⚜️🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏

 ⚜️🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏


విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |

దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 


నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |

త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ ||


మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి చతుర్భుజాలతో పూర్ణవికసిత పద్మంపై ఆశీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది.

సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతం అది.


పద్మం బురద నుంచి పుడుతుంది.

మనలో ఏ వాతావరణ పరిస్థితులల్లోనైనా వికసించే

అపరిమితశక్తికి ఈ పంకం సంకేతం.


మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది.

ఈ నీరు జీవానికి సంకేతం.


ఈ నీరు నిత్యప్రవాహశీలమై ఉంటుంది.

అలా ప్రవహించకపోతే అది నిల్వఉండి పాడైపోతుంది.

ధనం కూడా ప్రవహిస్తూ చలామణీ అవుతుండాలి.

ఈ ధన ప్రవాహాన్ని ఆపి, ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు.


ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు. అవి "ధర్మార్థకామమోక్షాలు"

జనన మరణాల చక్రంనుంచి మనిషిని విముక్తం చేసి ఆమె మహా సత్యంవైపు నడుపుతుంది.

ఆ పురుషార్థాలు మన జీవనస్తంభాలు.

వేదోపనిషత్తులకు పునాదులు.


మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది.

అది అభివ్యక్త శక్తికి, వికాసానికి, సారభూతమైన భూదేవి పచ్చదనానికి సంకేతం. అప్పుడప్పుడు ఆమె ధరించే ఎర్రని చీర రంగు - కార్యశీలతకు, అంతశ్శక్తికి ప్రతీక.


లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు శ్వేతగజాలు నిలబడి నీటిని చిమ్ముతూఉంటాయి.

తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో, నిర్మల మనస్సుతో, ఐహిక, ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి అది సంకేతం. 


మహాలక్ష్మి చెంతనే ఒక తెల్ల "గుడ్లగూబ" కనిపిస్తుంది. దీని వెనక రెండు సంకేతార్థాలు ఉన్నాయి.

ఒక ప్రతీకకు అర్థం వివేకం, అదృష్టం.

మరొక సంకేతార్థం తెలివిహీనత.

సంపద తెలివిహీనుల గర్వం, అహంకారం కారణంగా మాయమవుతుంది. అందువల్లనే లక్ష్మిని "చంచల" అన్నారు. 


కలశం అమ్మవారికి ప్రతిరూపం.

కలశ పాత్రగా మట్టి పాత్రనుగాని, వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను గాని వినియోగిస్తారు.

లోహమైనా మట్టి అయినా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం.


అందులో పోసే నీరు జలతత్త్వానికి సంకేతం.

అందులో కలశాన్ని పూర్తిగా నీరుతో నింపం కనుక 


శూన్యస్థితి ఆకాశతత్త్వానికి  సంకేతం.


మనం చదివే మంత్రం వాయుజనితం.

కనుక అది వాయుతత్త్వానికి సంకేతం.


దాని ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం.


ఇలా "పంచభూతాలను" ఒక చోటికి చేర్చి "పంచభూతమయి" అయిన అమ్మవారిని పూజిస్తాం.


"శ్రీసూక్తం" లక్ష్మీదేవి స్వరూపాన్ని ఈవిధంగా ఆవిష్కరిస్తున్నది.

ఆమె.. బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), 


బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం),


వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం),


గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), 


చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం),


కీర్తిచే శోభిల్లునది (యశసాజ్వలన్తీం),


సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే

నశ్యతాం),


పద్మమాలను ధరించినది (పద్మమాలినీం),


పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం),


అందరికి ప్రీతిపూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాతా)

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం