.

అలా ఆమె దయకు పాత్రులైనవాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు.

ఎవరైతే ఆమెను తృణీకరంచి ఆమె అనుగ్రహాన్ని  విస్మరించి, అంతా తమ స్వయం కృషియేనని విర్రవీగుతారో, ఎవరైతే   శ్రీ వైభవ లక్ష్మీ స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో, వాళ్ళేనాటికీ ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా మురికిగంటలో పోసిన పన్నీరు వలే వృధా అయిపోతుంది.

కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటారో వాళ్లు అవశ్యం ఆ వైభవ లక్ష్మీని ఆరాధించాలి.

ఆమె వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాతృలై అఖండ సిరిసంపదలతో రాజ వైభవాలతో తుల తూగుతారు" అని చెప్పాడు.


💥#శ్రీవైభవలక్ష్మీ_ప్రాదుద్భావం:


పూర్వమొకప్పుడు భృగుమహర్షి ఆ పరాశక్తి కోసం తపించాడు.

అందుకు మెచ్చి.. ఆ మునికి ఏం కావాలో కోరుకొమ్మంది.

భృగు ఆమెకు నమస్కారములను సమర్పించి, తల్లీ, ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్యావసరాలపై నడుస్తోంది.

- శక్తి, యుక్తి, భుక్తి.


మహామాయవైన నీ శక్తి కళ పార్వతియై శివ అర్ధాంగిగా సేవింపబడుతోంది.


నీ విద్యా కళ చదువుల తల్లి యైన సరస్వతియై  యుక్తి యుక్తంగా శ్రష్ఠయైన బ్రహ్మతో మసలుతూ ఉంది.


ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళను నా కుమార్తెగా అనుగ్రహించు అని కోరాడు.


తథాస్తు, అంది ఆ తల్లి.

తత్ఫలంగానే పరాశక్తి యొక్క సంపత్కళ భృగువుకు వైభవలక్ష్మి గా అవతరించింది.


💥#వైభవలక్ష్మీ_వర్ణన:


ప్రకృతి మాత, జగన్మాత, ఆదిలక్ష్మీ, మహామాత, బ్రహ్మాది, దేవతలచే పూజింప బడుచున్నది.

వికసిత పద్మాసనయై, తనపై రెండు హస్తములలో మనోహరమైన ఎర్రని తామరపుష్పాలను ధరించినది. 


అధోభాగమున గల రెండు హస్తములలో ఒక హస్తమున ధనము, మరో హస్తమున అభయముద్రా కలిగియున్నది. అట్టి వైభవ లక్ష్మికి నమస్కరిస్తున్నాను.


సర్వలోకరక్షణీ, సర్వజ్ఞానప్రదాయినీ, సకల సంపద్ప్రదాయినీ, సద్భుద్ధి ప్రదాయినీ, మంత్ర సిద్ధి ప్రదాయినీ, యోగశక్తి ప్రదాయినీ, దయామయీ, విష్ణు వక్షఃస్థల స్థాయినీ, ఆయిన శ్రీ వైభవలక్ష్మీ కి నమస్కరిస్తున్నాను.


శ్రద్ధాభక్తులకు ప్రతీకగా రెండు గజేంద్రాలచే అభిషిక్త  యగుచున్న వైభవలక్ష్మీ కి నమస్కరిస్తున్నాను.


శ్రీ హరి హృదయ నివాసినీ, క్షీర సముద్రరాజ తనయా, శ్రీరంగధామేశ్వరీ, సహస్రకోటిద్యుల్లతా సమతేజస్వినీ, శ్వేతవస్త్రధారిణీ, శ్వేతపుష్పాలంకృత సద్గుణా అయిన భాగ్యలక్ష్మీకి శతకోటి వందనాలు అర్పిస్తున్నాను.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥