విద్యకు అధిపతి.. విద్యార్థులకు జ్ఞానప్రదాత హయగ్రీవుడు💥

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం

విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం

దయానిధిం దేహభృతాం శరణ్యం

దేవం హయగ్రీవమహం ప్రపద్యే

🍁🍁🍁🍁🍁


💥సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు, ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి అని అంటూ వుంటారు.


అలా తన భక్తులను చల్లగా చూడటం కోసమే శ్రీమహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతారాల్లో ‘#హయగ్రీవావతారం’ ఒకటి. 


జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥


💥భావం:

జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము. 

🔹🔸🔹🔸🔹🔸


💥విద్యకు అధిపతి.. విద్యార్థులకు జ్ఞానప్రదాత హయగ్రీవుడు💥


💥పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు.

గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు... బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు.

తన ఆకారాన్ని పోలినవారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు.


వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానార కాలుగా హింసించ సాగాడు.

దాంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు.

యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది.


మహా విష్ణువు దానవులతో పోరు సల్పి చాలా అలసిపోయి తన చేతిలోని ధనస్సునే ఆధారం చేసుకొని నిద్రపోయాడు.


నిద్రాదేవి ఒడిలో సేద తీరుతున్న మహావిష్ణువును మేల్కొపడానికి ఏ హేతువు కన్పించక ఇంద్రాది దేవతలు చెదపురుగును ధనస్సుకున్న అల్లెత్రాడును కొరకమన్నారట.

ఆ శబ్దం వల్ల మహావిష్ణువు మేల్కొంటాడన్న ఆశతో.


ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపాడు.

వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల... శరీరం నుంచి వేరై పోయింది. 


ఇక అపుడు ఏమి చేయాలో తోచక పరాశక్తిని వేడుకొంటే ఆ తల్లి అశ్వముఖాన్ని మహావిష్ణువుకు అతికించమని చెప్పిందట. 


ఆ అమ్మ చెప్పినట్టుగా దేవతలు చేయగా హయగ్రీవ అవతారుడయినాడు మహావిష్ణువు.


గుర్రం శిరస్సును పొందిన నారాయణుడుకి అమ్మవారితో సహా దేవాధి దేవతలు తమ జ్ఞాన శక్తిని ధారపోస్తారు.


ఆ పైన వేదాలను అపహరించిన హయగ్రీవుడను రాక్షసునితో పోరాడి మహావిష్ణువు విజయం సాధించాడు.

రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది.


తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు.


అశ్వ ముఖంతో, మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్త్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి హయగ్రీవావతారాన్ని చూచిన దేవతలందరూ చేతులెత్తి మొక్కారు.


లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని కొలవడం వల్ల విద్యార్థులకు విద్యనే కాదు అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుంది.

భూవివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించ బడుతాయి.

శత్రు వినాశనం కూడా జరుగుతుంది.

ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు