ఐదో రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారు "శ్రీ మహా చండీ దేవి"గా దర్శనమిస్తారు.

 ⚜️🕉️🚩 ఓం దుర్గాయై నమః🌹🙏


💥శరన్నవరాత్రి ఉత్సవాలు💥


ఐదో రోజు: విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారు "శ్రీ మహా చండీ దేవి"గా దర్శనమిస్తారు.


మంత్రం: ఓం శ్రీ మహా చండీ దేవ్యై నమ:


నైవేద్యం: లడ్డూ ప్రసాదం


చీర: రెడ్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.


అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటి. చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని ప్రజలు విశ్వసిస్తారు.


దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీమహాచండీ అమ్మవారు ఉద్భవించారు. 


ఆమెలో అందరు దేవతలూ కొలువై ఉన్నారు. అందుకే శ్రీమహాచండీ దేవివి ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టేనంటారు పెద్దలు.


శ్రీమహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలన్నీ సిద్ధిస్తాయనేది భక్తుల విశ్వాసం.


ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు.

ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు.


లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది. 


మహా చండీ శక్తివంతమైన దేవత. ఈ రోజున ఆమెను పూజించడం ఆదిశక్తిని పూజించినట్లే.

ఆమె శ్రేయస్సు, విద్య మరియు జీవితంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏