💥శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం)💥
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం) దేవతలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాడిన శక్తివంతమైన స్తోత్రం. త్రినేత్రుడైన శివుడిని స్తుతిస్తూ, జటామకుటధారి, మహాభోగోపవీతి, భీమాట్టహాసవక్త్రుడని వర్ణిస్తూ ఈ స్తోత్రం సాగుతుంది. ఈ స్తోత్ర పారాయణం వల్ల భక్తి, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతాయి.
💥శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం)💥
దేవా ఊచుః |
నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే |
రక్తపింగళ నేత్రాయ జటామకుట ధారిణే ||
భూత భేతాళ జుష్టాయ మహాభోగోప వీతినే |
భీమాట్ట హాసవక్త్రాయ కపర్దినేస్థాతణవేనమః ||
పూషదంత వినాశాయ భగనేత్ర భిదే నమః |
భవిష్యదృష్ట చిహ్నాయ మహాభూతపతేనమః ||
భవిష్యత్త్రిపురాంతాయ తరాంధక వినాశినే |
కైలాస వరవాసాయ కరికృత్తి నివాసినే ||
వికారాళోర్ద్వ కేశాయ భైరవాయ నమోనమః |
అగ్నిజ్వాలా కరాళాయ శశిమౌళి కృతేనమః ||
భవిష్యత్ కృత కాపాలివ్రతాయ పరమేష్టినే |
తథా దారువన ధ్వంసకారిణే తిగ్మశూలినే ||
కృతకంకణ భోగీంద్ర నీలకంఠ త్రిశూలినే |
ప్రచండదండ హస్తాయ బడభాగ్ని ముఖాయచ ||
వేదాంత వేద్యాయ నమో యజ్ఙమూర్తె నమోనమః |
దక్షయజ్ఞ వినాశాయ జగద్భయ కరాయ చ ||
విశ్వేశ్వరాయ దేవాయ శివశంభో భవాయ చ |
కపర్ది నే కరాళాయ మహాదేవాయ తేనమః ||
ఏవం దేవైస్త్సుత శ్శంభు రుగ్రధన్వా సనాతనః |
ఉవాచ దేవదెవోయం యత్కరోమి తదుచ్యతే ||
..... సర్వేజనా సుఖినోభవంతు సన్మంగళానిభవంతు..
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment