⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 💥విశ్వజనని... స్కందమాత శరన్నవరాత్రులలో 5వ రోజు ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారు "స్కందమాత దుర్గా" అవతారంలో దర్శనమిస్తారు. "స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః" శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తనయుడికి స్కందుడు అని పేరు. ఈయనకే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని పలు పేర్లున్నాయి. స్కందుని తల్లికావడంతో అమ్మవారికి ‘స్కంద మాత’ అని పేరు. నవదుర్గలలో ఇది ఐదో రూపం. 💥#ధ్యాన_శ్లోకం సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ నాలుగు చేతులతో ఉండే స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలశం, ఘంటా ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా, స్కందుడు (కుమారస్వామి) ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. స్కందమాతాను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైనా జ్ఞానం ప్రాసాదిస్తుందని పురాణోక్తి. తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె. నిస్వార్ధ భక్తి చూపేవారికి జీవితంలో ఇహ, పర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం. ఈ అమ్మవారిని పూజించేట...