పాండురంగాష్టకం - తాత్పర్యము

 ⚜️🕉️🚩 ఓం నమో పాండురంగాయ🌹🙏


జై జై విఠల పాండురంగ జై హరి విఠల పాండురంగ

ఆపద్బాంధవ పాండురంగ అనాధరక్షక పాండురంగ


💥ఆ పండరీ పుర వాసుని స్తుతిస్తూ జగద్గురువులు రచించిన పాండురంగాష్టకము.. తాత్పర్యము మీకోసం.


💥పాండురంగాష్టకం - తాత్పర్యము


మహాయోగపీఠే తటే భీమరథ్యా

వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః |

సమాగత్య తిష్ఠంతమానందకందం

పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 1 ||


🌹తాత్పర్యము:

మహాయోగ పీఠం అయిన పండరీపురంలో, భీమ రథీ తీరంలో, మునీన్ద్రులతో కూడి పుండరీకునికి వరములిచ్చిన, అనంతమైన ఆనందమునకు మూలమైన, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 


తటిద్వాససం నీలమేఘావభాసం

రమామందిరం సుందరం చిత్ప్రకాశం |

వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం

పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 2 ||


🌹తాత్పర్యము:

తన పాదపద్మములను ఇటుకలో స్థిరముగా ఉంచిన వాడు (విఠలుడు), మెరుపు తీగవలె అలంకరించబడిన వాడు, నీల మేఘ శ్యాముడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, సుందరమైన వాడు, ప్రకాశించే అంతరంగము కలవాడు,  పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 


ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం

నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ |

విధాతుర్వసత్యై ధృతో నాభికోశః

పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 3 ||


🌹తాత్పర్యము:

చేతులను వంచి నడుముపై ఉంచుకొని ఈ మిథ్యా ప్రపంచమంతా నడుములోతు వరకే అని సందేశాన్ని ఇచ్చే, తన నాభి నుండి కమలమును సృష్టించి అందులో బ్రహ్మకు నివాసము ఏర్పరచిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 


స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే

శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసం |

శివం శాంతమీడ్యం వరం లోకపాలం

పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 4 ||


🌹తాత్పర్యము:

కౌస్తుభ మణిని మెడలో ధరించిన వాడు, అందమైన భుజకీర్తులు కలవాడు, అందంగా అలంకరించబడిన కురులు కలవాడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, శాంతమైన వాడు, శుభకరుడు, జగత్తును కాపాడే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 


శరచ్చంద్రబింబాననం చారుహాసం

లసత్కుండలాక్రాంతగండస్థలాంతం |

జపారాగబింబాధరం కంజనేత్రం

పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 5 ||


🌹తాత్పర్యము:

శరత్కాలములోని చంద్రుని వంటి ముఖము కలవాడు, సమ్మోహనము కలిగించే చిరునవ్వు కలవాడు, మెరిసే కర్ణ కుండలములు  చెంపలపై వరకు కలవాడు, ఎర్రని మందారము రంగులో, దొండపండు వంటి పెదవి కలవాడు, కలువ పూల వంటి కళ్ళు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 


కిరీటోజ్వలత్సర్వదిక్ప్రాంతభాగం

సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః |

త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం

పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 6 ||


🌹తాత్పర్యము:

నలుదిక్కుల ప్రసరించే ప్రకాశము గల కిరీటమును ధరించిన వాడు, దేవతలచే అమూల్యమైన రత్నములతో పూజించబడే వాడు, మూడు వంపుల ఆహర్యములో నిలబడిన వాడు, వన మాలలు, శిఖి పించము ధరించిన వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 


విభుం వేణునాదం చరంతం దురంతం

స్వయం లీలయా గోపవేషం దధానం |

గవాం బృందకానందదం చారుహాసం

పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 7 ||


🌹తాత్పర్యము:

సర్వ వ్యాప్తమైన వాడు, వేణువును వాయించే వాడు, దుష్టుల పాలిటి చరమ గీతమైన వాడు, ఆటగా గోపాలుని వేషములో ఉండేవాడు, గోవులకు ఆనందము కలిగించే వాడు, వికసించిన కలువ వంటి చిరు నవ్వు కలవాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 


అజం రుక్మిణీప్రాణసంజీవనం తం

పరంధామ కైవల్యమేకం తురీయం |

ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం

పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 8 ||


🌹తాత్పర్యము:

జననము లేని వాడు, రుక్మిణీ వల్లభుడు, అనంతమైన ప్రకాశకుడు, ఏకైక మోక్ష కారకుడు, నాలుగవ స్థితి (తురీయం) అయిన వాడు,  ప్రసన్నుడు, దేవ దేవుడు, శరణాగతుల ఆర్తిని పోగొట్టే వాడు, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను. 


స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే

పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యం |

భవాంభోనిధిం తే వితీర్త్వాంతకాలే

హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి || 9 ||


🌹తాత్పర్యము:

పాండురంగని నుతించే ఈ స్తోత్రాన్ని భక్తి మరియు శ్రద్ధతో పఠించే వారు సులభముగా సంసార సాగరాన్ని దాటి, విష్ణు లోక నివాసము పొందుతారు.


ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ పాండురంగాష్టకం సంపూర్ణం ||

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం