గజాననుని రూపం
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
💥 గణపతి ధ్యానం 💥
శివ తనయ వరిష్టం సర్వ కళ్యాణ మూర్తిం
పరశు కమల హస్తం మూషికం మోదకేన
అరుణ కుసుమవాల వ్యాళలంబోదరంతం
మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి ||
కబుద ధవళ వర్ణం పూర్ణ లక్ష్మి ప్రసన్నం
మదగజముఖ మీడ్యం సంజలత్ కర్మయుగమం
అభయ వరద హస్తం వాసుకీ యజ్ఞ సూత్రం
మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి ||
🍁🍁🍁🍁🍁
💥 మహాగణపతిం మనసాస్మరామి 💥
💥గజాననుని రూపం
ఆధ్యాత్మికత మోక్ష సిద్ధికి వక్రమైన ఆటంకములగు అరిషడ్వర్గములను (కామ క్రోధములు) నశింపచేసి, చిత్తైకాగ్రత నొసగి, స్వస్వరూప సంధానతతో జీవ బ్రహ్మైక్య స్థితిని అనుగ్రహించువాడు వక్రతుండుడు.
💥విఘ్నేశ్వరుని చేతిలోని పాశ అంకుశాలు - రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు.
💥గణపతికి ప్రియమైన భక్ష్యం - మోదకం. ఆనందాన్నిచ్చేది మోదకం.
కృపా కటాక్షములతో ఆనందం లభిస్తుంది.
💥నాగయజ్ఞోపవీతం - కుండలినీ శక్తికి సంకేతం.
మనిషి క్రోధాన్ని విడిచి అనురాగాన్ని అభివృద్ధి చేసికొని శాంతి సహజీవనంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు విశ్వప్రేమ భావనా భక్తిని పెంపొందించుకొని జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఆయుధదారుడు విఘ్నేశ్వరుడు.
‘యుక్తాహార విహారస్య’ అన్నాడు గీతాచార్యుడు. ఆహార నిద్రాదులు అన్నమయ కోశమునకు సంబందించినవి.
తమో గుణానికి నిదర్శనము
‘బ్రతకడం ఆహారం కోసమే’ అనుకునే తిండిపోతులు తమోగుణాన్ని చంపుకోలేరు.
అటువంటి వారిని గూర్చి ఇతరులు జాలిపడటం, మనసులోనైనా పరిహసించటం సహజం.
యోగి అయిన వాడు యుక్తాహార విహారాదులతో, తమో గుణాన్ని జయించి సత్త్వగుణ సంపన్నుడై, త్రిగుణాతీతుడై, కుండలినీ యోగ సిద్ధుడై ఆనందమయ స్థితిని పొంది, చరితార్థుడు కావాలని తన శరీరాకృతి నాగ యజ్ఞోపవీతంతో తెలియజేసి, హెచ్చరించేవాడు - బొజ్జ గణపయ్య.
💥మూషిక వాహనం: అంతరార్థం
మూషికం (ఎలుక) వాసనామయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది, బోనులో చిక్కుకుంటుంది.
ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పడతారు.
మూషిక వాహనుడుగా, వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు - వినాయకుడు.
అంతేకాదు, అహంకారానికి చిహ్నం ఎలుక (మూషికం).
అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చెందిస్తుంది. బుద్ధిపతి అయిన మహా గణపతి దానిని మలిచి జయించి సద్వినియోగం చేస్తాడు.
మూషిక వాహనుడైన గణపతి సమృద్ధినిస్తాడు.
💥సహస్ర పరమాదేవీ శతమూలా శాతాంకురా
సర్వణ్‌ం హరతు మే పాపం దుర్వాదుస్వప్న నాశినీ
సకల కల్మషములను తొలగించే సర్వశ్రేష్ఠమైన ఓషధీ, లెక్కకు మించిన కణుపులు, చిగుళ్లు కలిగి దుష్ట తలంపుల ప్రభావమును తొలగించు శక్తి గల పరమాత్మ స్వరూపమైన దూర్వాయుగ్మము, మనలోని మాలిన్యాన్ని తొలగిస్తుంది, అని ‘దూర్వాసూక్తము’ పేర్కొన్నది.
దూర్వాయుగ్మము అంటే గరిక.
అందుకే గణపతిని గరికతో అర్చిస్తే సర్వ శుభాలను ప్రసాదిస్తాడు. మనోమాలిన్యాలను తొలగిస్తాడు.
💥వినాయకుని సందేశం💥
పుట్టుకకు, జీవించటానికి, గమ్యాన్ని చేరుకోవటానికి ఏ తల్లిదండ్రులు ఆధారమో, వారే జీవిత లక్ష్యమునకు కూడా ఆధారమనే సత్యసూక్తిని అందించాడు వినాయకుడు.
మహాభారత రచనకు లేఖకునిగా వ్యవహరించిన సందర్భంలో మధ్యలో ఘంటము విరిగిపోయినప్పుడు, తన దంతమును కలముగా చేసికొని, మహాభారత రచనకు విఘ్నము కలుగకుండా చేసి ‘త్యాగేనైకా అమృతత్వమానసుః’ అనే ఆదర్శాన్నందించాడు - వినాయకుడు.
అహంకారాన్ని దరికి రానీయక, భూత దయ కలిగి స్వార్థరహితంగా, త్యాగబుద్ధితో అమృతమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వ మానవ కళ్యాణాన్ని వీక్షించే వారికి ఎదురయ్యే విఘ్నాలను నేను తొలగిస్తానని అభయ హస్తం యిస్తున్నాడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment