💥ఆదిత్యహృదయ పారాయణ వైశిష్టత
⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥 ఆదిత్యహృదయ పారాయణ వైశిష్టత 💥 ఆదిత్య హృదయంలో 3 నుండి 5 శ్లోకాలు: ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది. రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం | యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి || 3 || అర్థము: ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం | జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం || 4 || అర్థము: ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది. సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం | చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం || 5 || అర్థము: ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును. ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధి పరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము. సేకరణ... 💐🙏 ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️