Posts

Showing posts from February, 2026

💥లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🌹🙏 💥 లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం💥 శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే । యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥ బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత । లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥ సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య । త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥ సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య । ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 4 ॥ సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య । దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 5 ॥ సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ । ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 6 ॥ సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః । నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 7 ॥ సంసారవృక్షబీజమనంతకర్మ...

అమలక ఏకాదశి విశిష్టత

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 అమలక ఏకాదశి ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని "అమలక ఏకాదశి" లేదా "అమలకి ఏకాదశి" అంటారు. ఈ రోజు ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు. ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత. భక్తి శ్రద్ధలతో "ఓం నమో నారాయణాయ" అని స్మరిస్తూ ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్ళను పోయాలి. ఆ తర్వాత చెట్టునకు పసుపు, కుంకుమ, గంధం పూలతో అలంకరించి, దీపం, ధూపం, అరటి ఆకులో అరటిపండు నైవేద్యం పెట్టిన తర్వాత.. చెంబులో కొన్ని నీళ్ళను పోసుకుని అందులో తెల్లని దారం ఉండను వేసి దారాన్ని పచ్చగా తడవనిచ్చిన తర్వాత పచ్చగా పసుపునీటిలో తడిసిన ఆ పసుపు దారాన్ని ఉసిరిక చెట్టునకు సవ్య దిశగా ప్రదక్షిణాలు చేస్తూ చుట్టునకు ఓ అకు వరస చొప్పున పదమూడు చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన ధారాన్ని నిష్కల్మషమైన మనస్సుతో ముడి వేయాలి. ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో స్మరించ వలసిన మంత్రం :- ధాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి ! వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తధాకురు !! భగవంతుడు భక్తుడి యొక్క ప్రేమతో కూడుకున్న పిలుపునకు స్వామి ...

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏 విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే తాత్పర్యము : ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది.  నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు.  మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము)  పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై  శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి  నా నమస్కారములు. దక్షిణామూర్తి గురుపరంపరను, ఆయన తత్త్వాన్ని తెలియజేసే ప్రసిద్ధ శ్లోకం ఈ కింది విధంగా వుంది: సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం। అస్మదాచార్య పరియంతాం వందే గురుపరంపరాం॥ (అర్థం: సదాశివుడు నుండి ప్రారంభమై, శంకరాచార్యుల ద్వారా మధ్యలో కొనసాగి, మన గురువుల వరకు వచ్చిన గురుపరంపరను వందనాలు.) వేదాంతంలో అత్యంత గంభీరమైన తత్త్వం – దక్షిణామూర్తి తత్త్వం. ఇది ఒక ఆధ్యాత్మిక ఆవిష్కరణ మాత్రమే కాదు; జీవన దిశను, ...

వినాయక అష్టోత్తర శతనామ స్తోత్రం

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!! 'మెలితిరిగిన తొండంతో మహారూపంతో కోటి సూర్యులతో సమాన తేజస్సుతో వెలుగొందే దేవా! చేపట్టే ప్రతి కార్యం నిర్విఘ్నంగా కొనసాగేలా అనుగ్రహించు’ అంటూ యుగయుగాలుగా పూజలందుకుంటున్న వినాయకుడు ప్రమథ గణాలకు అధిపతి. గణాలన్నిటిని ఏకతాటిపై నడిపించేవాడు గణనాథుడు. ప్రథమ పూజ్యుడు. సత్యప్రమాణాల దేవుడు. వినాయకుడు అంటే వేరే నాయకుడు లేనివాడనీ, తనకు తానే నాయకుడనీ అర్థం. విశేషమైన నాయకత్వ లక్షణాలు కలవాడు. అద్వితీయుడు. ఆనంద స్వరూపుడు. వినాయకోత్పత్తి గురించి ఎన్ని పురాణ గాథలు ఉన్నా, పార్వతీదేవి మంగళస్నానం సందర్భంగా నలుగుపిండితో తయారు చేసిన బొమ్మకు ప్రాణం పోసి, వాకిలి వద్ద కావలి ఉంచడం, తన ప్రవేశాన్ని అడ్డగించడంతో ఆగ్రహించిన శివుడు బాలుడి తలను తుంచి, పార్వతీ విలాపంతో గజాసురుని తలను అతికించి పునర్జీవింపచేయడం లోకంలో ప్రసిద్ధమైన కథ. వినాయకుడు ప్రకృతి ప్రేమికుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. విఘ్నాలు తొలగేందుకు ఆయనను అర్చించడంతో పాటు ఆయన లోకానికి అందించిన వ్యక్తిత్వ వికాస కోణంలోని సందేశాన్ని అవగాహన చేసుకోవలసి ఉంది...

ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 నమస్తే నమస్తే మహాశక్తి పాణే నమస్తే నమస్తే లసద్వజ్రపాణే నమస్తే నమస్తే కటిన్యస్త పాణే నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ఒకచేతిలో మహాశక్తి అయుథాన్ని, ఒకచేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొకచేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయప్రధానం చేస్తున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు. 💥ఆది దంపతులైన శివపార్వతుల అపురూప ప్రేమానుబంధానికి సంకేతం- సుబ్రహ్మణ్యుడు. తారకాసురుడి సంహారం కోసం కారణజన్ముడిగా ఆయన స్కందుడి పేరిట ఉదయించాడు. అసురత్వాన్ని అంతం చేసుకొని ఆనంద సిద్ధిని అందుకోవడానికి పాటించాల్సిన సాధనా సంవిధానాన్ని సుబ్రహ్మణ్య తత్వం ఆవిష్కరిస్తుంది. అంతఃకరణ శుద్ధితో జ్ఞానశక్తి ద్వారా సుగుణవంతమైన జీవన మార్గంలో పయనించాలని స్వామి సందేశం! ‘స్వామి’ నామధేయం సుబ్రహ్మణ్యానికే ప్రత్యేకం. ‘సుబ్రహ్మణ్యుడు’ అంటే, శ్రేష్ఠమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సాధకుడని సంకేతార్థం. ప్రతికూలతల్ని అధిగమించి, అవరోధాల్ని అధిరోహించి లోకోత్తరమైన లక్ష్యసిద్ధిని ఎలా అందుకోవాలో ‘కుమార సంభవం’ వృత్తాంతం చాటిచెబుతుంది. మార్గశిర శుద్ధ షష్ఠినాడు సుబ్రహ్మణ్యుడు అవతరించ...

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం💥 లఘు స్తోత్రం సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ । ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥ పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ । సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥ వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే । హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥ ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః । సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥ సంపూర్ణ స్తోత్రం సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ । భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1 ॥ శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ । తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ ॥ 2 ॥ అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ । అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ॥ 3 ॥ కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ । సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ॥ 4 ॥ పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ । సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ॥ 5 ॥ యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పి...

💥శ్రీమార్తాండ స్తోత్రం - తెలుగు తాత్పర్యం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏 💥శ్రీ మార్తాండ స్తోత్రం సూర్య భగవానుడిని కీర్తించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఈ స్తోత్ర పఠనం అజ్ఞానాన్ని, భయాలను మరియు అనారోగ్యాలను పోగొడుతుంది. 💥 శ్రీమార్తాండ స్తోత్రం - తెలుగు తాత్పర్యం💥 గాఢాంధకారహరణాయ జగద్ధితాయ జ్యోతిర్మయాయ పరమేశ్వరలోచనాయ । మందేహదైత్యభుజగర్వవిభంజనాయ సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే ॥ 1 ॥ తాత్పర్యం: దట్టమైన చీకటిని పోగొట్టేవాడు, ప్రపంచానికి మేలు చేసేవాడు, జ్యోతిర్మయుడు (తేజోమయుడు), పరమేశ్వరుని (శివుని) నేత్రం వంటివాడు, మందేహులనే రాక్షసుల గర్వాన్ని అణచివేసేవాడు, తీవ్రమైన కిరణాలు కలవాడు అయిన సూర్యదేవా! నీకు నమస్కారాలు. ఛాయాప్రియాయ మణికుండలమండితాయ సురోత్తమాయ సరసీరుహబాంధవాయ । సౌవర్ణరత్నమకుటాయ వికర్తనాయ సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే ॥ 2 ॥ తాత్పర్యం: ఛాయాదేవికి ప్రియమైనవాడు, రత్నఖచిత కుండలాలతో అలంకరించబడినవాడు, సురోత్తముడు (దేవతలలో శ్రేష్ఠుడు), సరసీరుహబంధవుడు (కమలాలకు మిత్రుడు/సూర్యుడు), బంగారు రత్నకిరీటం ధరించినవాడు, వికర్తనుడు అయిన సూర్యదేవా! నీకు నమస్కారాలు సంజ్ఞావధూహృదయపంకజషట్పదాయ గౌరీశపంకజభవాచ్యుతవిగ్రహాయ । లోకేక...

ఓం నమో వేంకటేశాయ🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹 🙏 ఏడు కొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా.. అంటూ భక్తి పారవశ్యంతో ఏడు కొండలు ఎక్కుతారు. అంటే ఏడుకొండలు దాటితే ఆనందనిలయం. మరి ఈ కొండల వెనుకున్న పరమార్థం ఏంటి - వీటికి శరీరంలో ఉన్న చక్రాలకు సంబంధం ఏంటి.. ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం  ఉండేది బ్రహ్మస్థానం. అంటే శరీరంలో ఉన్న షట్చక్రాల్లో తలపై ఉండేది ఏడవది బ్రహ్మరంధ్రం. మూలాధార చక్రం నుంచి  స్వాధిష్ఠానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం ఇవన్నీ దాటితే తలపై ఉండే బ్రహ్మస్థానం అయిన సహస్రారం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న ఆనందనిలయం అన్నమాట.  తిరుమల 7 కొండలు1. వృషభాద్రి 2. నీలాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.  ఆ ఏడు కొండలు సాలగ్రామాలే. ఆ ఏడు కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః | తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా || వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః | ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశి...

లక్ష్మీ ఆవిర్భావం - శ్రీవిష్ణుపురాణము.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥 లక్ష్మీ ఆవిర్భావం - శ్రీవిష్ణుపురాణము. 💥 బ్రహ్మాదులు శ్రీహరిని శరణువేడుట "ఆద్యుడవు, పూర్వులకెల్లా పూర్వుడవు. యజ్ఞమూర్తివి, అవిశేషణుడవు. (అనగా - ఏ ఇతర విశేషణాల చేత పోల్చడానికి శక్యం గాని వాడవు.) బ్రహ్మను సృష్టించినవాడవు! మా పట్ల దయార్ద్ర దృక్కులను ప్రసరించి ప్రసన్నుడవై మాకు దర్శనమియవలసిందిగా కోరుతున్నాము..." అని స్తుతించగా, శ్రీహరి వారికి ప్రత్యక్షమై, యవన్మందికీ శరణు ప్రసాదించాడు. ప్రత్యక్షంగా వాసుదేవుని చూచిన ఆనందంలో తిరిగి వారంతా జనార్దనుని స్తోత్రం చేశారు. శ్రీహరి కటాక్ష దృష్టితో వారిని చూసి "దేవతలారా! మీ తేజస్సులను మళ్లీ పూరించుకోవాలంటే నేను వివరించబోయేరితిగా ప్రవర్తించండి! ఇంద్రా! నువ్వు నాయకత్వం వహించిం దేవతల వైపు నుంచి ప్రతినిధిగా రాక్షసనేతలతో సంభాషించు! వారిని సముద్ర మథనానికి ఒప్పించు! నేను తోడుగా ఉంటాను. వాసుకిని తరిత్రాడుగా చేసి, మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి, మీరు చేసే సముద్రమధనం వల్ల అమృతం పుడుతుంది. మీరు అది గ్రోలి అమరులు కాగలరు. (అంతవరకు దేవతలకు కూడ అమరత్వం లేదని అర్థం) నేను సముద్రమథనం వల్ల ఆయాసం మాత్రమే ఆ దేవద్...

💥శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీదత్తాయ నమః🌹🙏 💥శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం దత్త భగవానుని 12 పవిత్ర నామాలను తెలియజేస్తుంది. ఇది సకల కార్యసిద్ధిని, జ్ఞానాన్ని, కరుణను ప్రసాదించే శక్తివంతమైన స్తోత్రం. ఈ స్తోత్ర పారాయణ వల్ల దారిద్య్రం తొలగి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.  💥శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం💥 అస్య శ్రీదత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రమంత్రస్య పరమహంస ఋషిః శ్రీదత్తాత్రేయ పరమాత్మా దేవతా అనుష్టుప్ఛందః సకలకామనాసిద్ధ్యర్థే జపే వినియోగః । ప్రథమస్తు మహాయోగీ ద్వితీయః ప్రభురీశ్వరః । తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్థో జ్ఞానసాగరః ॥ 1 ॥ పంచమో జ్ఞానవిజ్ఞానం షష్ఠస్యాత్ సర్వమంగళం । సప్తమో పుండరీకాక్షో అష్టమో దేవవల్లభః ॥ 2 ॥ నవమో నందదేవేశో దశమో నందదాయకః । ఏకాదశో మహారుద్రో ద్వాదశో కరుణాకరః ॥ 3 ॥ ఏతాని ద్వాదశనామాని దత్తాత్రేయ మహాత్మనః । మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయ హరః పరః ॥ 4 ॥ క్షయోపస్మార కుష్ఠాది తాపజ్వరనివారణమ్ । రాజద్వారే పదే ఘోరే సంగ్రామేషు జలాంతరే ॥ 5 ॥ గిరే గుహాంతరేఽరణ్యే వ్యాఘ్రచోరభయాదిషు । ఆవర్తనే సహస్రేషు లభతే వాంఛితం ఫలమ్ ॥ 6 ॥ త్రికాలే యః పఠేన్నిత్యం మోక్షసిద్ధిమవాప్ను...

💥ఫాల్గుణమాసం విశిష్టత..

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥 ఫాల్గుణమాసం విశిష్టత.. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. సర్వదేవతావ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది. వసంత పంచమి నుంచి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు. హరిహరసుతుడు అయ్యప్పస్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే ...

ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 సేనా విదారక స్కంధ మహాసేన మహాబల రుద్రోమాగ్నిజ శాద్వాక్త్ర గంగార్భా నమోస్తుతే రాక్షససైన్యాన్ని నశింపజేసినవాడా! శరవణ తటాకము నుండి ఒడ్డుకు జారినవాడా! గొప్ప సైన్యాన్ని నిరంతరం అదుపు రక్షణగా ఉంచుకునే వాడా, సాటిలేని శక్తి సామర్థ్యములు గలవాడా, శంకరునకు పార్వతికి అగ్నికి కుమారుడవైనట్టివాడా, గంగాదేవి గర్భవాసం చేసినట్టివాడా, షణ్ముఖా, నీకు నమస్కారం. షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలంకారాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందు హస్తాన్ని దాల్చి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణన్నవారిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజాన్ని, పృథ్వి, అగ్ని, జలం, షట్ కృత్తికల శక్తిని (నక్షత్రశక్తి) ధరించి, చివరకు బ్రహ్మ తపోనిర్మితమైన అలౌకిక మహాగ్ని శరవణంలో (అగ్నితో కూడిన రెల్లుతుప్పు) రూపుదిద్దుకుంది. అందుకే స్వామి శరణభవుడు. 💥#శరవణభవ…! శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు  ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని  వ – అమృతబీజము అధ...

ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 ఎంత మంది దేవుళ్లున్నా అందరిలో శివుడు భిన్నంగా ఉంటాడు. అందరీకీ అలంకారాలు, నైవేద్యాలు కావాలంటే.. చెంబుడు నీళ్లు, ఉపవాసం అంటాడు శివయ్య.. ఇంతేనా.. ఇంకా చాలా ఉంది... విందు భోజనాలప్పుడు శంకరుడికి ఆహ్వానం ఉండదు.. విషాహారానికి మాత్రం అగ్రస్థానం కట్టబెట్టారు. పట్టువస్త్రాలు పంపిణీ సమయంలో ఎవ్వరూ పట్టించుకోలేదు.. ఏనుగు చర్మాన్ని మాత్రం శివయ్యకే కట్టబెట్టారు. గంగాస్నానాల్లో ఆనందంగా మునకలేసేందుకు అందరూ సిద్ధమే.. ఆకాశం నుంచి దూకిన గంగమ్మను నిలువరించేందుకు శివుడే కావాలి. అందుకే మరి భోళా శంకరుడు అంటారంతా.. భక్తులు ఇలా పిలిస్తే అలా పలికి వరాలను అనుగ్రహించే భగవంతుడు ఈశ్వరుడు. తొందరపాటు తనంతో పీకలమీదకు తెచ్చుకుంటాడు.. అయినా కానీ మోకరిల్లగానే వశుడైపోతాడు..  దుర్మార్గుడినీ ప్రేమించడమే దైవత్వం అంటే అని చాటిచెప్పాడు పరమేశ్వరుడు.. అదే కదా మరి శివతత్వం. భారీగా అలంకారాలు అవసరం లేదు, నిండుగా నైవేద్యాలు అక్కర్లేదు.. పాయసాన్నాలు నివేదించాల్సిన అవసరం లేదు. చెంబుడు నీళ్లు గుమ్మరిస్తే చాలు.. పొంగిపోతాడు.  నాలుగు మారేడు దళాలు భక్తితో సమర్పిస్తే చాలు పట్టలేనంత ఆనందిస్తాడు....

మాఘపురాణం - 29 అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 29 అధ్యాయము మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము. మాఘమాసమునందు నదీస్నానము చేసి, మాఘమాస వ్రతము ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగుతుంది. ఈ మాఘమాసములో ఏకాదశీ వ్రతము చేసి ఉపవాసము ఉన్నవారు వైకుంఠప్రాప్తి పొందగలరు. మాఘమాసమందు ఏకాదశీ వ్రతము చేసి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి. పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును పొందవలెనని అభిప్రాయమ కలిగి మంధర పర్వతమును కవ్వముగా, వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరమును మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధిస్తు ఉండగా మొదట పుట్టిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి భార్యగా స్వీకరించాడు. తరవాత ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించగా వాటిని విష్ణుమూర్తి ఆదేశముపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాలసముద్రమును మధించగా లోకభీకరమై ఘనమైనతేజస్సుతో ఉండే అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టింది. ఆ హాలాహల విష జ్వాలలతో సమస్త లోకములు కాలిపోతున్నాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోయి సర్వేశ్వరుని శరణుకోరగా భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి ...

💥శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం)💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం) దేవతలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాడిన శక్తివంతమైన స్తోత్రం. త్రినేత్రుడైన శివుడిని స్తుతిస్తూ, జటామకుటధారి, మహాభోగోపవీతి, భీమాట్టహాసవక్త్రుడని వర్ణిస్తూ ఈ స్తోత్రం సాగుతుంది. ఈ స్తోత్ర పారాయణం వల్ల భక్తి, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతాయి.  💥 శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం) 💥 దేవా ఊచుః | నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే | రక్తపింగళ నేత్రాయ జటామకుట ధారిణే ||  భూత భేతాళ జుష్టాయ మహాభోగోప వీతినే | భీమాట్ట హాసవక్త్రాయ కపర్దినేస్థాతణవేనమః || పూషదంత వినాశాయ భగనేత్ర భిదే నమః | భవిష్యదృష్ట చిహ్నాయ మహాభూతపతేనమః || భవిష్యత్త్రిపురాంతాయ తరాంధక వినాశినే |  కైలాస వరవాసాయ కరికృత్తి నివాసినే || వికారాళోర్ద్వ కేశాయ భైరవాయ నమోనమః | అగ్నిజ్వాలా కరాళాయ శశిమౌళి కృతేనమః || భవిష్యత్ కృత కాపాలివ్రతాయ పరమేష్టినే | తథా దారువన ధ్వంసకారిణే తిగ్మశూలినే || కృతకంకణ భోగీంద్ర నీలకంఠ త్రిశూలినే | ప్రచండదండ హస్తాయ బడభాగ్ని ముఖాయచ || వేదాంత వేద్యాయ నమో యజ్ఙమూర్తె నమోనమః | దక్షయజ్ఞ వినాశాయ జగద్భయ కరాయ చ || విశ్వేశ్వరాయ దేవాయ శివశంభో భవాయ చ |...

మాఘపురాణం - 28వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 28వ అధ్యాయము విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదము జరిగింది. శివుడు నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు. కాదు, బ్రహ్మదేవుడు ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను కనక నేనే గొప్ప అన్నాడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయాయి. సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అప్పుడు శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రములు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపిస్తున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేక సర్వత్రా తానే అయి అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు అందరు భగవంతుని కీర్తిస్తూ కనపడుతున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తము కనపడుతున్నాయి. భీషణమైన వేడి నిట్టూ...

💥మహా శివరాత్రి విశిష్టత💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 మహా శివరాత్రి విశిష్టత 💥 ‘‘ నమశ్శమ్భవేచ మయోభవేచ నమః శంకరాయచ మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ’’                           -శ్రీరుద్ర ప్రశ్న (నమకము) "ఇహపరములు రెండింటిలోను సుఖశాంతులు ప్రసాదించు శివునికి నమస్కారం. ప్రాపంచిక ఆనందాన్ని మోక్షానందాన్ని ప్రసాదించే పరమేశ్వరునికి నమస్కారము. దివ్య మంగళ స్వరూపుడైన పరమాత్మకు వందనములు. శుభాలకు మించిన శుభమగు శాశ్వత స్థితిని ప్రసాదించు ఈశ్వరునికి ప్రణామములు. తనను పొందిన వారిని శివమయం చేసి శుభాలను కటాక్షించే శంకరునికి నమస్మృతులు. ఇటువంటి పరమశివునికి నమస్కారములు, పాదాభివందనములు’’ అని, శ్రీరుద్ర ప్రశ్న. అనగా రుద్ర సంహిత (రుద్ర నమకము) ప్రణమిల్లుతోంది. మహాశివరాత్రి ఒక గొప్ప పర్వదినం. అజ్ఞానానికి చిహ్నమైనది రాత్రి.. చీకటి. మరి ఇది మంగళకరమైన రాత్రి ఎట్లా అయింది. శివ అనగా మంగళకరము. శుభప్రదము అని అర్థం. శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, శివుని దర్శనమ్, బిల్వార్చన, అభిషేకము, నామ సంకీర్తన వలన అజ్ఞానం అనే చీకటి తొలగించబడుతుంది. అనగా జ్ఞాన వెలుగు ద్యోతకమవుతుంది. అందుకే ఇద...

మాఘపురాణం - 27వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 27వ అధ్యాయము ఋక్షక అనే బ్రాహ్మణ కన్య వృత్తాంతము పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షక అను కన్య జన్మించి దిన దినాభివృద్ధిగా పెరుగుతున్నది. దురదృష్టము కొద్దీ పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభింది. చాలా సంవత్సరములు చేయటము వలన అనేక మాఘ మాస స్నాన ఫలము దక్కింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణములు విడిచి పెట్టింది. ఆరోజు వైకుంఠ ఏకాదశి అవడముచే వైకుంఠమునకు వెళ్ళింది. చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు వెళ్ళింది. ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలు అయినందున బ్రహ్మదేవుడు ఆమెను దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమ” అన్న పేరుతో సత్యలోకమునకు పంపాడు.  ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసారు. వారి తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుము” అనగా “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్మ”...

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 “సర్వలోక జననీ కమలా యా  దేశ కాల వితతా రమణీ తే సాతిమృద్ వతసికా కుసుమాభోత్ సంగగాపి తవ హృత్కమలస్థా” “ఓ శ్రీనివాసా! ఎల్ల లోకాలకు తల్లి, అన్ని దేశాలలోను, అన్ని కాలాలలోనూ నిన్నే అనుసరిస్తూ, నీ హృదయ కమలంలో నివసిస్తూ, ఎల్లప్పుడూ నిన్నే ధ్యానించే, నీ అర్ధాంగి – లక్ష్మీదేవికి నా నమస్సులు” లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత. ఆమె స్మరణ వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. అయితే అమ్మవారు జ్ఞానానికి ప్రతినిధి. వేదాలకు అభిమాని. ఆమె అనంతానంత రూపాలను ధరించి, ఎన్నెన్నో ధర్మసూక్ష్మాలను మానవులకు బోధించింది. నారాయణ తత్వము ఎంత ఉన్నతమైనదో, లక్ష్మీతత్వం కూడా అంతే లోతైనది. సర్వ దేవతలకు, సర్వ లోకాలకు, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, శుభాన్ని ప్రసాదించే దయార్ద్ర హృదయురాలు శ్రీ లక్ష్మీ తాయారు. దేవీసూక్తం అని కూడా పేరుపొందిన అంభ్రణీ సూక్తం ఋగ్వేదంలోని ఒక భాగం. ఈ సూక్తం మహాలక్ష్మీ తత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. అంభ్రణీ సూక్తమ్ అమ్మవారే మనకు చెబుతున్నట్టుగా ఉత్తమ పురుషలో సాగుతుంది. “నేను ఎవరినైనా సరే చతుర్ముఖ బ్రహ్మగాను, మహారుద్రుడిగాను మార్చగలను. చతుర్ముఖ బ్రహ్మ శిరస్సును ...