"శనైశ్చర" కృత "శ్రీ నరసింహ స్తుతి"

 ⚜️🕉️🚩ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏


💥"శనైశ్చర" కృత  "శ్రీ నరసింహ స్తుతి" అనేది "శనైశ్చరుడు" చేసిన ప్రార్థన.


శ్రీనరసింహ స్వామి మరియు శనైశ్చరుడు మధ్య జరిగిన సంభాషణగా "శ్రీకృష్ణుడు" ద్వారా తెలియజేయబడింది.


శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు, "ఈ భక్తి ప్రార్ధన రూపంలో శనిదేవుడు మరియు నృసింహ భగవానుడు మధ్య జరిగే ఈ సంభాషణను ఎవరు వింటారో లేదా పఠిస్తారో వారికి ఖచ్చితంగా అన్ని కోరికలు నెరవేరుతాయి మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.


💥ఏలినాటి శని (7/ 12 సంవత్సరాలు), అష్టమశని,

అర్ధాష్టమశని, శనిమహాదశ లేదా శనిఅంతర్ధశ

జరుగుతున్నప్పుడు "శనైశ్చర కృత శ్రీనరసింహ స్తుతి"

చెయ్యడం చాల శక్తివంతమైన పరిహారక్రియ గా

విశ్వసిస్తారు.


💥॥ శ్రీనరసింహ స్తుతి (శనైశ్చర కృతం) ॥💥


శ్రీ కృష్ణ ఉవాచ |

సులభో భక్తియుక్తానాం దుర్దర్శో దుష్టచేతసామ్ |

అనన్యగతికానాం చ ప్రభుర్భక్తైకవత్సలః || ౧ ||


శనైశ్చరస్తత్ర నృసింహదేవ

స్తుతిం చకారామల చిత్తవృతిః |

ప్రణమ్య సాష్టాంగమశేషలోక

కిరీట నీరాజిత పాదపద్మమ్ || ౨ ||


శ్రీ శనిరువాచ |

యత్పాదపంకజరజః పరమాదరేణ

సంసేవితం సకలకల్మషరాశినాశమ్ |

కల్యాణకారకమశేషనిజానుగానాం

స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || ౩ ||


సర్వత్ర చంచలతయా స్థితయా హి లక్ష్మ్యా

బ్రహ్మాది వంద్యపదయా స్థిరయాన్యసేవి |

పాదారవిందయుగళం పరమాదరేణ

స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || ౪ ||


యద్రూపమాగమశిరః ప్రతిపాద్యమాద్యం

ఆధ్యాత్మికాది పరితాపహరం విచిన్త్యమ్ |

యోగీశ్వరైరపగతాఽఖిల దోషసంఘైః

స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || ౫ ||


ప్రహ్లాద భక్త వచసా హరిరావిరాస

స్తంభే హిరణ్యకశిపుం య ఉదారభావః |

ఊర్వో నిధాయ ఉదరం నఖరైర్దదార

స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || ౬ ||


యో నైజభక్తమనలాంబుధి భూధరోగ్ర-

శృంగప్రపాత విషదన్తి సరీసృపేభ్యః |

సర్వాత్మకః పరమకారుణికో రరక్ష

స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || ౭ ||


యన్నిర్వికార పరరూప విచిన్తనేన

యోగీశ్వరా విషయవీత సమస్తరాగాః |

విశ్రాంతిమాపుర వినాశవతీం పరాఖ్యాం

స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || ౮ ||


యద్రూపముగ్ర పరిమర్దన భావశాలి

సంచిన్తనేన సకలాఘ వినాశకారి |

భూత జ్వర గ్రహ సముద్భవ భీతినాశం

స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || ౯ ||


యస్యోత్తమం యశ ఉమాపతి పద్మజన్మ

శక్రాది దైవత సభాసు సమస్తగీతం |

శక్త్యైవ సర్వశమల ప్రశమైక దక్షం

స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || ౧౦ ||


ఇత్థం శ్రుత్వా స్తుతిం దేవః శనినా కల్పితాం హరిః |

ఉవాచ బ్రహ్మ వృందస్థం శనిం తం భక్తవత్సలః || ౧౧ ||


శ్రీ నృసింహ ఉవాచ |

ప్రసన్నోఽహం శనే తుభ్యం వరం వరయ శోభనమ్ |

యం వాంఛసి తమేవ త్వం సర్వలోక హితావహమ్ || ౧౨ ||


శ్రీ శనిరువాచ |

నృసింహ త్వం మయి కృపాం కురు దేవ దయానిధే |

మద్వాసరస్తవ ప్రీతికరః స్యాద్దేవతాపతే || ౧౩ ||


మత్కృతం త్వత్పరం స్తోత్రం శృణ్వన్తి చ పఠన్తి చ |

సర్వాన్ కామన్ పూరయేథాః తేషాం త్వం లోకభావన || ౧౪ ||


శ్రీ నృసింహ ఉవాచ |

తథైవాస్తు శనేఽహం వై రక్షో భువనసంస్థితః |

భక్త కామాన్ పూరయిష్యే త్వం మమైకం వచః శృణు || ౧౫ ||


త్వత్కృతం మత్పరం స్తోత్రం యః పఠేచ్ఛృణుయాచ్చ యః |

ద్వాదశాష్టమ జన్మస్థాత్ త్వద్భయం మాస్తు తస్య వై || ౧౬ ||


శనిర్నరహరిం దేవం తథేతి ప్రత్యువాచ హ |

తతః పరమసంతుష్టో జయేతి మునయోవదన్ || ౧౭ ||


శ్రీ కృష్ణ ఉవాచ |

ఇదం శనైశ్చరస్యాథ నృసింహ దేవ

సంవాదమేతత్ స్తవనం చ మానవః |

శృణోతి యః శ్రావయతే చ భక్త్యా

సర్వాణ్యభీష్టాని చ విన్దతే ధ్రువమ్ || ౧౮ ||


ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ శనైశ్చర కృత శ్రీ నృసింహ స్తుతిః |

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥