సఫల ఏకాదశి శుభాకాంక్షలు

 ⚜️🕉️🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🙏


వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః 

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః


💥మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశి... "సఫల ఏకాదశి" 

సఫల ఏకాదశి వ్యక్తి చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తుంది.


💥సఫల ఏకాదశి పూజా విధానం:

ఏదైనా ఏకాదశి ఉపవాసం దశమి నాడు సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది. దశమి తిథి నాడు సూర్యాస్తమయానికి ముందు ఆహారం తీసుకోవాలి.

అనంతరం ఉపవాస నియమాలను పాటించాలీ. 


ఏకాదశి రోజున  సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. అభ్యంగ స్నానం చేసి ఉపవాస దీక్ష చేపట్టాలి.

గంగాజలం చల్లి విష్ణువును పూజించాలి.

అక్షతలు, గంధం, పూలు, తులసి ఆకులు, అగరుబత్తీలు, తమలపాకులు, పండ్లు దేవునికి సమర్పించాలి.

అనంతరం సఫల ఏకాదశి నాడు ఉపవాసం కథను చదవాలి. ప్రసాదం సమర్పించి హారతి ఇవ్వాలి. 


రోజంతా మెలకువగా  నారాయణుని స్తోత్రాలను జపిస్తూ జాగారం చేయాలి.

మరుసటి రోజు, స్నానం చేసిన తరువాత, ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి.

శక్తికి తగినట్లుగా అతనికి దక్షిణ ఇవ్వండి.

దీని తరువాత, అతని ఆశీర్వాదం తీసుకుని, ఉపవాసం విరమించాలి.

దశమి రాత్రి నుండి ద్వాదశి నాడు ఉపవాసం వరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి.


💥సఫల ఏకాదశి కథ:

సఫల ఏకాదశి పవిత్రను చాటి చెప్పే కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి.


పూర్వము చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనే రాజు పాలిచేవాడు.

అతనికి "లుంభకుడు" అనే కుమారుడుండేవాడు.


లుంభకుడు అధర్మ వర్తనుడై జీవిస్తుడడంతో కుమారుడని చూడకనే రాజు వానిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించెను.

లుంభకుడు అడవుల పాలై ఆహారము దొరకక తన పరిస్థితికి పశ్చాత్తాప పడుతూ మర్రిచెట్టు వద్ద రాత్రంతా గడిపి.. ఏమీ తినకుండా చింతిస్తూ సృహ తప్పి పడిపోయాడు.


ఆనాడు ఏకాదశి... ఆహారం లభించక ఉపవాసమును అప్రయత్నముగా పాటించడంతో శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెప్తున్నాయి.


లుంభకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణాంతరము వైకుంఠానికి చేరుకున్నాడని పురాణ కథనం.


💥సఫల ఏకాదశి విశిష్టత:

ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమ శివుడు స్వయముగా పార్వతికి చెప్పినట్లు పద్మ పురాణం చెబుతోంది.

అందుకే ఈ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస దీక్షను చేస్తే.. పుణ్య లోకాలను పొందుతారు.

వైకుంఠ ప్రాప్తి , ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లు కథలున్నాయి.


💥ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ, దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి.

ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి ధూపదీప నైవేద్యాలు అర్పిస్తే శుభప్రదం.


ఈ సఫల ఏకాదశి రోజున దీప దానం చేస్తే జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి.


💥ఇంకా సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి.. ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే.. ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదు.


ఏకాదశి వ్రతం  పుణ్య ప్రభావం వలన,  పాపాలు నశించి.. భూమిపై సుఖంగా జీవించి చివరకు పరమాత్మలో లీనమవుతాడని విశ్వాసం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు