శరన్నవరాత్రులలో 5వ రోజు ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారు "స్కందమాత దుర్గా"

 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏


💥విశ్వజనని... స్కందమాత


శరన్నవరాత్రులలో 5వ రోజు ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారు "స్కందమాత దుర్గా" అవతారంలో దర్శనమిస్తారు.


"స్కందయతీతి శత్రూన్‌ శోషయతీతి స్కందః"

శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తనయుడికి స్కందుడు అని పేరు.

ఈయనకే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని పలు పేర్లున్నాయి.


స్కందుని తల్లికావడంతో అమ్మవారికి ‘స్కంద మాత’ అని పేరు. నవదుర్గలలో ఇది ఐదో రూపం.


💥#ధ్యాన_శ్లోకం


సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా

శుభమస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ


నాలుగు చేతులతో ఉండే స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది.

చేతిలో కమలం, జలకలశం, ఘంటా ఉంటాయి.

ఒక చేయి అభయముద్రలో ఉండగా, స్కందుడు (కుమారస్వామి) ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు.


ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు.

స్కందమాతాను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైనా జ్ఞానం ప్రాసాదిస్తుందని పురాణోక్తి.

తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె.


నిస్వార్ధ భక్తి చూపేవారికి జీవితంలో ఇహ, పర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం.

ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం, మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవీ పురాణం చెబుతుంది.


ఈ అమ్మవారిని పూజించినప్పుడు, ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తునిచేత పూజింపబడతాడు.

దాంతో ఆ ఇద్దరి ఆశీస్సులూ భక్తునికి వస్తాయని భక్తుల నమ్మకం.


ఈ అమ్మవారి ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తుంటారట.

స్కందమాతా దుర్గా దేవిని పూజిస్తే జీవితం చివర్లో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి.

ఈ దేవి అగ్నికి అధిదేవత కూడా.


శంభు, నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాతా దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి అసురులను చంపుతుంది.

సేకరణ...💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏