ఆది గురువు దక్షిణామూర్తి గుణగణాలు:

 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏


రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్

సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్

ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే


💥తాత్పర్యం:

రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును.

అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును.

ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును.


ఎలాగైతే నిద్ర నుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకు ముందు నిద్రలో యున్నాను, మరియు ఆ నిద్ర లోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో,

అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు.


ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

🍁🍁🍁🍁🍁


💥ఆది గురువు దక్షిణామూర్తి గుణగణాలు:


ప్రధానంగా దక్షిణామూర్తి చాలా శాంత స్వరూపులు.

అసలు దక్షిణామూర్తి అనే పేరు దక్షిణం వైపు ఉండే మూర్తిగా కొందరికి తెలుసు.

అయితే దక్షిణామూర్తిలో దక్షిణము అనగా దాక్షిణ్యం ( సమర్ధత ) కురిపించే స్వామీ అనే అర్ధం కూడా వస్తుంది.  


చాలా వరకూ దక్షిణామూర్తి ఫోటోను పరిశీలిస్తే ఆయన తత్త్వం చాలా వరకూ అర్ధమైపోతుంది. 


దక్షిణామూర్తిని చూడగానే ఆయన చిన్ ముద్రలో మర్రిచెట్టు క్రింద కూర్చిని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కి ఉండగా క్రింద ఋషులు కూర్చుని ఉంటారు. 


ప్రశాంతంగా కనిపించే స్వామి కుడివైపు చెవికి నాగాభరణం ఉండగా ఎడమవైపు చెవికి జగన్మాత యొక్క కర్ణాభరణం ఉంటుంది.


దీనినిబట్టి అర్ధనారీశ్వర రూపంలో ఆ స్వామి భక్తులను ఆశీర్వదిస్తున్నారని తెలుస్తోంది.


ఇక ప్రతీ ఒక్కరూ వెళ్ళే శివాలయాలలో దక్షిణ దిక్కు వైపు ఉన్న దక్షిణామూర్తిని ద్యానించడం చాలా మంచిది.


దక్షిణం వైపు ఉన్న స్వామికి ఎదురుగా ఆప్రాంతంలో స్వామికి అభిముఖంగా కూర్చొని స్వామిని ద్యానించడం వల్ల అపమృత్యువు దరిచేరదు.


సాధారణంగా గురుగ్రహ దోషాలు ఉన్న వారు తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రం ప్రారాయణ చేయడం వల్ల వాళ్ళ గురు గ్రహ బలం కలుగుతుంది.


దుఖాలకు మూలమైన అజ్ఞానం అటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే స్వామియే దక్షిణామూర్తి.


జ్ఞానం కోరుకునే వాళ్ళకు జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని సైతం ప్రసాదించే స్వామి దక్షిణామూర్తి.


దక్షిణామూర్తిని ఆరాధించే వారికి సంపదకు కొదవ ఉండదు.


💥శ్రీదక్షిణామూర్తి స్తోత్రం💥


ధ్యానశ్లోకములు:


మౌనవ్యాఖ్యాప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానం


వర్షిష్ఠాన్తే వసదృషిగణైఃరావృతం బ్రహ్మనిష్ఠైః |


ఆచార్యేన్ద్రం కరకలితచిన్ముద్రమానన్దరూపం


స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || 1 ||


వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణాం


సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |


త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం


జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || 2 ||


చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా


గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః || 3 ||


గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం


నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః || 4 ||


ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే 


నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః || 5 ||


ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వమ్


యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |


తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం


ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే || 6 ||


ఓం శాంతిః శాంతిః శాంతిః

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం