Posts

Showing posts from December, 2022

ఆది గురువు దక్షిణామూర్తి గుణగణాలు:

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏 రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 💥తాత్పర్యం: రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్ర నుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకు ముందు నిద్రలో యున్నాను, మరియు ఆ నిద్ర లోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు. 🍁🍁🍁🍁🍁 💥ఆది గురువు దక్షిణామూర్తి గుణగణాలు: ప్రధానంగా దక్షిణామూర్తి చాలా శాంత స్వరూపులు. అసలు దక్షిణామూర్తి అనే పేరు దక్షిణం వైపు ఉండే మూర్తిగా కొందరికి తెలుసు. అయితే ద...

💥శ్రీదత్త స్తవం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః 🌹🙏                   🔱 ఓం శ్రీ గురుభ్యోనమః🔱 💥 శ్రీదత్త స్తవం💥 దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్ । ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 1 ॥ 💥తాత్పర్యము: భక్తుల యందు పుత్రప్రేమను కలిగి అపార ప్రేమతో వరములు ఇచ్చి, పరబ్రహ్మ స్వరూపం అయి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణమ్ । సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 2 ॥ 💥తాత్పర్యము: దీనుల, ఆర్తుల యందు బంధువు, కరుణా సముద్రుడు, అందరినీ రక్షించే దయ తత్వం కలిగి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు. శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ । నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు ॥ 3 ॥ 💥తాత్పర్యము: శరణాగతి చెందిన దీనులకు కల్పవృక్షం, సర్వవ్యాప్తుడు అయిన నారాయణుడు, ఆప్త పరాదీనుడు  అయి తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు. సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళమ్ । సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 4 ॥ 💥తాత్పర్యము: అన్న...

విద్యకు అధిపతి.. విద్యార్థులకు జ్ఞానప్రదాత హయగ్రీవుడు💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే 🍁🍁🍁🍁🍁 💥సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు, ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి అని అంటూ వుంటారు. అలా తన భక్తులను చల్లగా చూడటం కోసమే శ్రీమహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతారాల్లో ‘#హయగ్రీవావతారం’ ఒకటి.  జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥ 💥 భావం : జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.  🔹🔸🔹🔸🔹🔸 💥విద్యకు అధిపతి.. విద్యార్థులకు జ్ఞానప్రదాత హయగ్రీవుడు💥 💥పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు... బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారాన్ని పోలినవారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు. వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానార కాలుగా హింసించ సాగాడు. దాంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు. యోగ నిద్రలో వున్న వి...

గజాననుని రూపం

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥 గణపతి ధ్యానం 💥 శివ తనయ వరిష్టం సర్వ కళ్యాణ మూర్తిం  పరశు కమల హస్తం మూషికం మోదకేన  అరుణ కుసుమవాల వ్యాళలంబోదరంతం  మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి ||  కబుద ధవళ వర్ణం పూర్ణ లక్ష్మి ప్రసన్నం  మదగజముఖ మీడ్యం సంజలత్ కర్మయుగమం  అభయ వరద హస్తం వాసుకీ యజ్ఞ సూత్రం  మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి || 🍁🍁🍁🍁🍁 💥 మహాగణపతిం మనసాస్మరామి 💥 💥గజాననుని రూపం ఆధ్యాత్మికత మోక్ష సిద్ధికి వక్రమైన ఆటంకములగు అరిషడ్వర్గములను (కామ క్రోధములు) నశింపచేసి, చిత్తైకాగ్రత నొసగి, స్వస్వరూప సంధానతతో జీవ బ్రహ్మైక్య స్థితిని అనుగ్రహించువాడు వక్రతుండుడు.  💥విఘ్నేశ్వరుని చేతిలోని పాశ అంకుశాలు - రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. 💥గణపతికి ప్రియమైన భక్ష్యం - మోదకం. ఆనందాన్నిచ్చేది మోదకం. కృపా కటాక్షములతో ఆనందం లభిస్తుంది.  💥నాగయజ్ఞోపవీతం - కుండలినీ శక్తికి సంకేతం. మనిషి క్రోధాన్ని విడిచి అనురాగాన్ని అభివృద్ధి చేసికొని శాంతి సహజీవనంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు విశ్వప్రేమ భావనా భక్తిని పెంపొందించుకొని జీవితాన్ని చరితార్థత నొందించుకోవాల...

💥శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి "గురుగుహా" అనే నామం యొక్క విశిష్ఠత ఏమిటి?

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏 💥 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి "గురుగుహా" అనే నామం యొక్క విశిష్ఠత ఏమిటి? "గురుగుహా” అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్న అనంత నామాలలో ఒకటి. గురుగుహ అనే నామానికి స్థూల సూక్ష్మ కారణ అర్ధాలు మూడు ఉన్నాయి. 💥మొదటి స్థూల అర్ధము💥 గురుగుహా ఒక అర్ధం చెప్పాలంటే, మన హృదయ గుహ లోనే ఉన్న గురు స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు అని. ఇక్కడ గుహా అంటే మన హృదయ గుహ – హృదయాంతరాళము అని అన్వయించుకోవచ్చు. శాస్త్రీయ సంగీత త్రయములో ఒకరు, ప్రఖ్యాత వాగ్గేయకారుడు, సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రుడు అయిన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తనలు అన్నీ ‘గురుగుహా’ అనే మకుటంతో ఉంటాయి. అది ఏ దేవతా స్వరూపాన్ని ఉద్దేశించి చేసిన కీర్తన అయినా సరే, గురుగుహా అనే నామం ఉంటుంది.  ముత్తుస్వామి దీక్షితార్ గారి జీవితంలో ఆయన గురువైన చిదంబరనాథ శాస్త్రి గారిని కాశీ పట్టణంలో విశ్వేశ్వరుని సన్నిధిలో ఐదు సంవత్సరాలు పాటు గురు సేవ చేస్తూ, అటు రోజూ విశ్వేశ్వరుని దర్శనం చేస్తూ గురువు వద్ద సంగీతం అభ్యసించారు.  ఒకనాడు, ఈయన గురుభక్తికి మెచ్చిన వారి గురువు గార...

హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 ధ్యానం: అతులిత బలధామం - స్వర్ణ శైలాభదేహం దనుజవన కృశానుం - జ్ఞానినామాగ్రగణ్యం సకలగుణ నిధానం - వానరాణ మధీశం రఘుపతి ప్రియభక్తం - వాతజాతం నమామి! 🍁🍁🍁🍁🍁 హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం,  విశ్వవిజేతలైన రాక్షస వీరులనేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే. హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క.  💥సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదు...

💥మృతసంజీవన స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 💥 మృతసంజీవన స్తోత్రం 💥 ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ | మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా || 1 || సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్ | మహాదేవస్య కవచం మృతసంజీవనామకం || 2 || సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ | శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా || 3 || వరాభయకరో యజ్వా సర్వదేవనిషేవితః | మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా || 4 || దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః | సదాశివోzగ్నిరూపీ మాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా || 5 || అష్టాదశభుజోపేతో దండాభయకరో విభుః | యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదాzవతు || 6 || ఖడ్గాభయకరో ధీరో రక్షోగణనిషేవితః | రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదాzవతు || 7 || పాశాభయభుజః సర్వరత్నాకరనిషేవితః | వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదాzవతు || 8 || గదాభయకరః ప్రాణనాయకః సర్వదాగతిః | వాయవ్యాం మారుతాత్మా మాం శంకరః పాతు సర్వదా || 9 || శంఖాభయకరస్థో మాం నాయకః పరమేశ్వరః | సర్వాత్మాంతరదిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః || 10 || శూలాభయకరః సర్వవిద్యానామధినాయకః | ఈశానాత్మా తథైశాన్యాం పాతు మాం పరమేశ్వరః |...

💥॥ శ్రీ శివ రక్షా స్తోత్రం ॥💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱హర హర మహాదేవ శంభో శంకర 🔱 💥॥ శ్రీ శివ రక్షా స్తోత్రం ॥💥 అస్య శ్రీ శివరక్షాస్తోత్రమంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః | శ్రీ సదాశివో దేవతా | అనుష్టుప్ ఛందః | శ్రీ సదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః || చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్ | అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ || 1 || గౌరీవినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్ | శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః || 2 || గంగాధరః శిరః పాతు ఫాలం అర్ధేందుశేఖరః | నయనే మదనధ్వంసీ కర్ణో సర్పవిభూషణః || 3 || ఘ్రాణం పాతు పురారాతిః ముఖం పాతు జగత్పతిః | జిహ్వాం వాగీశ్వరః పాతు కంధరాం శితికంధరః || 4 || శ్రీకంఠః పాతు మే కంఠం స్కంధౌ విశ్వధురంధరః | భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృక్ || 5 || హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః | నాభిం మృత్యుంజయః పాతు కటీ వ్యాఘ్రాజినాంబరః || 6 || సక్థినీ పాతు దీనార్తశరణాగతవత్సలః | ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః || 7 || జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః | చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః || 8 || ఏతాం శివబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ | స భుక్త్వా సకలాన్కామాన్ శివసాయుజ్యమాప్నుయాత్...

అక్షయపాత్ర

Image
 ⚜️🕉️🚩 ఓం ఆదిత్యాయ నమః🌹🙏 ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ । సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః ॥  భావం: అదితికుమారుడు. జగత్తు సృష్టించినవాడు. జనులను తమ కర్మలయందు ప్రేరేపించువాడు. ఆకాశమునందు సంచరించువాడు. జగత్తును వర్షాలచేత పోషించువాడు. కిరణములు కలవాడు. బంగారు రంగు కలవాడు. ప్రకాశించువాడు. బంగారము రేతస్సుగా గల వాడు. పగలు కల్పించువాడు. 🍁🍁🍁🍁🍁 💥 అక్షయపాత్ర 💥 అనుద్యూతంలో కూడా ఓడిపోయాకా అన్నమాట ప్రకారం పాండవులు రాజభోగాలన్నీ విడిచిపెట్టారు. నారచీరలూ, కృష్ణజినమూ ధరించారు. కందమూల ఫలాలు తింటూ పన్నెండేళ్ళు అరణ్యవాసమూ, ఒక ఏడాది అజ్ఞాతవాసమూ చేయడానికి సంసిద్ధులయ్యారు. అలా వెళ్తున్న వాళ్ళను చూసి – "ఏమున్నా ఏం లేకపోయినా ఈ పరమదుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం వుండలేం. అసలు వాడే దుర్మార్గుడు. పైగా వాడికి జర, వ్యాది, మృత్యువుల్లాగా కర్ణుడు, సైంధవుడు , శకుని తోడయ్యారు. ఇటువంటి పుణ్య పురుషుడు రాజ్యం చేస్తుంటే ఇంక ఈ దేశంలో ధర్మం ఏం నిలుస్తుంది కనుక! పదండి, మనం కూడా పాండవులతో వెళ్ళి వాళ్ళెక్కడుంటే అక్కడే వుందాం” అని ఆక్రోశిస్తూ పౌరులంతా పాండవుల వెంట పరుగెత్తారు. “నాయనలారా...

పోతనను ప్రాణాలను కాపాడిన "వరాహావతారం"💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 పోతనను ప్రాణాలను కాపాడిన "వరాహావతారం" 💥 భక్తపోతన గురిచి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అటువంటి మహాభక్తుని జీవితంలో జరిగిన అత్యద్భుత సంఘటన చూద్దామా! పోతన తను వ్రాసిన భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. కాని అప్పుడు పరిపాలిస్తున్న రాజు తనకు అంకితం ఇవ్వమని ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసాడు. కాని పోతన అందుకు ఒప్పుకోలేదు. ఆ రాజు పోతనను ఎలాగైనా నిగ్రహించి ఐనా భాగవతాన్ని సొంతం చేసుకోవాలని అనుకొన్నాడు. ఒక రోజు ఆ రాజు వేట నెపముతో పోతన నివసిస్తున్న ఇంటి సమీప అడవి ప్రాంతానికి వచ్చాడు. అడవిలో మకాం వేసి తన సైనికులను పోతన ఇంటి వద్దకు వెళ్ళి భాగవతాన్ని తీసుకు రమ్మన్నాడు. ఆ సైనికులు పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ ఇంటి ముందు ఒక భారీ తెల్లని అడవి పంది, చాలా ఎత్తుగా కనిపించింది. ఆ పందిని చూసి సైనికులు భయపడి రాజు వద్దకు వెళ్ళారు. రాజు వారిని కోప్పడి తన సైన్యాధిపతులను పంపాడు. వారు కూడా ఆ పందిని చూసి భయపడి వచ్చేసారు. ఇక లాభం లేదనుకొని రాజే బయలుదేరాడు. ఆ రాజు కూడా ఆ పందిని చూసి ఒక బాణం వేసాడు. కాని ఆ పంది గుర్రు అనేటప్పటికి రాజు కూడా వెళ్ళిపోయాడు...

పార్వతీదేవి🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥 పార్వతీదేవి 💥 దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి. దక్షుడు ఆమెను శివుని కిచ్చి వివాహం చేశాడు. దక్షప్రజాపతి దక్షుడే. ప్రపంచ సృష్టి కార్యక్రమ నిర్వహణ దక్షుడే. కాని, అహంకారం అజ్ఞానంతో చేయి కలిపి దక్షుని హృదయాన్ని ఆక్రమించింది. అతడు అనుచితాలు ఆచరించసాగాడు. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు. బ్రహ్మేంద్రాది దేవతలను, శ్రీ మహావిష్ణువును, మహర్షి బృందాన్ని యజ్ఞానికి ఆహ్వానించాడు. శివునికి మాత్రం ఆహ్వానం పంపలేదు. పైగా శివుడుగాని, అతని పరివారంలో ఎవరైనాగాని వస్తే, వారికి స్వాగత సత్కారాలు చేయరాదని తన పరివారాన్ని శాసించాడు. కైలాసంలో సతీదేవికి తన తండ్రి యాగం చేస్తున్నాడనే వార్త తెలిసింది. తన తండ్రి చేస్తున్న యాగాన్ని చూడాలనే కోరికతో సతీదేవి, దక్షయజ్ఞానికి వెళ్ళడానికి శంకరుణ్ణి అనుమతి కోరింది. ఆహ్వానంలేని చోట అడుగు పెడితే అవమానం జరుగవచ్చునని, ఆహ్వానం లేకపోయినా, యజ్ఞానికి వెళ్ళవచ్చుననే శాస్త్రవాక్యం యథార్థమే అయినా, మమకారం చూపవలసిన పుట్టింటి వారే అహంకారంతో ప్రవర్తించి, ఆహ్వానం పంపని వేళలో స్వతంత్రించి, వెళ్ళి పారాభవం పొందడం మంచిది కాదని శివుడు ఆమెను అనునయించాడు. ...

రమణ మహర్షి జీవితంలో జరిగిన ఓ ఘటన

Image
 ⚜️🕉️🚩 ఓం అరుణాచలేశ్వరాయ నమః🌹🙏 భూరంభాంస్యనలోఽనిలోఽంబర మహర్నాథో హిమాంశుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ | నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 💥జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక పాదం ఇది. దీని అర్థమేమంటే.. అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనపడే విధంగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తుంది అని. ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాల్లో చూడగలమట. ఆయన తత్వమంతా ఎనిమిది అంకెమీదే నడుస్తుంది. పృథ్వి, అగ్ని, జలం, వాయు, ఆకాశములు పంచ భూతాలు.. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు. ఈ ఎనిమిది శివస్వరూపాలు. వీటిని శివ స్వరూపాలుగా నిర్థారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. 💥అవి కంచిలో పృథ్వి లింగం, జంబుకేశ్వరంలో జల లింగం, అరుణాచలంలో అగ్ని లింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్క్‌లో సూర్య లింగం, సీతాకుండంలో చంద్ర లింగం, కాఠ్‌మాండులో యజమానలింగం. 💥అగ్నిలింగం💥 మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతి లి...

💥శ్రీలక్ష్మీ నృసింహ స్తోత్రమ్

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః🌹🙏 💥 శ్రీలక్ష్మీ నృసింహ స్తోత్రమ్💥 పరకాయ ప్రవేశంతో రాజు దేహంలోకి ప్రవేశించిన శంకరాచార్యులు వారు చాలా కాలం వరకు తిరిగి రాకపోయే సరికి ఇంక రారు అని నిర్ణయించుకున్న శిష్యులు దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించి కార్యం చేస్తారు. శంకరాచార్యులు వారి దేహానికి నిప్పు పెట్టిన విషయం గ్రహించిన శంకరాచార్యులు వారు తిరిగి దేహంలోకి ప్రవేశించే సమయానికి దేహం దహనం అవుతుంది అని తెలుసుకుని నరసింహ స్వామిని ప్రార్ధిస్తారు. భక్తితో ఆర్తీతో చేసిన ప్రార్ధన ఆలకించిన స్వామి  శంకరాచార్యులు వారి దేహానికి పెట్టిన మంటలను చల్లార్చి రక్షిస్తాడు... అదే ఈ అద్భుతమైన శ్లోకం.  ఎటువంటి ప్రాణాపాయ స్థితిలో అయినా అనారోగ్యంతో ఉన్నవారు అయినా ఈ స్త్రోత్ర పారాయణ చేసి వేడుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. 🍁🍁🍁🍁🍁 శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే! భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే ! యోగీ శ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత! లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ || 1 || 💥తాత్పర్యము: పాలసముద్రము నివాసముగాగల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దే...

శ్రీస్కంద స్తోత్రం – మహాభారతం💥

Image
 💥ఓం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🌹🙏 షడక్షర శరీరాయ షడ్విధాధ్వా విధాయినే షడధ్వాతీత రూపాయ షణ్ముఖాయ నమో నమ: 💥భావం: ఆరు అక్షరముల మంత్రమే శరీరముగా గలవాడు, ఆరు విధముల జ్ఞానమును బోధించువాడు, ఆరు మార్గములకు అతీతమైన రూపము గలవాడు, ఆరు ముఖములు గలవాడు అగు కుమారస్వామికి నమస్కారము. 🍁🍁🍁🍁🍁 💥శ్రీస్కంద స్తోత్రం – మహాభారతం💥 మార్కండేయ ఉవాచ | ఆగ్నేయశ్చైవ స్కందశ్చ దీప్తకీర్తిరనామయః | మయూరకేతుర్ధర్మాత్మా భూతేశో మహిషార్దనః || 1 || కామజిత్కామదః కాంతః సత్యవాగ్భువనేశ్వరః | శిశుః శీఘ్రః శుచిశ్చండో దీప్తవర్ణః శుభాననః || 2 || అమోఘస్త్వనఘో రౌద్రః ప్రియశ్చంద్రాననస్తథా | దీప్తశక్తిః ప్రశాంతాత్మా భద్రకృత్కూటమోహనః || ౩ || షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా పవిత్రో మాతృవత్సలః | కన్యాభర్తా విభక్తశ్చ స్వాహేయో రేవతీసుతః || 4 || ప్రభుర్నేతా విశాఖశ్చ నైగమేయః సుదుశ్చరః | సువ్రతో లలితశ్చైవ బాలక్రీడనకప్రియః || 5 || ఖచారీ బ్రహ్మచారీ చ శూరః శరవణోద్భవః | విశ్వామిత్రప్రియశ్చైవ దేవసేనాప్రియస్తథా | వాసుదేవప్రియశ్చైవ ప్రియః ప్రియకృదేవ తు || 6 || నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్ | స్వర్గం కీర్తిం ...

సుందరకాండకు “సుందరకాండ” అని పేరు పెట్టడానికి గల కారణాలను పండితులు చాలా రకాలైన వివరణలు, వ్యాఖ్యానాలు చెప్పారు

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ: సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి: సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం? వాల్మీకి మహర్షి అన్ని కాండలకు ఆయా కథాభాగానికి సంబధించిన పేర్లు పెట్టాడు. కాని సుందరకాండకు “సుందరకాండ” అని పేరు పెట్టడానికి గల కారణాలను పండితులు చాలా రకాలైన వివరణలు, వ్యాఖ్యానాలు చెప్పారు. సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథ ను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ.  సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది? 💥 #సుందరకాండ 💥 💥హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. 💥హనుమంతుడు సాగరమును లంఘించుట💥 తతొ రావణనీతాయాహ్...

శివుడు - హాలాహల భక్షణం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 హర హర మహాదేవ శంభో శంకర 💥 💥 శివుడు - హాలాహల భక్షణం💥 కొందరు కలడందురు నినున్ కొందరు లేదండు రతడు గుణిగాడనుచున్ కొందరు కలడని లేడని కొందలమందుదురు నిన్నుగూర్చి మహేశా! మూడుమూర్తులకును మూడులోకములకు మూడుకాలములకు మూలమగుచు భేదామగుచు దుదినభేదమై యొప్పారు బ్రహ్మ మనః నీవ ఫాలనయన!  సదసత్తత్త్వచరాచర సదనంబగు నిన్ను బొగడ జలజభవాదుల్ పెదవులు గదలుప వెరతురు వదలక నిను బొగడ నెంతవారము దేవా!  నీకంటె నొండెరుగము నీకంటెం బరులు గావనేరరు జగముల్ నీకంటె నొడయడెవ్వడు లోకంబులకెల్ల నిఖిలలోకస్తుత్యా! 💥భావం: దేవ దేవా! నీవే మాకు శరణ్యము. కొందరు నీవు ఉన్నావు అంటారు, కొందరు నీవు సాకారుడవై లేవని అంటారు, మరి కొందరు నీవు కలవో లేవో అని తికమక పడతారు. నీయొక్క నిజతత్వము ఎవ్వరికి తెలియదు కదా  పరమశివా! ఓ త్రినేత్రా! త్రిమూర్తులకు, మూడు లోకాలకు, మూడు కాలాలకు మూలమై ఉంటూ బాహ్యమైన భేదాలు కనిపించినను, నిజానికి ఏకైక పరబ్రహ్మ అభేద తత్త్వమై నీవు ఉన్నావు. సత్యము, అసత్యములతో కూడియున్న ఈ చరాచర సృష్టికి ఆశ్రయమై యున్న నిన్ను పొగడుటకు బ్రహ్మాది దేవతలు కూడా పెదవులను కదుపుటకు సాహసింపలేరు. ఇక మేమెంత? ఓ ...

సఫల ఏకాదశి శుభాకాంక్షలు

Image
 ⚜️🕉️🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🙏 వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః  హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః 💥మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశి... " సఫల ఏకాదశి"  సఫల ఏకాదశి వ్యక్తి చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తుంది. 💥సఫల ఏకాదశి పూజా విధానం: ఏదైనా ఏకాదశి ఉపవాసం దశమి నాడు సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది. దశమి తిథి నాడు సూర్యాస్తమయానికి ముందు ఆహారం తీసుకోవాలి. అనంతరం ఉపవాస నియమాలను పాటించాలీ.  ఏకాదశి రోజున  సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. అభ్యంగ స్నానం చేసి ఉపవాస దీక్ష చేపట్టాలి. గంగాజలం చల్లి విష్ణువును పూజించాలి. అక్షతలు, గంధం, పూలు, తులసి ఆకులు, అగరుబత్తీలు, తమలపాకులు, పండ్లు దేవునికి సమర్పించాలి. అనంతరం సఫల ఏకాదశి నాడు ఉపవాసం కథను చదవాలి. ప్రసాదం సమర్పించి హారతి ఇవ్వాలి.  రోజంతా మెలకువగా  నారాయణుని స్తోత్రాలను జపిస్తూ జాగారం చేయాలి. మరుసటి రోజు, స్నానం చేసిన తరువాత, ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. శక్తికి తగినట్లుగా అతనికి దక్షిణ ఇవ్వండి. దీని తరువాత, అతని ఆశీర్వాదం తీసుకుని, ఉపవాసం విరమించాలి. దశమి రాత్రి నుండి ద్వ...

ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ | ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 💥జనకుడు "శ్రీరాముడు"తో ఇలా అన్నాడు..... ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ | ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా | పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా సదా || రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు, నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో (సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం, మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి), ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది. రామ! మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామ, ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి, ఆ ఉద్ధరించడం...

ఆదిత్యహృదయస్తోత్రము తాత్పర్యము

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః 🌹🙏 💥శ్రీమద్రామాయణాంతర్గత "ఆదిత్యహృదయ" స్తోత్రము, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుల తెలుగు తాత్పర్యముతో... 💥 ఆదిత్యహృదయస్తోత్రము 💥 తతో యుద్ధపరిశ్రాన్తం సమరే చిన్తయా స్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః ॥ 2 ॥ 💥తాత్పర్యము: యుద్ధమును చూచుటకై దేవతలతో కలసివచ్చిన భగవంతుడైన అగస్త్యమహర్షి, అప్పుడు, యుద్ధముచేసి అలసి, యుద్ధమునకై వచ్చి ఎదుట ఉన్న రావణునిచూచి చింతాక్రాంతుడై ఉన్న రాముని దగ్గరకు వెళ్ళి ఇట్లు పలికెను. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ । యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥ 💥తాత్పర్యము: గొప్ప బాహువులు కల నాయనా! ఓ రామా! రామా! నిత్యమైన ఒక రహస్య స్తోత్రమును వినుము. దీనిచేత యుద్ధములో సర్వ శత్రువులను జయించగలవు. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ । జయావహం జపేన్నిత్యమక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥ సర్వమఙ్గలమాఙ్గల్యం సర్వపాపప్రణాశనమ్ । చిన్తాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥ 💥తాత్పర్యము: పుణ్యప్రదమైన ఆదిత్యహృదయస్తోత్రమును నిత్యమ...