⚜️🕉️🚩ఓం సరస్వత్యై నమః🌹🙏

 ⚜️🕉️🚩ఓం సరస్వత్యై నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥సరస్వతీ మంత్రము:


ఓం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిఃవాజినీ వతీ |

ధీనామవిత్ర్యవతు || ఓం ||


వాజేభిః=ప్రణమిల్లే వారిని;

వాజినీవతీ=కాపాడేదానవైన;

దేవీ సరస్వతీ=సరస్వతీ దేవీ;

ప్రణో= మనలను కాపాడనీ;

ధీనాం=వాక్ శక్తులను;

అవిత్ర్యవతు=జాగృతం చేయుగాక!


🌹ప్రణమిల్లే యావన్మందినీ కాపాడే సరస్వతీదేవి

మనలను కాపాడు గాక! వాక్ శక్తులను ప్రేరేపించి మనలను జాగృతం చేయుగాక!


తల్లీ! భారతి! సరస్వతీ! వందనమమ్మా!

పవిత్ర ధారణ మేధా శక్తిని మాకిచ్చి మంచి మాటలతో వాక్శక్తినీ సమకూర్చి మమ్ముల జాగృతి చేయుము తల్లీ!


 నీ కృపా కటాక్షములు మాపై జూపి జ్ఞాన బుధ్ధి మనో శక్తి ప్రసాదించుమమ్మా!

మా జిహ్వాగ్రాన సదా నిలిచి వికసిత వదనయై మము శ్రేయోదాయుల చేయుము తల్లీ!


క్షీరనారముల వేరు పరచు హంస వాహనారూఢవై

అంతర్లీనవై మా క్రియలలో పాలు పంచుకొని సుఖ సంపదల నొసగుతావని నిత్యము నిన్నే తలచెదమమ్మా! 


💥సరస్వతీదేవి ఉపాసకుడైన శ్రీనాథుడు ఆ దేవి

రూపాన్ని ఈ క్రిందివిధంగా వర్ణించాడు.


సింహాసనము చారుసిత పుండరీకంబు


చెలికత్తె చెలువారు పలుకు జిలక


శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు


పసిడి కిన్నెరావీణె పలుకుదోడు


నలువ నెమ్మోము దమ్ములు కేళీగృహములు


తళుకుటద్దంబు సత్కవుల మనసు


వేదాది విద్యలు విహరణ స్థలములు


చక్కని రాయంచ యెక్కిరింత


యెపుడు నే దేవికాదేవి యిందుకుండ


చంద్రచందన మందార సారవర్ణ


శారదాదేవి మామకస్వంత వీధి


నిండు వేడుక విహరించు చుండుగాత


🌹ఆ తల్లి కూర్చున్న సింహాసనం అందమయిన తెల్లని పద్మం.

ఆమెకు చెలికత్తె చక్కటి పలుకులు పలికే హిలుక.

అమ్మ అలంకరించుకున్న పువ్వు బాలచంద్రుడు.

అమ్మ పాటలకు తోడుగా బంగారు కిన్నెరా వీణ మ్రోగుతుంటుంది.


బ్రహ్మదేవుని ముఖపద్మాలే అమ్మవారు ఆడుకునే కేళీగృహాలు.

సత్కవుల మనసే అమ్మవారి ప్రతిబింబం కనబడే తళుకుటద్దం.

వేదాది సకల విద్యలు అమ్మవారి నివాసాలు.

చక్కని రాజహంస ఆ తల్లి వాహనం.


సితపుండరీకం, చిలుక, చుక్కలరాజు చంద్రుడు, పసిడి కిన్నెరా వీణ, బ్రహ్మ ముఖాలు, సత్కవుల మనస్సు, వేదాది విద్యలు, రాయంచ...ఇవన్నీ అమ్మను సేవిస్తున్నాయి.


ఆ దేవి తెల్లని రంగు గల వస్తువులతో, దుస్తులతో ధగధగా మెరిసిపోతోంది.

అటువంటి దేవి నా హృదయంలో ఆనందస్వరూపిణిగా విహరించుతుండు గాక అని కవిసార్వభౌముడు కోరుకున్నాడు.

ఆయన కోరుకున్నట్లే సరస్వతీ మాత మనకు తగిన విద్యలను నేర్పించి, నిత్యం మనలను ఆనందసాగరంలో ఉండేట్లు దీవించుగాక!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏