పోతనను ప్రాణాలను కాపాడిన "వరాహావతారం"💥
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥పోతనను ప్రాణాలను కాపాడిన "వరాహావతారం"💥
భక్తపోతన గురిచి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
అటువంటి మహాభక్తుని జీవితంలో జరిగిన అత్యద్భుత సంఘటన చూద్దామా!
పోతన తను వ్రాసిన భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు.
కాని అప్పుడు పరిపాలిస్తున్న రాజు తనకు అంకితం ఇవ్వమని ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసాడు.
కాని పోతన అందుకు ఒప్పుకోలేదు.
ఆ రాజు పోతనను ఎలాగైనా నిగ్రహించి ఐనా భాగవతాన్ని సొంతం చేసుకోవాలని అనుకొన్నాడు.
ఒక రోజు ఆ రాజు వేట నెపముతో పోతన నివసిస్తున్న ఇంటి సమీప అడవి ప్రాంతానికి వచ్చాడు.
అడవిలో మకాం వేసి తన సైనికులను పోతన ఇంటి వద్దకు వెళ్ళి భాగవతాన్ని తీసుకు రమ్మన్నాడు.
ఆ సైనికులు పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ ఇంటి ముందు ఒక భారీ తెల్లని అడవి పంది, చాలా ఎత్తుగా కనిపించింది.
ఆ పందిని చూసి సైనికులు భయపడి రాజు వద్దకు వెళ్ళారు.
రాజు వారిని కోప్పడి తన సైన్యాధిపతులను పంపాడు.
వారు కూడా ఆ పందిని చూసి భయపడి వచ్చేసారు. ఇక లాభం లేదనుకొని రాజే బయలుదేరాడు.
ఆ రాజు కూడా ఆ పందిని చూసి ఒక బాణం వేసాడు. కాని ఆ పంది గుర్రు అనేటప్పటికి రాజు కూడా వెళ్ళిపోయాడు.
కాని రాజు ఆలోచించాడు. అంత పెద్ద పందిని, అది కూడా తెల్లని భారీ పంది భూమిపై ఎక్కడా ఉండదు కదా, బహుశా అదీ ఏ మాయో అనుకొన్నాడు. పోతనను రక్షించేందుకు వచ్చిందేమో అనుకొన్నాడు.
పశ్చాత్తాపంతో మళ్ళీ పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ పంది లేదు.
ఇంటి లోనికి వెళ్ళి పోతనను పలకరించాడు.
పోతన గారు రాజును ఆహ్వానించగా, రాజు జరిగిన విషయం చెప్పాడు.
అది విని పోతన కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చి చూస్తే పంది యొక్క కాలిముద్రలను చూసి ఆ పాదదూళిని తన తలపై వేసుకొన్నాడు.
తర్వాత ఒక అత్యద్భుత విషయాన్ని చెప్పాడు.
ఆ పందిని రాజు బయట చూసిన సమయంలో పోతన గారు "యజ్ఞ (ఆది) వరాహ మూర్తి" అవతార ఘట్టాన్ని తెలుగులోనికి అనువదిస్తున్నాడు.
ఆ వరాహమూర్తే పోతనను కాపాడాడు.
🍁🍁🍁🍁🍁
💥శ్రీ ఆదివరాహ స్తోత్రం (భూదేవీ కృతం)💥
నమస్తే దేవ దేవేశ వరాహవదనాచ్యుత |
క్షీరసాగరసంకాశ వజ్రశృంగ మహాభుజ || ౧ ||
అనేకదివ్యాభరణయజ్ఞసూత్రవిరాజిత |
అరుణారుణాంబరధర దివ్యరత్నవిభూషిత || ౨ ||
ఉద్యద్భానుప్రతీకాశపాదపద్మ నమో నమః |
బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబలపరాక్రమః || ౩ ||
దివ్యచందనలిప్తాంగ తప్తకాంచనకుండల |
ఇంద్రనీలమణిద్యోతిహేమాంగదవిభూషిత || ౪ ||
వజ్రదంష్ట్రాగ్రనిర్భిన్నహిరణ్యాక్షమహాబల |
పుండరీకాభిరామాక్ష సామస్వనమనోహర || ౫ ||
శృతిసీమంతభూషాత్మన్సర్వాత్మన్చారువిక్రమః |
చతురాననశంభుభ్యాంవందితాయతలోచనా || ౬ ||
సర్వవిద్యామయాకారశబ్దాతీత నమో నమః |
ఆనందవిగ్రహానంత కాలకాల నమో నమః || ౭ ||
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment