ఆరవ రోజు: విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తారు.

 ⚜️🕉️🚩ఓం దుర్గాయై నమః🌹🙏


💥శరన్నవరాత్రి ఉత్సవాలు💥


ఆరవ రోజు: విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తారు.


మంత్రం: ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ:


నైవేద్యం: క్షీరాన్నం, చక్కెర పొంగలి ప్రసాదం


చీర: పింక్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.


ఈ మహాలక్ష్మి అవతారంలో మంగళప్రదమైన దేవతగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు.


సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే!

భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్‌!!


కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మ దర్శనమిస్తుంది.


మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి.


సిరిసంపదలు, సంతానం, సౌభాగ్యం, ధైర్య సాహసాలు, విజయాలు ప్రసాదించే దేవత శ్రీ మహాలక్ష్మి.

సకల లోకాలకు ఈమె ఐశ్వర్య ప్రదాత.

ఈమె క్షీరాబ్ధి పుత్రిక.


డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి.

శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి.

ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


"యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా”

- అంటే.. అన్ని జీవులలోను ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది.

కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.


మహాలక్ష్మి ఉపాసనతో లౌకిక సంపదతోపాటు అలౌకికమైన మోక్షసంపద కూడా లభిస్తుంది.


శ్రీసూక్త విధానంగా ఎర్రని పుష్పాలతో, లక్ష్మీ అష్టోత్తర నామాలతో అర్చించి, పూర్ణాలు నివేదన చేయాలి.

అమ్మకు ప్రీతిగా సువాసినీ పూజ చేయాలి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏